సాక్షి, విజయవాడ: పరిహారం విషయంలో దేశానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదర్శంగా నిలిచారని మంత్రి కొడాలి నాని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో రూ.50 లక్షలు, ఎల్జీ పాలిమర్స్ ఘటనలో రూ.కోటి చొప్పున పరిహారం ఇచ్చారని పేర్కొన్నారు. (చదవండి: మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చెక్కులు)
‘‘చంద్రబాబు ‘ఎల్జీమర్’ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన కమ్మ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. తనకు విరాళాలు ఇచ్చే వారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. రమేష్ ఆస్పత్రి నిబంధనలు ఉల్లంఘించింది. రమేష్‌ను రక్షించేందుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రయత్నం జరుగుతుంది. చంద్రబాబు తన ఇంట్లోనే డాక్టర్ రమేష్‌ను పెట్టుకుని కాపలా కాస్తున్నారు. చంద్రబాబు కాపలా కాసినా రమేష్‌ను అరెస్ట్ చేస్తాం. బాధితుల పరామర్శకు వస్తే కరోనా వస్తుందని హైదరాబాద్‌లో దాక్కున్నారు. తనకు కూడా ఎక్స్‌గ్రేషియా వస్తుందని బాబు భయపడుతున్నారని’’ కొడాలి నాని ఎద్దేవా చేశారు. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం వైఎస్ జగన్‌ను లేదన్నారు. చంద్రబాబుకు వయస్సు పెరిగిన బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటుకు 25 ఏళ్లు అని, రానున్న రోజుల్లో టీడీపీకి 23 సీట్లు కూడా రావని మంత్రి కొడాలి నాని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment