యాంకరేజి పోర్టులో మంత్రి అమర్నాథ్‌ శంకుస్థాపనలు | Minister Amarnath lays foundation stones at Anchorage Port | Sakshi
Sakshi News home page

యాంకరేజి పోర్టులో మంత్రి అమర్నాథ్‌ శంకుస్థాపనలు

Published Fri, Nov 25 2022 11:13 AM | Last Updated on Fri, Nov 25 2022 2:54 PM

Minister Amarnath lays foundation stones at Anchorage Port - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, కాకినాడ: కార్గో ఎగుమతుల వార్షిక సామర్థ్యాన్ని 3 మిలియన్‌ టన్నులకు పెంచేందుకు సాగరమాల కార్యక్రమం కింద రూ.91 కోట్లతో మంజూరు చేసిన కాకినాడ యాంకరేజి పోర్టు అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ పనులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రాజా, వేణుగోపాలకృష్ణ, ఎంపీ గీత, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

ఇందులో భాగంగా పోర్టులో రెండు మెకానికల్‌ కార్గో హ్యాండ్లింగ్‌ వార్ఫులు, న్యూ పోర్టు ఏరియాలో 5 అదనపు లోడింగ్‌ పాయింట్ల నిర్మాణం, పోర్టు అనుబంధ, అంతర్గత రహదారుల అభివృద్ధి, కమర్షియల్‌ కెనాల్‌ గ్రోయిన్లు, రివిట్‌మెంట్ల మరమ్మతులు, కమర్షియల్, అప్రోచ్‌ కెనాల్‌ డ్రెడ్జింగ్‌ పనులు చేపట్టనున్నారు. ఈ పనులు చేసేందుకు హైదరాబాద్‌ఉ చెందిన విశ్వసముద్ర హోల్డింగ్స్‌ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏడాది కాలంలో ఈ పనులు పూర్తి చేయనున్నారు.

చదవండి: (National Highways: రాయలసీమకు కొత్తగా 9 జాతీయ రహదారులు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement