సాక్షి, అమరావతి: నూతన పారిశ్రామిక విధానాన్ని పారిశ్రామిక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పాలసీ విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల ప్రతిరూపం. ప్రజలు, పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసే సరికొత్త పారిశ్రామిక విధానం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించారు. పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక వేత్తల ఆశాకిరణం.. పెట్టుబడిదారులు నష్టపోకుండా చర్యలపై సమదృష్టి చూపనుంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు అందించనున్నారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు (ఎమ్ఎస్ఎమ్ఈ) పెద్ద సాయంగా నిలవనుంది. పారదర్శకత, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఫార్మా, టెక్స్‌టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మెగా ప్రాజెక్టులకు పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా అదనపు రాయితీలు ఉండనున్నాయి.
నూతన పారిశ్రామిక విధానం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఏపీ: కొత్త ఇండస్ట్రియల్ పాలసీ విడుదల
Published Mon, Aug 10 2020 11:29 AM | Last Updated on Mon, Aug 10 2020 2:48 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment