NEW industrial policy
-
100 రోజుల్లో 5 నూతన పారిశ్రామిక పాలసీలు
అమరావతి/మడకశిర: రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ అనువైన వాతావరణం కల్పించేలా ఐదు నూతన పారిశ్రామిక విధానాలను 100 రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. నూతన పారిశ్రామిక విధానంతో పాటు ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్, ఐటీ అండ్ క్లౌడ్ పాలసీ, టెక్స్ టైల్ పాలసీలు తేవాలని సూచించారు. సచివాలయంలో బుధవారం పరిశ్రమల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ హబ్‌గా చేయాలన్న లక్ష్యంతో పాలసీలు రూపొందించాలని సూచించారు. కుప్పం, మూలపేట, చిలమత్తూరు, దొనకొండ లేదా పామూరులో కొత్త పారిశ్రామిక క్లస్టర్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, హార్డ్ వేర్ సంస్థల ఏర్పాటుకు కృషి చేయాలని చెప్పారు. కృష్ణపట్నం, నక్కపల్లి, ఒర్వకల్లు, కొప్పర్తి నోడ్స్ పనితీరుతో పాటు నక్కపల్లిలో రూ.11,542 కోట్లతో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్క్, రూ.60 వేల కోట్లతో ఏర్పాటయ్యే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ప్రస్తుతం చర్చలు జరుపుతున్న బీపీసీఎల్ ప్రాజెక్టుల స్థితిగతులపై సీఎం సమీక్షించారు.ప్రోత్సాహకాల అంశాన్ని పరిశీలిస్తాం..2014–19 హయాంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకుని వెనక్కి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్తలతో తిరిగి సంప్రదింపులు జరపాలని, అవసరమైతే తానే వారితో మాట్లాడతానని సీఎం చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో పనులు ప్రారంభించిన ప్రాజెక్టులను వేగవంతం చేయడం ద్వారా ఏడాదిలో లక్ష కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేసి 1,36,260 మందికి ఉపాధి కల్పించాలన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక వాడలో భూముల రేట్లు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.నేడు సత్యసాయి జిల్లాకు చంద్రబాబుసీఎం చంద్రబాబు గురువారం శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మడకశిర మండలం కె.గుండుమలలో మ«ధ్యాహ్నం 2.20 గంటలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. గ్రామ ప్రజలు, పట్టు రైతులతో ముఖాముఖి సమావేశమవుతారు. మల్బరీ షెడ్, పట్టు పురుగుల పెంపకాన్ని పరిశీలిస్తారు. కాగా, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర శాఖ కార్యదర్శి కె.రామకృష్ణ సీఎం చంద్రబాబును సచివాలయంలో బుధవారం కలిశారు. అలాగే టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్సార్సీపీ నేతలు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అదే విధంగా సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. -
మన పారిశ్రామిక విధానం దేశానికే ఆదర్శం
షాబాద్: తెలంగాణలో నూతన పారిశ్రామికవిధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని సీతారాంపూర్‌లో 250 ఎకరాల్లో రూ.1,200 కోట్లతో కిటెక్స్ గ్రూప్స్ రెండో యూనిట్, చందనవెళ్లిలో రూ.272 కోట్లతో సింటెక్స్ మూడో యూనిట్‌కు గురువారం మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, రోహిత్‌రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దేశ, విదేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తోందని, సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి ఇదే నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో సీతారాంపూర్, చందనవెళ్లి గ్రామాలు పారిశ్రామిక ఖిల్లాలుగా మారుతాయని, ప్రపంచ చిత్రపటంలో ఇవి మార్మోగుతాయని చెప్పారు. షాబాద్‌లో తయారు చేసిన సింటెక్స్ డబ్బాలు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలున్నాయన్నారు. టెక్స్టైల్స్, నాపరాయి పరిశ్రమలు పూర్తయితే వేలాది మంది మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అంతకుముందు ఆయన సీతారాంపూర్ చౌరస్తా వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రెండు నెలల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంతో తెలంగాణలో పార్రిశామిక విధానం ముందుకు సాగుతోందని అన్నారు. త్వరలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. కార్యక్రమంలో వెల్స్పన్ సంస్థ అధినేత బాలకృష్ణ గోయెంకా, కిటెక్స్ జాకబ్, జిల్లా కలెక్టర్ హరీశ్, తదితరులు పాల్గొన్నారు. -
చిన్నవైనా.. మిన్నగానే! మరింత అండగా నిలిచేలా నూతన పారిశ్రామిక విధానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా 2023 – 27 నూతన పారిశ్రామిక విధానంలో పలు ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా కోవిడ్ సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీ, వైఎస్సార్ నవోదయం లాంటి పథకాల ద్వారా ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో మరింత అండగా నిలిచేలా పాలసీలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. కొత్తగా ఏర్పాటయ్యే ఎంఎస్ఎంఈలతో పాటు ఇప్పటికే ఏర్పాటైన యూనిట్లకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించే విధంగా పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఎలాంటి కాలయాపన లేకుండా తక్షణం ఉత్పత్తి ప్రారంభించే విధంగా ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక వసతులను కల్పించనున్నారు. ఏపీఐఐసీ అభివృద్ధి చేసే నూతన పారిశ్రామిక పార్కుల్లో 33 శాతం భూమిని ఎంఎస్ఎంఈలకు కేటాయించనున్నారు. ఇందులో కూడా తక్షణం కార్యకలాపాలు ప్రారంభించే విధంగా ప్లగ్ అండ్ ప్లే, స్టాండర్డ్ డిజైన్ ఫ్యాక్టరీ స్పేస్‌లను ఈ రంగ యూనిట్ల కోసం ఏర్పాటు చేయనున్నారు. భూ కేటాయింపుల్లో 16.2 శాతం ఎస్సీ పారిశ్రామిక వేత్తలకు, 6 శాతం ఎస్టీ పారిశ్రామికవేత్తలకు పారిశ్రామిక పార్కుల్లో రిజర్వేషన్లు కల్పించింది. ప్రైవేట్ రంగంలో పార్కుల అభివృద్ధి ప్రైవేట్ రంగంలో ఎంఎస్ఎంఈ పార్కులు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. కనీసం 25 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు లేదా కనీసం 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో డిజైన్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లను నిర్మించే సంస్థలకు ఈ ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. వీటి నిర్మాణ వ్యయంలో 25 శాతం లేదా గరిష్టంగా రూ.కోటిని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణం కోసం సేకరించిన భూమికి సంబంధించి 100 శాతం స్టాంప్ డ్యూటీ మినహాయింపు, భూ వినియోగ మార్పిడికి సంబంధించి 100 శాతం నాలా చార్జీలకు మినహాయింపు లభిస్తుంది. టర్మ్ రుణాల వడ్డీపై 3 శాతం వడ్డీ రాయితీ చెల్లింపు గరిష్టంగా మూడేళ్లపాటు కోటి రూపాయలు లభించనుంది. పార్కుల్లో ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటు ఆధారంగా ఈ రాయితీలు చెల్లించనున్నారు. పార్కుల్లో 50 శాతం ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైతే 50 శాతం రాయితీలు, 100 శాతం పూర్తయిన తర్వాత మిగిలిన రాయితీలు చెల్లిస్తారు. పాతవాటికి చేయూత ఇప్పటికే ఏర్పాటైన ఎంఎస్ఎంల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ కష్టాల్లో ఉన్న సంస్థలకు చేయూతనందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యవస్థను తెస్తోంది. ఎంఎస్ఎంఈల ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఆన్లైన్ ఫ్లాటఫామ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జీఎస్టీ డేటాబేస్ ఆధారంగా ఎంఎస్ఎంఈల టర్నోవర్‌ను పర్యవేక్షిస్తూ ఒకవేళ తగ్గితే అందుకు కారణాలను అధికారులు పరిశీలిస్తారు. కోలుకునేందుకు సూచనలు చేయడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంపై చర్చిస్తారు. ఇందుకు ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేకంగా ఒక కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పోటీ వాతావరణాన్ని తట్టుకుని వ్యయాలను తగ్గించుకోవడం, అప్‌గ్రెడేషన్ దిశగా ప్రోత్సహించేలా పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. అద్భుతమైన పాలసీ: దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం ఎంఎస్ఎంఈ, స్టార్టప్, మౌలిక రంగ పరిశ్రమలకు అద్భుతమైన పాలసీ అని దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మామిడి సుదర్శన్ ప్రశంసించారు. స్టార్టప్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు, విశాఖలో స్టార్టప్ మిషన్ ఏర్పాటుకు ఇది ఎంతో దోహదం చేస్తుందన్నారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, ప్యాకేజింగ్ పరిశ్రమలు, ట్రక్ పార్కింగ్ వ్యవస్థల ఏర్పాటుతో రాష్ట్రంలో లాజిస్టిక్ రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అన్ని రంగాలను అభివృద్ధి చేసేలా పాలసీ ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్‌కు దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఇలా ఆదుకున్నారు.. ఎంఎస్ఎంఈ రంగానికి తోడ్పాటునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ యూనిట్ల సంఖ్య 1.10 లక్షలు కాగా గత మూడున్నరేళ్లలో కొత్తగా 1.56 లక్షల యూనిట్లు ఏర్పాటు కావడమే దీనికి నిదర్శనం. రాష్ట్రంలో ఒక్కో ఎంఎస్ఎంఈ యూనిట్ సగటున 10 మందికి ఉపాధి కల్పిస్తోంది. కొత్త యూనిట్ల ద్వారా సుమారు 10.04 లక్షల మందికి ఉపాధి లభించడమే కాకుండా రూ.20,537.28 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వకుండా గత సర్కారు బకాయి పెట్టిన రూ.962.05 కోట్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చెల్లించడమే కాకుండా ఏ సంవత్సరం రాయితీలను అదే ఏడాది చెల్లిస్తోంది. రూ.1,715.16 కోట్ల రాయితీలను, రూ.1144 కోట్ల విలువైన విద్యుత్ రాయితీ ప్రోత్సాహకాలను ఈ ప్రభుత్వం చెల్లించింది. అంతేకాకుండా వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం ద్వారా 2020–21లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.235.74 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.41.58 కోట్ల రాయితీలను విడుదల చేసింది. 2021–22లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.111.78 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.24.41 కోట్లు రాయితీలను విడుదల చేసింది. -
నూతన పారిశ్రామిక విధానంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
తాడేపల్లి : స్టార్టప్ కాన్సెప్ట్‌ను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలో సుమారు మూడు లక్షల చదరపు అడుగులతో స్టార్టప్స్ కోసం కొత్త భవనాన్ని నిర్మించాలనీ సీఎం జగన్ ఆదేశించారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్ధిక శాఖ కార్యదర్శులు కేవీవీ సత్యనారాయణ, గుల్జార్‌లతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు నూతన పారిశ్రామిక విధానంపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే...: పరిశ్రమల స్ధాపన మొదలు మార్కెటింగ్ వరకు పరిశ్రమలను చేయి పట్టుకుని నడిపించే విధంగా పాలసీ ఉండాలి న్యూ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీలో మార్కెటింగ్ టై అప్ విధానంపై దృష్టి సారించాలి అంతర్జాతీయంగా మార్కెటింగ్ టైఅప్ చేయగలిగితే ఎంఎస్ఎంఈ రంగంలో మరింత మెరుగైన అభివృద్ధి సాధించగలుగుతాం ఎంఎస్ఎంఈ రంగంలో పోటీ ఎక్కువగా ఉంటుందని.. సరైన మార్కెటింగ్ చూపించగలిగితే ఈ రంగంలో పరిశ్రమలు మరింత రాణిస్తాయి కాన్సెప్ట్ నుంచి కమిషనింగ్ మొదలుకుని మార్కెటింగ్ వరకు హేండ్ హోల్డింగ్‌గా ఉండాలి అడ్వైజ్, అసిస్ట్ అండ్ సపోర్టివ్‌గా ఎంఎస్ఎంఈ పాలసీ ఉండాలి స్టార్టప్ కాన్సెప్ట్‌ను మరింత ప్రోత్సహించాలి విశాఖపట్నంలో సుమారు 3లక్షల చదరపు అడుగులుతో స్టార్టప్స్ కోసం కొత్త భవనాన్ని నిర్మించాలి అదే భవనంలో పరిశ్రమలశాఖ కార్యాలయం కూడా ఉండాలి స్టార్టప్స్‌కు అధిక ప్రాధాన్యతనివ్వాలి పోర్ట్ ఆధారిత పరిశ్రమలు కోసం మౌలిక సదుపాయాలు కల్పన దిశగా దృష్టిసారించాలి -
కొత్త పాలసీలో ‘వర్క్ ఫ్రం హోమ్’
సాక్షి, అమరావతి: పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా నూతన ఐటీ, ఎలక్ట్రానిక్ పాలసీని రూపొందించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా, మిన్నగా ఈ పాలసీ ఉండాలని, కోవిడ్–19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టిసారించాలని సూచించారు. బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మంత్రి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ కోసం ఐటీ శాఖ రూపొందించిన వెబ్ పోర్టల్‌కు స్పందన బాగుందన్నారు. పోర్టల్ ప్రారంభించిన 4 రోజుల్లోనే 2,500 మంది నుంచి డిమాండ్ రావడం మంచి పరిణామమన్నారు. ► విశాఖ కేంద్రంగా ఐటీకి బంగారు భవిష్యత్ ఉందని, పలు సంస్థలకు ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తిని కనపరుస్తున్నారు. ఇందుకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడంపై దృష్టిసారించాలన్నారు. ► ఈ సమీక్షలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సుందర్, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఐటీ జాయింట్ సెక్రటరీ నాగరాజ, ఐటీ శాఖ సలహాదారులు లోకేశ్వర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎస్ఐఆర్–ఐఐసీటీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం ► కేంద్రం ప్రకటించిన మూడు బల్క్ డ్రగ్ పార్కుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. సుమారు 2,000 ఎకరాల్లో ఏర్పాటు చేయదల్చిన బల్క్ డ్రగ్ పార్క్‌కు నాలెడ్జ్ పార్టనర్‌గా ప్రముఖ రసాయనాల పరిశోధనా సంస్థ సీఎస్ఐఆర్–ఐఐసీటీతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి మేకపాటి సమక్షంలో ఏపీఐఐసీ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుతో అమూల్యమైన ఔషధాల తయారీకి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా మారనుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ► ఈ పార్కు ఏర్పాటుపై ఒప్పంద సంస్థతో కలిసి సాంకేతిక సహకారం అందించడంతో పాటు, కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందేలా ప్రతిపాదనలను సిద్ధం చేశామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ అన్నారు. -
వైఎస్సార్ ఏపీ వన్.. పరిశ్రమలకు దన్ను
సాక్షి, అమరావతి: ఓ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన మొదలు ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత కూడా జీవితకాలం అండగా నిలిచే విధంగా దేశంలోనే తొలిసారిగా ‘వైఎస్సార్ ఏపీ వన్’ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి నష్టభయం లేకుండా హ్యాండ్ హోల్డింగ్ కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు 2020–23 నూతన పారిశ్రామిక విధానంలో ‘వైఎస్సార్ ఏపీ వన్’ను పొందుపరిచారు. మహిళా సాధికారితలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు నెలకొల్పే పరిశ్రమలకు అధిక రాయితీలు కల్పించేలా నూతన పారిశ్రామిక విధానం రూపొందింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా రంగాలవారీగా క్లస్టర్ల విధానంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా పరిశ్రమల యజమానులకు నిర్వహణ వ్యయం బాగా తగ్గేవిధంగా నూతన విధానం అవకాశం కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు కల్పించారు. సోమవారం ఏపీఐఐసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నూతన పారిశ్రామిక విధానాన్ని పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా విడుదల చేశారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం జవ్వాది తదితరులు ఇందులో పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఏపీ వన్‌లో 10 కీలక సేవలు.. – వైఎస్ఆర్ ఏపీ వన్ ద్వారా 10 కీలక సేవలను రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అందించనుంది. ఇందుకోసం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెసిలిటేషన్ సెల్, మార్కెట్ రీసెర్చ్ సెల్, మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ సెల్, సేల్స్ సపోర్ట్ సెల్, స్కీం సపోర్ట్ సెల్, ఎంఎస్ఎంఈ రీవిటలైజేషన్ స్కీం, బిజినెస్ ఏనేబుల్‌మెంట్ సెల్, ఇన్వెస్టర్ రీచ్ ఔట్ సెల్, ఇన్సెంటివ్ మేనేజ్మెంట్ సెల్, స్పెషల్ కేటగిరీ సెల్ ఏర్పాటు చేసింది. తగ్గనున్న పెట్టుబడి వ్యయం – ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెట్టుబడి వ్యయం చాలా తక్కువయ్యే విధంగా అన్ని మౌలిక వసతులతో కూడిన పారిశ్రామిక పార్కులను క్లస్టర్ల విధానంలో అభివృద్ధి చేయనున్నారు. స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని రంగాలవారీగా పారిశ్రామిక క్లస్టర్లు, పార్కులు అభివృద్ధి చేయనున్నారు. బొమ్మల తయారీ, ఫర్నిచర్, ఫుట్‌వేర్‌లెదర్, మెషినరీ, ఏయిరోస్పేస్, డిఫెన్స్ వంటి రంగాల పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ – రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య, వారికున్న నైపుణ్యాలు, రాష్ట్రంలో ఉన్న యూనిట్లకు ఎంత మంది ఉద్యోగులు అవసరం? తదితర వివరాలన్నీ ఒకేచోట లభించేలా డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు రెండు స్కిల్డ్ డెవలప్మెంట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రాంతీయాభివృద్ధికి దోహదం చేస్తుంది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందే విధంగా పాలసీని రూపొందించారు. ఎంఎస్ఎంఈ, మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద పీట వేశారు. పెట్టుబడి వ్యయం తగ్గేవిధంగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పాలసీ వల్ల ఏయిరోస్పేస్, రక్షణ, ఫార్మా, టెక్స్టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రో కెమికల్స్ రంగాల్లో పెట్టుబడులు వచ్చే అవకాశముంది. – డి.రామకృష్ణ, చైర్మన్, సీఐఐ, ఏపీ చాప్టర్ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దే విధంగా నూతన పాలసీ ఉంది. మౌలిక వసతులు కల్పించడంతో పాటు పాత, కొత్త పరిశ్రమల సమస్యలను పరిష్కరించడానికి వైఎస్ఆర్ ఏపీ వన్ ప్రవేశపెట్టడం పెద్ద ఊరట. స్టార్టప్స్‌కి, ఎంఎస్ఎంఈలు తక్కువ పెట్టుబడి వ్యయంతో యూనిట్లు ప్రారంభించే అవకాశం ఏర్పడింది. – సి.వి.అచ్యుతరావు, ప్రెసిడెంట్, ఫ్యాప్సీ లాక్‌డౌన్‌కు అనుగుణంగా పాలసీ కోవిడ్–19తో దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టే విధంగా 2020–23 పారిశ్రామిక పాలసీని తీర్చిదిద్దారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను గమనంలోకి తీసుకొని ఇవ్వగలిగిన హామీలనే పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి పెద్ద పీట వేయడం సంతోషంగా ఉంది. – ఏపీకే రెడ్డి, ప్రెసిడెంట్, ఎఫ్‌ఎస్‌ఎంఈ -
45,000 ఎకరాల్లో.. 67 పారిశ్రామిక పార్కులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా నూతన పారిశ్రామిక విధానాన్ని తెచ్చినట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పెట్టుబడి వ్యయం చాలా తక్కువయ్యేలా శ్రీసిటీ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా 67 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు తెలిపారు. 45,000 ఎకరాల్లో ఈ పార్కులను అంతర్జాతీయ వసతులతో అభివృద్ధి చేస్తామన్నారు. సోమవారం 2020–23 పారిశ్రామిక పాలసీ విడుదల చేసిన తర్వాత మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ► సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలు, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించాం. ► వైఎస్సార్ వన్ ద్వారా పరిశ్రమలకు జీవితకాలం రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఈ పాలసీలో పేర్కొన్న ప్రతీ అంశాన్ని నెరవేరుస్తాం. ► గత సర్కారు పరిశ్రమలకు రూ.4,000 కోట్ల రాయితీలు బకాయి పెడితే మా ప్రభుత్వం తీరుస్తోంది. ► నూతన పాలసీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నాం. ► రాష్ట్రానికి వచ్చిన ప్రతీ పెట్టుబడి ప్రతిపాదన వాస్తవరూపం దాల్చేలా కృషి చేస్తాం. ► మరో వారం రోజుల్లో ఐటీ–ఎలక్ట్రానిక్స్ పాలసీని విడుదల చేస్తాం. సీఎం మహిళా పక్షపాతి అని మరోసారి నిరూపించారు ► మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ మరోసారి మహిళా పక్షపాతినని నిరూపించుకున్నారు. ► ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పించి ఇది చేతల ప్రభుత్వమని రుజువు చేసుకుంది. ► గతంలో పారిశ్రామిక పాలసీ రియల్ ఎస్టేట్ పాలసీ మాదిరిగా ఉంటే ఇప్పుడది రియల్ పాలసీలా ఉంది. నిజమైన పరిశ్రమలకు రాయితీలు లభించేలా పాలసీని రూపొందించారు. – రోజా, ఏపీఐఐసీ చైర్మన్ -
త్వరలో ఐటీ పాలసీ విడుదల
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నూతన పారిశ్రామిక పాలసీని విడుదల చేశామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. కొత్త పారిశ్రామిక పాలసీని అవిష్కరించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. నేడు విడుదల చేసింది కేవలం పారిశ్రామిక పాలసీ అని త్వరలో ఐటీ పాలసీని కూడా విడుదల చేస్తామని తెలిపారు. కరోనావైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత పరిస్థితులను అనువుగా మార్చుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు పోర్టులు, ఎయిర్‌పోర్టుల్లో మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు అనువైన వాతవరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని తెలిపారు. (ఏపీ: కొత్త ఇండస్ట్రియల్ పాలసీ విడుదల) గత ప్రభుత్వం చేసినట్టు పారిశ్రామికవేత్తలను మోసం చేయమని పేర్కొన్నారు. తాము పాలసీలో ఏం చెప్తే అది కచ్చితంగా చేసి చూపిస్తామని వ్యాఖ్యానించారు. అందుకే తమ పెట్టుబడులు, ఉద్యోగాలపై అబద్ధపు ప్రకటనలు చేయడం లేదని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చేలా ప్రణాళికను సిద్ధం చేశాని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పరిశ్రమలకు స్కిల్‌మాన్ పవర్ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇంతకంటే పెద్ద రాయితీ పరిశ్రమలకు వేరే ఏమి ఉండదని తెలిపారు. నూతన పారిశ్రమిక పాలసీతో రాష్ట్రంలోని యువతకు ఉద్యోగలు వస్తాయన్న నమ్మకాన్ని కలిగించామని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. (సమగ్ర అభివృద్ధికి కొత్త పాలసీ: గౌతమ్‌రెడ్డి) నూతన పారిశ్రామిక పాలసీపై ఏపీఐఐసీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. పారిశ్రామిక పాలసీలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. మహిళలకు పరిశ్రమలు పెట్టేందుకు భూమి ధర, జీఎస్టీ, విద్యుత్, వడ్డీ రాయితీలను ఇస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రోత్సాహకాలను అందించామని తెలిపారు. మొట్ట మొదటిసారి మైనారిటీలకు ప్రాధాన్యం ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కి దక్కుతుందని చెప్పారు. చంద్రబాబులా తాము అబద్ధాలు చెప్పలేదన్నారు. సీఎం వైఎస్ జగన్ నీతి, నిజాయితీ, పారదర్శకతతో కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొచ్చారని తెలిపారు. చంద్రబాబు కేవలం ఆయన పప్పుకి మాత్రమే ఉద్యోగ అవకాశం కల్పించారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఈ పాలసీతో యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు ఇవ్వబోతున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో 47వేల ఎకరాల భూమిని ఏపీఐఐసీకి కేటాయించి పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు. (గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ సమీక్ష) -
వైఎస్ జగన్ విజన్‌కు నిదర్శనం..
-
సమగ్ర అభివృద్ధికి కొత్త పాలసీ
-
సమగ్ర అభివృద్ధికి ‘వైఎస్సార్ ఏపీ వన్’: గౌతమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి: దేశానికి, రాష్ట్రానికి సంపద సృష్టించే పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేలా సులువైన నిబంధనలతో ‘వైఎస్సార్ ఏపీ వన్’ పేరిట సింగిల్ విండో కేంద్రం ఏర్పాటు చేశామని పారిశ్రామిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. నూతన పారిశ్రామిక పాలసీని మంత్రి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్పర్సన్ రోజా సోమవారం ఆవిష్కరించారు. (పారిశ్రామికాభివృద్ధికి దిక్సూచి) ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వేత్తలను, నైపుణ్యం కలిగిన యువతను పరిశ్రమలకు అందించడమే లక్ష్యంగా నూతన పాలసీని తీసుకువచ్చామన్నారు. గత ప్రభుత్వం అమలుకు సాధ్యం కాని అంశాలను రూపొందించిందన్నారు. గత ప్రభుత్వ హామీలు అమలు చేయడం జాతీయ స్థాయిలోనే సాధ్యం కాదు. అందుకే కొత్త పారిశ్రామిక విధానాన్ని సరళంగా రూపొందించామని తెలిపారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా దీన్ని అమలు చేస్తామన్నారు. కోవిడ్ పరిస్థితి ల్లో పారిశ్రామిక విధానం వచ్చే మూడేళ్లకే రూపొందించామని వివరించారు. వైఎస్ జగన్ విజన్‌కు నిదర్శనం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్‌కు ఇండస్ట్రియల్ పాలసీ నిదర్శనమని ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా అన్నారు. కొత్త పాలసీతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా ఉంటుందని పేర్కొన్నారు. కొత్త పాలసీ పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ఉంటుందన్నారు. ‘‘పలు రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే విధంగా కొత్త పాలసీ. కొత్త పాలసీ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా ఉంది. సీఎం జగన్ మహిళా పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు స్టాంప్ డ్యూటీ, వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని’ ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన యువతను కల్పిస్తామని, కొత్త పాలసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉంటుందని రోజా తెలిపారు. నూతన పారిశ్రామిక విధానం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఏపీ: కొత్త ఇండస్ట్రియల్ పాలసీ విడుదల
-
ఏపీ: కొత్త ఇండస్ట్రియల్ పాలసీ విడుదల
సాక్షి, అమరావతి: నూతన పారిశ్రామిక విధానాన్ని పారిశ్రామిక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పాలసీ విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల ప్రతిరూపం. ప్రజలు, పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసే సరికొత్త పారిశ్రామిక విధానం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించారు. పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక వేత్తల ఆశాకిరణం.. పెట్టుబడిదారులు నష్టపోకుండా చర్యలపై సమదృష్టి చూపనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు అందించనున్నారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు (ఎమ్ఎస్ఎమ్ఈ) పెద్ద సాయంగా నిలవనుంది. పారదర్శకత, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఫార్మా, టెక్స్టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మెగా ప్రాజెక్టులకు పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా అదనపు రాయితీలు ఉండనున్నాయి. నూతన పారిశ్రామిక విధానం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పారిశ్రామిక విధానం నిజాయితీగా ఉండాలి..
-
పరిశ్రమలకు అన్ని విధాలా ప్రోత్సాహం
75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని చట్టం తెచ్చాం. యువతకు అవసరమైన నైపుణ్యాన్ని మనమే కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇది పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుంది. స్థానికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. స్థానికంగానే నైపుణ్యమున్న మానవ వనరులు లభిస్తాయి. వందలాది కోట్ల రూపాయలను ఖర్చు చేసి పరిశ్రమను పెడుతున్నప్పుడు, అనుకున్న సమయానికి అది ప్రారంభమయ్యేలా చూడాలి. అలా వారి కార్యకలాపాలకు ఊతం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం చేదోడుగా నిలవాలి. స్థిరమైన పెట్టుబడులు రావాలన్నా, పది కాలాల పాటు పరిశ్రమలు చక్కగా నడవాలన్నా.. అందుకు అనుకూలంగా పారదర్శక విధానాలు ఉండాలి. పారిశ్రామిక విధానం నిజాయితీగా ఉండాలి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిందే. ఇందులో మరో మాట ఉండకూడదు. గత ప్రభుత్వం మాదిరిగా మోసం చేసే మాటలు అసలే వద్దు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే పోటీలో మనం గెలుస్తాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఇచ్చిన మాట మేరకు అనుకున్న సమయానికి పరిశ్రమ ప్రారంభం అయ్యేలా చూడగలగడమే పెట్టుబడిదారులకు అతిపెద్ద ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి పూర్తిగా అనుకూలమైన పరిస్థితులు కల్పించేలా పారిశ్రామిక విధానం ఉండాలని, పెట్టుబడుల్లో డీ రిస్కింగ్ ద్వారా పరిశ్రమలకు పెద్ద ఊతం ఇవ్వాలని చెప్పారు. ఇండస్ట్రియల్ పార్కు, క్లస్టర్లకు పెద్ద పీట వేయాలని, ఆ నిర్దేశిత ప్రాంతంలో పరిశ్రమలు పెట్టేలా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ)పై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, పెట్టుబడులకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి అందజేశారు. కొత్త పారిశ్రామిక విధానం, ఇండస్ట్రీకి అనుమతుల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై సమావేశంలో చర్చించారు. పరిశ్రమ కోసం పెట్టుబడులు పెట్టేందుకు ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు ఎలాంటి విధానం ఉండాలన్నదానిపై సీఎం పలు సూచనలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నూతన పారిశ్రామిక విధానంపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రఖ్యాత సంస్థలతో పీసీబీని టై అప్ చేయాలి ► పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కాలుష్య నివారణ పద్ధతుల్లో నిపుణులైన, ప్రఖ్యాత వ్యక్తులతో ఒక కమిటీని నియమించాలి. ఇందులో కనీసంగా నలుగురు సభ్యులు ఉండాలి. ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ)ను టై అప్ చేయాలి. ► పరిశ్రమ ఏర్పాటు చేస్తానని ఎవరైనా ముందుకు వస్తే, ముందుగా ఆ ప్రతిపాదన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్న నిపుణులకు పంపాలి. ఆ కమిటీ ద్వారా ఇదివరకే టై అప్ అయిన సంస్థలు ఆ ప్రతిపాదనపై అధ్యయనం చేయాలి. నివేదిక రాగానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యయనం చేసి సిఫార్సులు చేస్తుంది. ► ఈ కమిటీ సిఫార్సులు సానుకూలంగా వస్తే.. స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ (ఎస్ఐపీసీ) ముందుకు ఆ ప్రతిపాదన వెళ్తుంది. వారు సంబంధిత పరిశ్రమకు చెందిన వ్యక్తులతో సమావేశమవుతారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీని వివరించి అవగాహన కల్పిస్తారు. ► పెట్టబడుల్లో వారి విశ్వసనీయత, సమర్థతలను ఎస్ఐపీసీ పరిశీలించి, ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే, తర్వాత ఆ ప్రతిపాదన ఎస్ఐపీబీ ముందుకు వస్తుంది. ఎస్ఐపీబీ ఆ ప్రతిపాదనపై ప్రజెంటేషన్ ఇచ్చాక.. ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తుంది. ► ఆ తర్వాత పరిశ్రమ ఏర్పాటు చేసేవారికి చేయూతగా సింగిల్ విండో విధానం నిలుస్తుంది. పరిశ్రమ ఏర్పాటు చేయడంలోనే కాకుండా, తర్వాత కాలంలో కూడా అండగా నిలుస్తాం. ఏం చేయగలమో అదే చెప్పాలి ► ఇండస్ట్రీ పాలసీ నిజాయితీగా ఉండాలి. మోసం చేయకూడదు. పరిశ్రమలకు మాట ఇస్తే అది కచ్చితంగా నెరవేర్చాలి. పరిశ్రమలకు భూమి, నీరు, విద్యుత్ లాంటి సదుపాయాలు కల్పిస్తాం. నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందిస్తాం. ప్రభుత్వం సానుకూలంగా, వారి పట్ల ప్రో యాక్టివ్‌గా ఉంటుంది. ► పరిశ్రమలు పెట్టే్ట వారికి ప్రభుత్వం నిజాయితీగా ఏం చేయగలదో అదే చెప్పాలి. ఈ అంశాల ప్రాతిపదికగా పారిశ్రామిక విధానం తయారు చేయాలి. ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక, ఆ ప్రతిపాదనలన్నీ వాస్తవ రూపంలోకి రావాలి. కనికట్టు మాటలొద్దు ► పరిశ్రమల విషయంలో కనికట్టు మాటలు వద్దు. గత ప్రభుత్వం ఇలాంటి మాటలే చెప్పింది. పరిశ్రమలకు రూ.4 వేల కోట్ల ఇన్సెంటివ్‌లను బకాయి పెట్టింది. ఆ బకాయిలను తీర్చడానికి ఈ ప్రభుత్వం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ► ఎంఎస్ఎంఈలకు ఇప్పటికే ఒక విడతలో సగం బకాయిలు చెల్లించాం. మిగిలిన సగం డబ్బును చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ► సమావేశంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, బొత్స సత్యన్నారాయణ, గుమ్మనూరి జయరాములు, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. పెట్టుబడులు పెట్టే వారికి రిస్క్ తగ్గాలి ► ఈ విధానం కారణంగా పెట్టుబడులు పెట్టే వారికి రిస్క్ తగ్గుతుంది. అనుకున్న సమయానికి పరిశ్రమలు ప్రారంభం అయ్యేందుకు వారికి తగిన తోడ్పాటు లభిస్తుంది. ఇదే పెట్టుబడిదారులకు అతిపెద్ద ప్రోత్సాహంగా నిలుస్తుంది. పరిశ్రమలకు, ప్రజలకు మేలు జరిగేలా ఈ విధానం ఉంటుంది. ► భవిష్యత్తు తరాలు కూడా మనకు ముఖ్యం. పరిశ్రమలు రావడం, తద్వారా ఉద్యోగాల కల్పన ముఖ్యమైన అంశం. అదే సమయంలో ప్రజలకు, పర్యావరణానికి హాని జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ► ఇండస్ట్రియల్ పార్కులు, క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఏ పరిశ్రమలు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్న దానిపై ప్రభుత్వం నిర్దేశిస్తుంది. దీని వల్ల వారికి భవిష్యత్తులో కార్యకలాపాల పరంగా గానీ, పర్యావరణం పరిరక్షణ పరంగా గానీ.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా సజావుగా నడుపుకోవచ్చు. -
గత ప్రభుత్వం మాదిరిగా కనికట్టు మాటలు వద్దు
-
మోసం చేసే మాటలు వద్దు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, పెట్టుబడులకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి అందించారు. కొత్త పారిశ్రామిక విధానం, అనుమతుల విషయంలో విధివిధానాలపై సీఎం అధికారులతో చర్చించారు. అనుకున్న సమయానికి పరిశ్రమలు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. పారిశ్రామిక విధానం నిజాయితీగా ఉండాలని, గత ప్రభుత్వం మాదిరిగా మోసం చేసే మాటలు వద్దని ఆయన స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ... ‘వందలాది కోట్ల రూపాయలను ఖర్చుచేసి పరిశ్రమను పెడుతున్నప్పుడు, అనుకున్న సమయానికి అది ప్రారంభమయ్యేలా చూద్దాం. తద్వారా వారి కార్యకలాపాలకు ప్రభుత్వం తరపున ఊతమిచ్చి చేదోడుగా నిలుద్దాం. స్థిరమైన పెట్టుబడులు రావాలన్నా, పదికాలాలపాటు పరిశ్రమలు చక్కగా నడవాలన్నా అందుకు అనుకూలంగా పారదర్శక విధానాలు ఉండాలి’ అని ఆయన చెప్పారు. నూతన పారిశ్రామిక విధానంపై ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. 1. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కాలుష్య నివారణా పద్దతుల్లో నిపుణులైన, ప్రఖ్యాత వ్యక్తులతో ఒక కమిటీని నియమించాలి. కనీసంగా ఇందులో నలుగురు సభ్యులు ఉండాలి. అలాగే ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డును టై అప్ చేయాలి. 2. పరిశ్రమ ఏర్పాటు చేస్తానని ఎవరైనా ముందుకు వస్తే... ముందుగా ఆ ప్రతిపాదన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్న నిపుణులకు పంపాలి. ఆ కమిటీ ద్వారా అదివరకే టైఅప్ అయిన సంస్థలు ఆ ప్రతిపాదనపై అధ్యయనం చేయాలి. నివేదిక రాగానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యయనం చేసి సిఫార్సులు చేస్తుంది. 3. ఈ కమిటీ సిఫార్సులు సానుకూలంగా వస్తే.. స్టేట్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ కమిటీ ముందుకు ఆ ప్రతిపాదన వెళ్తుంది. వారు సంబంధిత పరిశ్రమకు చెందిన వ్యక్తులతో సమావేశమవుతారు. రాష్ట్ర ప్రభుత్వం పాలసీని వివరిస్తారు, అవగాహన కల్పిస్తారు. పెట్టబడుల్లో వారి విశ్వసనీయత, సమర్థతలను ఎస్ఐసీసీ పరిశీలించి ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే, తర్వాత ఆ ప్రతిపాదన ఎస్ఐపీబీ ముందుకు వస్తుంది. 4. ఎస్ఐపీబీ ఆ ప్రతిపాదనపై ప్రజంటేషన్ ఇచ్చాక.. ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తుంది. 5. ఆ తర్వాత పరిశ్రమ ఏర్పాటు చేసేవారికి చేయూతగా సింగిల్ విండో విధానం నిలుస్తుంది. ఈ విధానం కారణంగా పెట్టుబడులు పెట్టేవారికి రిస్క్ తగ్గుతుందని, అనుకున్న సమయానికి పరిశ్రమలు ప్రారంభం అయ్యేందుకు వారికి తగిన తోడ్పాటు లభిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇదే పెట్టుబడిదారులకు అతిపెద్ద ప్రోత్సాహంగా నిలుస్తుందని అన్నారు. పరిశ్రమలకు, ప్రజలకు మేలుజరిగేలా ఈ విధానం నిలుస్తుందన్నారు. భవిష్యత్తు తరాలు కూడా మనకు ముఖ్యమని, పరిశ్రమలు రావడం, తద్వారా ఉద్యోగాల కల్పన ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి వెల్లడించారు. అదే సమయంలో ప్రజలకు, పర్యావరణానికి హాని జరకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. (చదవండి: 26న నూతన పారిశ్రామిక విధానం ఖరారు) నిజాయితీగా పారిశ్రామిక విధానం త్వరలో తీసుకురానున్న ఇండస్ట్రియల్ పాలసీ విధివిధానాలపైన కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాలసీ రూపకల్పనలో పరిగణలోకి తీసుకోదగ్గ అంశాలను అధికారులకు సూచించారు. ఇండస్ట్రీ పాలసీ నిజాయితీగా ఉండాలి. మోసం చేయకూడదు. పరిశ్రమలకు మాట ఇస్తే అది కచ్చితంగా నెరవేర్చాలి. పరిశ్రమలకు భూమి, నీరు, విద్యుత్ లాంటి సదుపాయాలు కల్పిస్తాం. నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందిస్తాం. ప్రభుత్వం సానుకూలంగా, వారిపట్ల ప్రోయాక్టివ్‌గా ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. పరిశ్రమలు పెట్టేవారికి ప్రభుత్వం నిజాయితీగా ఏం చేయగలదో అదే చెప్పాలని.. ఈ అంశాల ప్రాతిపదికగా పారిశ్రామిక విధానం తయారు చేయాలని సీఎం సూచించారు. ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక... ఆ ప్రతిపాదనలన్నీ వాస్తవ రూపంలోకి రావాలన్నారు. పరిశ్రమల విషయంలో కనికట్టు మాటలు వద్దని, గత ప్రభుత్వం ఇలాంటి మాయ మాటలు చెప్పి రూ.4 వేలకోట్లు ఇన్సెంటివ్‌లను బకాయిలుగా పెట్టిందని సీఎం గుర్తు చేశారు. ఆ బకాయిలను తీర్చడానికి తమ ప్రభుత్వం ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు. ఎంఎస్ఎంఈలకు ఇప్పటికే ఒకవిడతలో రూ.450 కోట్లు చెల్లించామని, మిగిలిన డబ్బును చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఎంఎస్ఎంఈలకు చెల్లించిన తర్వాత రంగాలవారీగా, దశలవారీగా బకాయిలు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని చట్టం తెచ్చామని, దానికోసం యువతకు అవసరమైన నైపుణ్యాన్ని మనమే కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇది పరిశ్రమలకు చాలా అనుకూలంగా ఉంటుందన్నారు. స్థానికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందన్నారు. అంతేకాక స్థానికంగానే వారికి నైపుణ్యమున్న మానవనరులు లభిస్తాయన్నారు. సమీక్షలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, బొత్స సత్యనారాయణ, గుమ్మనూరి జయరాములు, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ సహా అధికారులు పాల్గొన్నారు. -
30 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు: గౌతమ్‌రెడ్డి
సాక్షి, విజయవాడ: ఈ నెల 26న నూతన పారిశ్రామిక విధానాన్ని ఖరారు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన నేతృత్వంలో ఇండస్ట్రియల్ టాస్క్‌ఫోర్స్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో నూతన పారిశ్రామిక పాలసీ పై చర్చించారు. నాలుగు రంగాల్లో ప్రాధాన్యం ఇచ్చేలా పాలసీ రూపొందిస్తామని తెలిపారు. పరిశ్రమలకు 30 రోజుల్లో అనుమతులు ఇచ్చే విధానం తీసుకువస్తామని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమలకు స్థలం, వాటర్, పవర్, స్కిల్ మ్యాన్ పవర్ కూడా అందిస్తామని చెప్పారు. (తాగి వాహనాలు నడపొద్దు: సీఎం జగన్ విజ్ఞప్తి ) అవినీతికి ఆస్కారం లేకుండా.. రాష్ట్రంలో అన్ని వనరులను సమర్థవంతంగా వినియోగిస్తామని తెలిపారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేని పారిశ్రామిక పాలసీ ని తీసుకొస్తున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు, ఉద్యోగాల తో పాటు పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. పర్యావరణానికి హాని చేసే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వొద్దని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారని మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. (సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం: కార్మికులు) -
వాస్తవిక దృక్పథంతో పారిశ్రామిక విధానం
గత ఐదేళ్లుగా పరిశ్రమలకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ సుమారు రూ.4,800 కోట్లు పెండింగ్‌లో ఉంది.ఈ బకాయిలను దశల వారీగా చెల్లించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాలి. పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించే కేటగిరీ వారీగా ఈ ఇన్సెంటివ్‌లు ఇచ్చుకుంటూ వెళ్లాలి. రాష్ట్రంలో కాలుష్యాన్ని పూర్తిగా కట్టడి చేయాలి. ప్రతి పరిశ్రమ నుంచి వచ్చే పొల్యూషన్‌ను జీరో స్థాయికి తీసుకురావాలి. పరిశ్రమల నుంచి వ్యర్థాలను సేకరించి, కాలుష్యం లేకుండా చేసే బాధ్యతను ప్రభుత్వమే స్వీకరిస్తుంది. సాక్షి, అమరావతి: నూతన పారిశ్రామిక విధానం వాస్తవిక దృక్పథంతో ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నూతన పారిశ్రామిక విధానంపై అధికారులు చేసిన ప్రతిపాదనలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పారిశ్రామిక విధానం ఎలా ఉండాలి.. పారిశ్రామిక కాలుష్య నివారణ, ఎంఎస్ఎంఈలకు తోడ్పాటు, పరిశ్రమలకు పెండింగ్‌లో ఉన్న ఇన్సెంటివ్స్ చెల్లింపునకు సంబంధించి ముఖ్యమంత్రి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా, రాష్ట్రంలో పారిశ్రామిక రంగంపై కోవిడ్–19 ప్రభావం, ప్రస్తుత పరిస్థితుల్లో అందిపుచ్చుకోవాల్సిన అవకాశాలపై సమావేశంలో చర్చ జరిగింది. కాలుష్య నివారణకు పెద్దపీట ► సమాజానికి, ప్రభుత్వానికి మేలు జరిగేలా కాలుష్య నివారణ విధానం ఉండాలి. కాలుష్యాన్ని పూర్తిగా నివారించాలి. ► పరిశ్రమలకు డీశాలినేషన్ చేసిన నీటినే వినియోగించేలా ఇదివరకే ఆలోచనలు చేసినందున, దీనిపై మరింతగా దృష్టి పెట్టాలి. ► ఈ సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పలు వురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారీగా ఉపాధి కల్పించే పరిశ్రమలకు తోడ్పాటు ► గత ప్రభుత్వం మాదిరిగా అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని మాటలు చెప్పి, చివరకు ఏదీ చేయని పరిస్థితి ఉండకూడదు. మనం చెప్పే మాటలపై పరిశ్రమలు పెట్టేవారికి విశ్వాసం ఉండాలి. ► పరిశ్రమలకు భూమి, నీరు, కరెంటు ఇద్దాం. వీటి విషయంలో నాణ్యమైన సేవలు అందిద్దాం. ► భారీ, మధ్యతరహా, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల వారీగా ఆధారపడ్డ ఉద్యోగులు ఎంత మంది ఉన్నారనే దానిపై వివరాలు తయారు చేయాలి. పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ – మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్) మరింత తోడ్పాటునందించే దిశగా అడుగులు ముందుకు వేయాలి. ► కోవిడ్–19 నేపథ్యంలో మారుతున్న పరిణామాలు, వివిధ దేశాల ఆలోచనల్లో మార్పుల కారణంగా రాష్ట్ర పారిశ్రామిక రంగ వృద్ధికి తోడ్పడే వివిధ కేటగిరీల పరిశ్రమలపై కసరత్తు చేయాలి. (కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభావాన్ని అంచనా వేస్తోందని, తుదిగా ఒక విధానం వెలువడే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు.) -
రూ. 18,000 కోట్ల పెట్టుబడులు..47,000 మందికి ఉపాధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దాదాపు రూ.18,000 కోట్ల విలువైన 25 భారీ పెట్టుబడుల ప్రతిపాదనలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీలం సాహ్ని నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే దాదాపు 47,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఐటీ, ఎలక్ట్రానిక్స్, రిటైల్, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన ఈ కంపెనీలకు కొత్త పారిశ్రామిక విధానం ప్రకారం రాయితీలు ఇవ్వాలని నిర్ణయించారు. - హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్ సెజ్ సంస్థ చిత్తూరు జిల్లాలో రూ.700 కోట్లతో ఏర్పాటు చేయనున్న అడిదాస్ బ్రాండ్ పేరిట పాదరక్షల తయారీ యూనిట్‌కు ఎస్ఐపీసీ ఆమోదం తెలియజేసింది. ఈ ఒక్క యూనిట్ ద్వారానే 10,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. - ఇంటెలిజెంట్ గ్రూపు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లాలో అపాచీ సెజ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. - జపాన్‌కు చెందిన అయన్స్ టైర్స్ గ్రూపు రూ.1,600 కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలో ఏర్పాటు చేయతలపెట్టిన టైర్ల తయారీ యూనిట్‌కు ఎస్ఐపీసీ ఆమోదం లభించింది. - ఈ యూనిట్లో భారీ వాహనాలు.. ముఖ్యంగా రైతులు, అటవీ, గనుల తవ్వకం వంటి రంగాల్లో ఉపయోగించే యంత్రాలకు వినియోగించే టైర్లు తయారవుతాయి. - తూర్పుగోదావరి జిల్లాలో ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ రూ.2,700 కోట్లతో ఏర్పాటు చేయనున్న కాస్టిక్ సోడా తయారీ యూనిట్‌కు ఎస్ఐపీసీ ఆమోదం తెలిపింది. ఈ యూనిట్ ద్వారా 1,300 మందికి ఉపాధి లభించనుంది. - చిత్తూరు జిల్లాలో టీసీఎల్ టెక్నాలజీ, రేణిగుంట సమీపంలోని ఈఎంసీ1, 2లో మొబైల్ తయారీ కంపెనీలకు చెందిన పలు ప్రతిపాదనలకు ఎస్ఐపీసీ ఆమోదం తెలియజేసింది. - కేవలం ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ.3,675.24 కోట్లు పెట్టుబడులతో ఏకంగా 32,890 మందికి ఉపాధి లభించనుంది. -
ఏపీలో కొత్త పారిశ్రామిక పాలసీ..
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక పాలసీని సిద్ధం చేశామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్చిలో కొత్త పాలసీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో వదిలేసిన పరిశ్రమలను కూడా తెస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశ్రమలను రాష్ట్రానికి తెచ్చేందుకు మంచి పాలసీని రూపొందించారని తెలిపారు. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని పట్టించుకునేది లేదన్నారు. ప్రభుత్వం తమకు సహకరిస్తుందని కియా మోటార్స్ చాలా స్పష్టంగా చెప్పిందని ఆయన వివరించారు. విశాఖలో 50 వేల ఐటీ ఉద్యోగాలు.. పరిశ్రమలకు ఉన్న ప్రతి సమస్య పరిష్కరించి పెట్టుబడులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది ఒక్క విశాఖలోనే 50 వేల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఎలక్ర్టానిక్స్ రంగంలో 50 వేల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. పరిశ్రమల కోసం అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. మూడు పోర్టులను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారని వెల్లడించారు. పరిశ్రమలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా 75 శాతం స్కిల్ మాన్‌పవర్‌ను ఇస్తున్నామని తెలిపారు. సులభంగా పెట్టుబడులు పెట్టేందుకు సంస్కరణలు తీసుకొస్తున్నామని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. -
15 రోజుల్లో అనుమతులిస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానంతో 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అనుమతులు మంజూరు చేస్తున్నామని.. ప్రపంచ శ్రేణి పెట్టుబడిదారులకు తెలంగాణ ఆహ్వానం పలుకుతోందని రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కె.తారక రామారావు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో 13వ జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో గృహ నిర్మాణంలో మంచి విధానాలు తీసుకొచ్చేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం మెరుగైన విధానాలను అవలంబిస్తోందన్నారు. ఇతర రంగాల అభివృద్ధి జరిగినప్పుడే గృహ నిర్మాణంలో పురోగతి కనిపిస్తుందని.. అందువల్లే పారి శ్రామీకరణపై దృష్టి సారించామన్నారు. టీఎస్ ఐపాస్‌తో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. సింగిల్ విండో విధానంలో 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నట్టు వివరిం చారు. 15 రోజుల్లో అనుమతులు రాకుంటే.. 16వ రోజున అనుమతులు మంజూరైనట్టే భావించే వెసులుబాటు కల్పించామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 2,300 పరిశ్రమలు ఏర్పాటయ్యాయని... రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 1.7 ల క్షల ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. దేశంలో ఏ నగరంతో పోల్చి చూసినా తక్కువ ఖర్చుతో హైదరాబాద్‌లో మౌలిక వసతులు, వ్యాపార అవకాశాలు ఉన్నాయని.. రియల్ ఎస్టేట్ అనుమతులు కూడా ఆన్లైన్ చేశామని, దాని వల్ల అవినీతికి ఆస్కారం ఉండదని పేర్కొన్నారు. ఫార్మా సంస్థల ప్రతినిధులతో భేటీ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫార్మాసిటీని నిర్మించనున్న నేపథ్యంలో.. దిగ్గజ ఫార్మా సంస్థల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అయ్యారు. తొలుత ‘ఫ్రీజర్ ఇండియా’ సంస్థ ఎండీ శ్రీధర్, ప్రతినిధులతో సమావేశమై.. తెలంగాణలో చేపట్టిన ఫార్మా సిటీ గురించి వివరించారు. అనంతరం జాన్సన్ అండ్ జాన్సన్ ప్రతినిధుల తోనూ సమావేశమై చర్చించారు. అలాగే ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ మోహన్ తివారీ, మరికొన్ని సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. లెదర్ పార్క్ ఏర్పాటుకు డీపీఆర్ ఢిల్లీలో కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌తో కేటీఆర్ భేటీ అయి రాష్ట్రంలో ప్రతిపాదించిన లెదర్ పార్క్‌కు సంబంధించిన డీపీఆర్‌ను సమర్పించారు. దానికి సంబంధించి కేంద్రం నుంచి రూ.105 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినట్లు సమావేశం అనంతరం కేటీఆర్ తెలిపారు. భారత్‌లో టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే శ్రీలంక పారిశ్రామికవేత్తలకు ఉన్న సమస్యల గురించి కేంద్ర మంత్రికి వివరించామని చెప్పారు. సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు సంబంధించి ఉన్న సమస్యలపై చర్చించామని తెలిపారు. ఆయా అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. జౌళి శాఖ కార్యదర్శితోనూ సమావేశమై తెలంగాణలో కొత్తగా 12 చేనేత క్టస్లర్లు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. వరంగల్‌లో ఏర్పాటు చేయనున్న మెగా టెక్స్టైల్ పార్క్‌లో కామన్ ఎఫిలియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. సింధుకు ఘనస్వాగతం పలుకుతాం ఒలింపిక్స్‌లో సింధు ప్రదర్శన దేశానికి గర్వకారణమని.. ఆమెకు ఘనస్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. ఒలింపిక్స్‌కు 2 నెలల ముందు కాకుండా.. 2020లో టోక్యో ఒలింపిక్స్‌కు ఇప్పటి నుంచే క్రీడాకారులను సన్నద్ధం చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలకు ప్రోత్సాహం కల్పించి.. వచ్చే ఒలింపిక్స్‌లో కనీసం 20 పతకాలు సాధించేలా కృషి చేయాలన్నారు. కాంగ్రెస్‌వన్నీ కాకమ్మ కథలు ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ నేతలు చెబుతున్నవి కాకమ్మ కథలని.. వారు ఇచ్చి న ప్రజెంటేషన్‌కు తలా తోక లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇంజనీర్లు, నిపుణులే ఆ ప్రజెంటేషన్‌ను తప్పుపడుతున్నారని.. ఆ పార్టీ నేతలు చెప్పే మాటలు నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వతంగా దూరమవుతుందేమోనన్న భయంతోనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కోటి ఎకరాలకు సాగునీరిస్తే.. రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయని ప్రశ్నించారు. -
నాలుగేళ్లలో అగ్రగామిగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: రాబోయే నాలుగేళ్లలో తెలంగాణను వ్యాపార, వాణిజ్య రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఒకరోజు ముంబై పర్యటనలో భాగంగా మంత్రి పలువురు వ్యాపార దిగ్గజాలను కలిశారు. ఫోర్త్ ఇంజక్షన్, బ్లో మౌల్డింగ్ అండ్ పీఈటీ ఇంటర్నేషనల్ సమ్మిట్‌లో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన సుమారు 600 మంది ప్లాస్టిక్, పెట్రో కెమికల్, ప్యాకేజింగ్ రంగాల పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. తెలంగాణలో ఆయా పరిశ్రమలకున్న అవకాశాలను వివరించారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, లైఫ్ సెన్సైస్, ఏరోస్పెస్, రక్షణ రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉంచేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. టీ హబ్, నూతన పారిశ్రామిక విధానం, ఫార్మాసిటీ వంటి అంశాలు ఈ రంగాల్లో ముందుకు వెళ్లేం దుకు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా నిరంతర విద్యుత్ సరఫరా, టీఎస్ ఐపాస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుదల వంటి అంశాలతో దేశంలోనే పెట్టుబడులకు అత్యుత్తమ స్నేహపూరిత వాతావరణం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఉందని తెలిపారు. అందుబాటులో ఉన్న ల్యాండ్‌బ్యాంకు పెట్టుబడులకు మరో అదనపు ప్రయోజనమని మంత్రి తెలిపారు. వంద ఎకరాల్లో సుల్తాన్‌పూర్‌లో మొదటి దశలో ఒక ప్లాస్టిక్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. రెండో దశలో మూడు వందల నుంచి 500 ఎకరాల్లో ప్లాస్టిక్ సిటీని మెదక్ నిమ్జ్ పార్కులో ఏర్పాటు చేస్తామని అన్నారు. పరిశ్రమలకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాల గురించి పరిశ్రమల ప్రతినిధులకు మంత్రి వివరించారు. మంత్రి ప్రజెంటేషన్‌పై పారిశ్రామికవేత్తలు అభినందనలు తెలిపారు. ఆర్బీఐ గవర్నర్‌ను కలిసిన మంత్రి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్‌ను మంత్రి కేటీఆర్ ముంబైలో గురువారం కలిశారు. ఎంఎస్ఎం ఈ సెక్టార్‌లోని పరిశ్రమలు బ్యాంకు రుణాలు అందుకోవడంలో ఉన్న పలు సమస్యలను మంత్రి గవర్నర్‌కు వివరించారు. పలు ఎంఎస్ఎంఈ రంగ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం ఈ పరిశ్రమలను ఆదుకునేందుకు తీసుకోబోతున్న చర్యలను వివరించి పలు సూచనలను తీసుకున్నారు. -
‘రియల్’ రయ్.. రయ్..
♦ దిగ్గజ కంపెనీల రాకతో పెరిగిన ఆదాయం ♦ భారీగా నమోదైన రిజిస్ట్రేషన్లు ♦ రాష్ట్ర ఖజానాకు జిల్లానే మూలస్తంభం ♦ పూర్వవైభవం దిశగా రియల్ఎస్టేట్ ♦ రాజకీయ స్థిరత్వంతో పెరిగిన వ్యాపారం ♦ 27 శాతానికిపైగా నమోదైన వృద్ధి రేటు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుంది. రెండేళ్లకాలంలో ఎన్నడూలేనంతగా పరుగులు పెడుతోంది. 27శాతానికిపైగా వృద్ధి రేటు సాధించింది. రాజకీయ స్థిరత్వం.. ప్రపంచ శ్రేణి సంస్థల తాకిడితో జిల్లాలో స్థిరాస్తి రంగం వేగం పుంజుకుంది. అమెజాన్, ఆపిల్, గూగుల్ లాంటి ఐటీ దిగ్గజ కంపెనీల రాకతో రియల్‌ఎస్టేట్‌కు పూర్వవైభవం వస్తోంది. రాజకీయ అనిశ్చితితో గతేడాది వరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఈ రంగం.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఆశావహ వాతావరణంతో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఐటీ పాలసీ, నూతన పారిశ్రామిక విధానంతో అనుమతులను సరళతరం చేయడం.. పరిశ్రమల స్థాపనలకు అనువైన వాతావరణం సృష్టించడం.. పెట్టుబడిదారుల్లో ఆశలు చిగురింపజేశాయి. ఇదే భరోసా సామాన్యుల్లో కూడా కలగడంతో జిల్లాలో స్థలాల క్రయవిక్రయాలు గణనీయంగా పెరిగాయి. మొన్నటివరకు వేచిచూసే ధోరణిని అవలంబించిన దిగువ, మధ్య తరగతి వర్గాల ప్రజలు ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2015-16లో రియల్ ఎస్టేట్‌కు రెక్కలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1,759.62 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చడంలో జిల్లా మూలస్తంభంగా నిలిచింది. జిల్లాలోని రెండు రిజిస్ట్రేషన్ల విభాగాలకు రూ.2,212.93 కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, ఈ లక్ష్యసాధనలో జిల్లాలో వెనుకబడినప్పటికీ, 2014-15తో పోలిస్తే (రూ.1,383.86 కోట్లు) రూ.375.76 కోట్ల రాబడిని సమకూర్చుకోగలిగింది. ఈ మేరలో ఆదాయం రావడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి తెరపడడమే. 2009 నుంచి 2014 వరకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున లేవడం.. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక మాంద్యం నెలకొనడంతో రియల్టీ రంగం అటుపోట్లను ఎదుర్కొంది. ఈ క్రమంలోనే స్థలాల కొనుగోళ్లు, ఇళ్ల నిర్మాణాలపై సహజంగానే ఎక్కువ ఆసక్తి చూపే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొంత వెనుకడుగు వేశారు. దీనికి కొనసాగింపుగానే రాష్ట్ర విభజన జరగడంతో గతేడాది క్రితం వరకు స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే విషయంలో అచితూచి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, ఇటీవల బహుళ జాతి సంస్థలు భాగ్యనగరంవైపు దృష్టి సారించడం.. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ కంపెనీలు నగర శివార్లలో క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. వీటితోపాటు విమానయానరంగంలో బడా కంపెనీలుగా పేరొందిన ఎయిర్‌బస్, టాటా తదితర సంస్థలు విమాన విడిభాగాల తయారీ హబ్‌లను జిల్లాలో ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇవేకాకుండా మొబైల్, టీవీ ఉపకరణాల తయారీ సంస్థలు కూడా జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావడంతో రియల్టీ జోరందుకుంది. ఈ క్రమంలోనే బడా బిల్డర్లు శివార్లలో అత్యాధునిక ప్రమాణాలతో విల్లాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. మరోవైపు రాష్ర్ట విభజనతో ఏపీ రాజధాని అమరావతి వైపు ఆశగా చూసిన నిర్మాణ సంస్థలు, రియల్టర్లు కూడా అక్కడ నెలకొన్న రాజకీయ వాతావరణం.. ఆసాధారణంగా పెరిగిన భూముల ధరలతో రియల్ వ్యాపారానికి హైదరాబాదే మేలనే నిర్ణయానికి రావడం కూడా జిల్లాలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగడానికి కారణమైంది. -
ప్రోత్సాహకాలు ఆగితే మూసివేతే...!
వంట నూనెల పరిశ్రమలో వింత పరిస్థితి వ్యాట్ మినహాయింపు కోసమే కొత్త ప్లాంట్లు పాతవాటికే మేకప్ వేసి కొత్తవిగా చూపిస్తున్న తీరు... కొత్త వ్యూహాలు, ప్రణాళికలతో నిలదొక్కుకుంటున్న బడా ప్లాంట్లు పోటీ పడలేక చిన్న ప్లాంట్లు మూత హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నూతన పారిశ్రామిక విధానం ద్వారా పరిశ్రమలకు ప్రోత్సాహకాలివ్వటం రాష్ట్రాలకు కొత్తేమీ కాదు. తద్వారా కొత్త పరిశ్రమలు వస్తాయి. కాకపోతే వంట నూనెల పరిశ్రమలో మాత్రం చిత్రమైన పరిస్థితి నెలకొంది. కొత్త పారిశ్రామిక విధానం వస్తే చాలు. పాత ప్లాంట్లు మూతపడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి!!. ఎందుకంటే వ్యాట్ మినహాయింపు ఉన్నంత కాలం మాత్రమే కంపెనీలు మనగలుగుతున్నాయి. ఎపుడైతే ఈ ప్రయోజనం ఆగిపోతోందో అప్పటి నుంచి కంపెనీలకు కష్టాలు మొదలవుతున్నాయి. ప్రణాళిక ప్రకారం వ్యాపారాన్ని నిర్వహించే ఒకటిరెండు పెద్ద సంస్థలు మినహా మిగిలిన చిన్న కంపెనీలు ప్లాంట్లను మూసివేయక తప్పడంలేదు. ఎందుకంటే అటు పెద్ద ప్లాంట్లతో గానీ, ఇటు కొత్తగా ప్లాంటు పెట్టి వ్యాట్ ప్రయోజనాలు పొంది తక్కువ ధరకు నూనెలను విక్రయిస్తున్న కంపెనీలతో గానీ అవి పోటీ పడలేకపోతున్నాయి. ప్రోత్సాహమే అడ్డంకి... వంట నూనెలపై తెలుగు రాష్ట్రాల్లో 5 శాతం వ్యాట్ ఉంది. రూ.11 నుంచి 250 కోట్ల మధ్య పెట్టుబడి పెట్టే మధ్య తరహా కంపెనీకి.. చెల్లించిన వ్యాట్‌లో ప్రభుత్వం 75 శాతాన్ని రీయింబర్స్ చేస్తోంది. విద్యుత్ చార్జీల్లోనూ రాయితీలున్నాయి. ప్లాంటులో ఉత్పత్తి మొదలైన నాటి నుంచి ఐదేళ్లపాటు వ్యాట్ ప్రయోజనం ఉంటుంది. నికర లాభం 1-2 శాతానికే పరిమితమైన వంట నూనెల రంగంలో ఈ ప్రోత్సాహం ఏ కంపెనీకైనా పెద్ద ప్రయోజనం కిందే లెక్క. దీంతో ఈ కంపెనీలు మార్కెట్లో పోటీ పడటానికి ఇతర కంపెనీల కంటే తక్కువ ధరకే ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. అయితే అయిదేళ్లు పూర్తి చేసుకున్న కంపెనీలు మాత్రం ధర తగ్గించి విక్రయించలేకపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఖాయిలాపడ్డ కంపెనీల్లో ఎన్సీఎస్ ఇండ స్ట్రీస్, కేడియా అగ్రోటెక్, క్లీన్ సిటీ బయో ఫ్యూయెల్స్, బయో మ్యాక్స్, నేచురల్ బయో ప్యూయెల్స్, గుడ్హెల్త్ అగ్రోటెక్, నిఖిల్ రిఫైనరీస్తోపాటు మరో 10 కంపెనీలున్నాయి. తిరిగి కొత్త ప్లాంట్లతో.. కొత్త ప్రభుత్వం రాగానే నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడం సహజం. కొన్ని కంపెనీలకు ఈ అంశమే కలిసి వస్తోంది. పోటీలో నిలదొక్కుకోలేక ప్లాంట్లను మూసివేసిన ఈ కంపెనీలు... కొత్త ఎత్తుగడతో తిరిగి రంగప్రవేశం చేస్తున్నాయి. కొత్త ప్లాంటు పెడితే ప్రోత్సాహకాలు పొందవచ్చన్నది వీటి ఆలోచన. అనుకున్నదే తడవుగా పాత ప్లాంట్లను తుక్కు కింద విక్రయించినట్లు కాగితాల్లో చూపిస్తున్నాయి. అదే యాజమాన్యం కొత్త పేరుతో పాత ప్లాంటుకు సమీపంలోనే మరో ప్లాంటును నెలకొల్పుతోంది. ఈ ప్లాంటుకు కావాల్సిన సామగ్రిని పాత ప్లాంటు నుంచి తీసుకొస్తున్నాయి. బ్యాంకుల నుంచి యథావిధిగా రుణాలను తీసుకుంటున్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లోని రిఫైనరీల వార్షిక సామర్థ్యం 43 లక్షల టన్నులు. ఇవి ఏపీ, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు నూనెలను సరఫరా చేస్తున్నప్పటికీ వినియోగం కంటే సామర్థ్యం రెండింతలుగా ఉంది. ప్రభుత్వానికి ఆదాయం మిస్.. కొన్ని కంపెనీల తీరుతో ప్రభుత్వానికి ఆదాయం రాకుండా పోతోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాల కోసం ఇలా చేస్తుండటం వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదని జెమిని ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా (జెఫ్) ఎండీ ప్రదీప్ చౌదరి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో చెప్పారు. ‘‘అటు బ్యాంకుల వద్ద బకాయిలు పెరిగిపోతున్నాయి. మూతపడ్డ కంపెనీలు నిరర్ధక ఆస్తులుగా మిగిలిపోతున్నాయి. ఈ ఆస్తుల విలువ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,000-4,000 కోట్లు ఉంటుంది’’ అని ఆయన తెలియజేశారు. డిమాండ్‌ను మించి ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ రంగంలో ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం లేదని జెఫ్ సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ‘2009-14 కాలంలో కొత్తగా ఏడు ప్లాంట్లు వచ్చాయి. కంపెనీని బట్టి ప్రభుత్వం నుంచి పొందే ప్రయోజనాలు 2017తో ముగుస్తాయి. ఇటీవలే రెండు రాష్ట్రాల్లోనూ నూతన పారిశ్రామిక విధానం ప్రకటించారు. సమస్య పునరావృతం కాకుండా వంట నూనెల కంపెనీలకు ఇచ్చే ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి’ అని అన్నారాయన. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలను కలిసి సమస్యను తెలియజేసేందుకు కృష్ణపట్నం ఎడిబుల్ ఆయిల్స్ రిఫైనర్స్ అసోసియేషన్ సన్నద్ధమవుతోంది కూడా. -
ప్రపంచబ్యాంకు ర్యాంకులపై విస్మయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు ప్రపంచ బ్యాంకు తాజాగా ఇచ్చిన ర్యాంకులపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రపంచంలోనే వినూత్నమైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామంటూ, తెలంగాణ బ్రాండ్ ఇమేజీని పలు దేశాల్లో చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బృందం ఒకవైపు చైనాలో పర్యటిస్తున్న తరుణంలో వెలువడ్డ ఈ ర్యాంకులు సర్వత్రా చర్చనీయంగా మారాయి. పెట్టుబడులకు దేశంలోనే అత్యంత అనువైన ప్రాంతంగా తెలంగాణలో పుష్కలమైన అవకాశాలున్నాయని ప్రభుత్వం ప్రచారం చేస్తున్న తరుణంలో అందుకు భిన్నంగా దేశంలో పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు ప్రపంచ బ్యాంకు 13వ ర్యాంకు ఇవ్వడం తెలిసిందే. దీనికితోడు ఆంధ్రప్రదేశ్‌కు రెండో ర్యాంకు లభించడంతో ప్రభుత్వ వర్గాలు ఇరుకునపడ్డాయి. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో పెట్టుబడులకు అనువైన వాతావరణముండటమేగాక పారిశ్రామికాభివృద్ధికి పుష్కలమైన వనరులున్నాయని ప్రభుత్వం ధీమాతో ఉంది. అలాంటిది ఏపీ కంటే చాలా తక్కువ ర్యాంకు దక్కడంతో ప్రభుత్వ వర్గాలు విస్తుపోయాయి. ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ర్యాంకులపై సామాన్య ప్రజలు కూడా ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారని ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ‘‘ఏ ప్రాతిపదికన ఈ ర్యాంకులిచ్చారో కూడా తెలియదు. ఈ ర్యాంకులను మేం పట్టించుకోం. మా పని మేం చేసుకుంటూ పోతాం. మా పనితీరే మా ర్యాంకింగ్‌ను నిర్ణయిస్తుంది’’ అని మంగళవారం ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘ప్రపంచబ్యాంకు ర్యాంకులకు మాటలతో బదులివ్వాల్సిన పని లేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. ‘‘మా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాలు, వాటి ద్వారా జరిగే అభివృద్ధే సరైన సమాధానం చెబుతుందని ఆయన అన్నారు. ‘‘ప్రపంచ బ్యాంకు ర్యాంకులకు ఏయే ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుందో అర్థం కావడం లేదు. గుజరాత్ తర్వాత దేశంలో వ్యాపార, పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రం తెలంగాణే. అభివృద్ధి చెందిన నగరాల్లో దేశంలో ముంబై తర్వాత హైదరాబాదే ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం, పెట్టుబడులకు అనుకూలంగా ఉండేందుకు కల్పిం చిన మౌలిక సదుపాయాలన్నీ ప్రజలకు తెలుసు’’ అని వ్యాఖ్యానించారు. -
సీఎంఓలో ‘చేజింగ్ సెల్’
పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇప్పించడమే లక్ష్యం హైదరాబాద్: నూతన పారిశ్రామిక విధానం కింద కొత్తపరిశ్రమలకు శరవేగంగా అనుమతులు జారీ చేసేందుకోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ)లో ‘చేజింగ్ సెల్’ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు ముఖ్య కార్యదర్శి ఈ విభాగానికి ఎక్స్ అఫీషియో సీఈఓగా వ్యవహరించనున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన కనీసం ఆరుగురు అధికారులతో కూడిన బృందం ఈ విభాగంలో పనిచేయనుంది. ఈ బృందంలో అధికారులతో పాటు కన్సల్టెంట్లు సైతం ఉండనున్నారు. పరిశ్రమలు, సీపీబీ, పురపాలక, పంచాయతీరాజ్, కార్మిక, ఆర్థిక శాఖలతో పాటు సుపరిపాలన కేంద్రం(సీజీజీ) నుంచి నిపుణులైన అధికారులను ఎంపిక చేసి ఈ సెల్లో నియమిస్తారు. ఈ సెల్ నెల రోజుల్లో తన కార్యక్రమాలను ప్రారంభించనుంది. రాష్ట్రానికి భారీ, మెగా పెట్టుబడుల రాకపై ఈ సెల్ దృష్టి సారిస్తుంది. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రొటోకాల్ ఏర్పాట్లు మొదలు అనుమతులు లభించే వరకు అన్ని వ్యవహారాలను ఈ సెల్ పర్యవేక్షించనుంది. దీనికి సంబంధించిన పురోగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేస్తుంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పెట్టుబడుల వెల్లువ
- పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకే ‘ఐపాస్’ - చిన్న పరిశ్రమలకు కూడా స్థలాల కేటాయింపు - ఆన్ లైన్లో దరఖాస్తుకు ప్రత్యేక వెబ్సైట్ - పరిశ్రమల స్థాపనలో యువతకు శిక్షణ - రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అనుమతుల జారీని సరళతరం చేయడంతో జిల్లాకు పరిశ్రమలు వెల్లువలా వస్తున్నాయని చెప్పారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల శాఖను సమీక్షించారు. గతేడాది కాలంలో సుమారు రూ.15,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. ప్రభుత్వం నుంచి కారుచౌకగా భూములు పొంది ఆర్నెళ్లలోపు పరిశ్రమలు స్థాపించకపోతే కేటాయింపులను రద్దు చేయనున్నట్లు హెచ్చరించారు. చిన్న, సూక్ష్మ తరహా యూనిట్లను కూడా ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోనే తొలిసారిగా రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 200 గజాల స్థల ంలో కూడా యూనిట్ పెట్టదలిచే పారిశ్రామికవేత్తలకు అండగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ భూముల వివరాలను ఈ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు చెప్పారు. గతేడాది జిల్లాలో రూ.1,920 కోట్లతో 4,152 పరిశ్రమలు వచ్చాయని, తద్వారా 49వేల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. ఈ ఏడాది టీఎస్- ఐపాస్ కింద 174 కంపెనీలకు అనుమతులు జారీ చేశామని, ఈ సంస్థలు రూ.221.58 కోట్ల పెట్టుబడులు పెట్టాయని వివరించారు. అవినీతిరహిత ంగా పారిశ్రామికీకరణను ప్రోత్సహించాలనే సంకల్పంతో శ్రీకారం చుట్టిన టీఎస్ -ఐపాస్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు లభించిందని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు తగినంత భూమి ఉందని, జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 3,600 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. టీఎస్ఐఐసీ ద్వారా కేటాయించిన భూమి నిరుపయోగంగా ఉంటే వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతేకాకుండా అవసరాలకుపోను మిగతా భూములను కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. గ్రామీణ, మండలస్థాయిలో పరిశ్రమల స్థాపనకు యువతకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో టీఎస్ఐఐసీ మేనేజింగ్ డెరైక్టర్ ఈవీ నర్సింహారెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్‌రాజ్, కలెక్టర్ రఘునందన్‌రావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్లు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
అనుబంధ రంగాలకు ‘ప్రాధాన్యత’
సాక్షి, హైదరాబాద్ : నూతన పారిశ్రామిక విధానానికి వస్తున్న స్పందన నేపథ్యంలో పరిశ్రమలకు అనుబంధంగా ఉండే రంగాలకు (పాధాన్యత రంగాలు) కూడా ప్రత్యేక పాలసీలు రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పాలసీలపై కసరత్తు పూర్తి చేసి విధి విధానాలు ప్రకటించాలని నిర్ణయించింది. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, భౌగోళిక అనుకూలతలు, మానవ వనరులు, ముడి సరుకుల లభ్యత తదితరాలపై నిపుణులు ఇదివరకే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నివేదిక ఆధారంగా రాష్ట్రంలో 14 పారిశ్రామిక అనుబంధ రంగాల పురోభివృద్ధికి అవకాశముందని అంచనా వేసి పారిశ్రామిక విధానంలో అంతర్భాగంగా చేర్చారు. లైఫ్ సెన్సైస్, ఐటీ, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, టెక్స్టైల్, ప్లాస్టిక్, గృహోపకరణాలు, లోహ పరిశ్రమ, వజ్రాభరణాలు, వేస్ట్ మేనేజ్మెంట్, పునరుత్పాదక ఇంధనం, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, రవాణా సౌకర్యాలకు సంబంధించిన రంగాలను ప్రాధాన్యత రంగాలుగా గుర్తించారు. నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా ఇప్పటి వరకు రెండు విడతల్లో 36 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. వీటి ద్వారా రూ.2,588 కోట్ల పెట్టుబడులు, 8,638 మందికి ఉపాధి దక్కుతుందని అంచనా. ఈ నేపథ్యంలో గుర్తించిన 14 ప్రాధాన్యత రంగాలకు కూడా వేర్వేరుగా ప్రత్యేక పాలసీలు రూపొందిస్తే పెట్టుబడులు వెల్లువలా వస్తాయని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రతీ రంగానికి సంబంధించి ప్రభుత్వ విధానం, ప్రోత్సాహకాలు, రాయితీలు తదితరాలకు సంబంధించి ప్రత్యేక పాలసీల్లో పూర్తి స్పష్టత ఇవ్వనున్నారు. కాగా, పన్నుల వసూలు విధానంపై స్పష్టత లేకపోవడాన్ని పారిశ్రామిక వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా రూపొందిస్తున్న ప్రత్యేక పాలసీల్లో ఈ అంశంపైనా స్పష్టత ఇవ్వనున్నారు. మౌలిక సదుపాయాలపైనా దృష్టి.. రాష్ట్రాన్ని పెట్టుబడుల ధామంగా మార్చేం దుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వడమే మార్గమని ప్రభుత్వం భావిస్తోం ది. పెట్టుబడులు ఆకర్షించేందుకే పరిమితం కాకుండా మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తామని చెప్తోంది. ఇందులో భాగంగా పారిశ్రామిక వాడలకు అనుబంధంగా ప్రత్యేక నివాస సముదాయాలు నిర్మించే ఆలోచనలో ఉంది. ఇటీవల జరిగిన సీఐఐ సమావేశంలో పారిశ్రామిక వాడల సమీపంలో శాటిలైట్ టౌన్‌షిప్‌ల ఏర్పాటు ఆలోచనను సీఎం ప్రస్తావించారు. ఇళ్ల నిర్మాణానికి పరిశ్రమలకే భూములు కేటాయించాలా లేక ప్రభుత్వమే నివాస సముదాయాలను అభివృద్ధి చేయాలా అనే అంశంపై కసరత్తు చేయనుంది. -
జీవో 55ను బయట పెట్టిన సిబ్బందికి షోకాజ్
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల అధికారాలను కత్తిరించేందుకు ప్లాన్ చేసిన ప్రభుత్వ పెద్దలు, తమ బండారాన్ని బయటపెట్టిన కిందిస్థాయి అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం తెచ్చిన నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా.. గ్రామ పంచాయతీలు చేసిన తీర్మానాలను రద్దు చేసే హక్కును కలెక్టర్లకు కల్పించాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా జీవో నెంబరు 55ను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించక మునుపే ఉత్తర్వుల తుది ప్రతి(ఫైనల్ డ్రాఫ్ట్) ప్రభుత్వ వెబ్సైట్లో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. జీవో 55 జారీ పట్ల సర్పంచుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో జీవోను ఉపసంహరించుకున్నట్లు సర్కారు ప్రకటించింది. కానీ, తెలిసో తెలియక తుది ప్రతిని వెబ్సైట్లో పెట్టిన పాపానికి ముగ్గురు సెక్షన్ అధికారులను మాత్రం సర్కారు చిక్కుల్లో పడేసింది. ఉత్తర్వులు బహిర్గతం కావడానికి కారకులుగా భావిస్తూ ఒక సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్రటరీపై అభియోగాలు మోపుతూ సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పదిరోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అనంతరం విచారణ జరిపి శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. -
రాచకొండకు రాజయోగం
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని రాచకొండకు మళ్లీ రాజయోగం పట్టనుంది. ఇన్నాళ్లూ ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన రాచకొండకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీఎస్ ఐపాస్ పేరుతో తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానంతో మహర్దశ పట్టనుంది. ఈ పారిశ్రామిక విధానానికి ఆకర్షితులవుతున్న పారిశ్రామికవేత్తలు, ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌కు చేరువలోని రాచకొండపై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇది పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనువైన ప్రాంతమని భావిస్తున్నారు. నల్లగొండ-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులో రాచకొండ అటవీ ప్రాంతం ప్రభుత్వ, అటవీ, అసైన్డ్, సీలింగ్ భూములతో కలుపుకొని 42 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది హైదరాబాద్ నగరానికి చేరువలో, శంషాబాద్ విమానాశ్రయానికి 25 కిలోమీటర్ల లోపు దూరంలో, ఔటర్ రింగ్‌రోడ్డుకు అతి సమీపంలో ఉంది. దీంతో ప్రభుత్వం మూడు జిల్లాల సరిహద్దులోని ప్రాంతమంతటినీ పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రెండుమార్లు ఈ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా గుర్తించారు. పారిశ్రామిక వేత్తలు కూడా పరిశీలించి బాగుందని చెప్పడంతో, మహబూబ్‌నగర్ జిల్లా ముశ్చర్లలో ఫార్మాసిటీకి 11 వేల ఎకరాల భూమిని కేటాయించారు. రాచకొండలో 2 వేల ఎకరాల్లో ఆత్యాధునిక హంగులతో కూడిన సినిమా సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైలు బోగీల పరిశ్రమ రాచకొండలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన స్థలం కోసం ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం సర్వే చేసింది. 14 వేల ఎకరాల భూమి పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్నట్టు తేల్చింది. ఈ భూమిని క్లస్టర్లుగా విభజించనున్నారు. ఒక్కో క్లస్టర్‌ను ఒక్కో దానికి కేటాయించే ఆలోచన చేస్తున్నారు. ఓ క్లస్టర్లో 2 వేల ఎకరాలు ఫిలింసిటీకి, మరో 2 వేల ఎకరాలు స్మార్ట్ సిటీకి కేటాయించే ఆలోచన చేస్తున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో రైలు బోగీల పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన రుయా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పవన్‌కుమార్ రుయా, అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కంపెనీల ప్రతినిధులతో కలసి వారంరోజుల క్రితం రాచకొండ ప్రాంతాన్ని పరిశీలించారు. శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు, ఎన్‌హెచ్-65లకు రాచకొండ ఎంతదూరంలో ఉందనే విషయంపై ఆరా తీశారు. అనంతరం రాచకొండ పరిశ్రమల ఏర్పాటుకు బాగుందని కితాబునిచ్చారు. ఏడు దేశాల కంపెనీల సహకారంతో 2 వేల ఎకరాల్లో రూ.20 వేల కోట్ల పెట్టుబడులతో స్మార్ట్సిటీతోపాటు, పలు పరిశ్రమల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే ప్రభు త్వ పరిశీలనలో ఫిల్మ్‌సిటీ, స్పోర్ట్స్‌సిటీ, ఎడ్యుకేషన్ హబ్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రతిపాదనల్లో ఉన్నాయి. కాగా ఇప్పటికే, రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే పలు పరిశ్రమలకు ఏపీఐఐసీ భూములను కేటాయించింది. రాచకొండకు నాలుగులేన్ల రోడ్లు రాచకొండకు హైదరాబాద్ నుంచి, శంషాబాద్ నుంచి, 65వ నెంబరు జాతీయ రహదారి నుంచి నాలుగులేన్ల రోడ్లను అభివృద్ది చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి తోడు ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డుకు అనుసంధానంగా, మెదక్, వరంగల్, కరీంనగర్, శ్రీశైలం, విజయవాడ జాతీయ రహదారులను కలుపుతూ, మరో రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇదే విషయమై ఇప్పటికే హైదరాబాద్ నుంచి 60 నుంచి 100 కి.మీ. దూరంతో రింగ్ రోడ్డు ఉంటుందని ప్రకటన కూడా చేసింది. హైవేలను కలపడం ద్వారా, రాజధానికి వాహనాల రద్దీని తగ్గించాలనేది ఈ రింగ్‌రోడ్డు ఉద్దేశం. ఈ రోడ్డుతో రాచకొండ ప్రాంతం రింగురోడ్డు లోపలకు వస్తుంది. ైెహ దరాబాద్‌కు రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది. -
కదలిక...!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా పారిశ్రామికాభివృద్ధిలో తొలి అడుగు పడింది. టీఎస్ ఐపాస్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని వెల్లడించిన తెల్లారే అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కంపెనీల ప్రతినిధులు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చారు. రుయా గ్రూపు కంపెనీ చైర్మన్ పవన్‌కుమార్ రుయా శనివారం రాచకొండ గుట్టల్లో పర్యటించారు. అక్కడ స్మార్ట్‌సిటీతో పాటు పలు పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని, ఏడు దేశాలకు చెందిన కంపెనీల సహకారంతో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టి 2వేల ఎకరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించడం విశేషం. దీనికి తోడు ఇదే రాచకొండ గుట్టల్లో గతంలో ప్రభుత్వం ప్రతిపాదించిన ఫిల్మ్‌సిటీ, స్పోర్ట్స్సిటీల ప్రతిపాదనలు కూడా ఉన్నతాధికారుల పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. రుయా కంపెనీ ప్రతిపాదనలు కూడా వీటికి తోడయితే రాచకొండ గుట్టలో పారిశ్రామిక రాజసం విలసిల్లుతుందని అధికార వర్గాలంటున్నాయి. అయితే, ఆ ప్రాంతంలో ఇప్పటికే ఫీల్డ్ఫైరింగ్ రేంజ్ పేరుతో బీడీఎల్ కంపెనీకి ఇచ్చిన భూములను వెనక్కు తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే యాదాద్రి పవర్‌ప్లాంటు పేరుతో దేశంలోనే అతిపెద్ద థర్మల్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటునకు ఇటీవలే సీఎం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు టీఎస్ఐపాస్ విడుదల చేసిన సందర్భంగా జిల్లాలో సిమెంటు, ఫార్మా పరిశ్రమలు ఏర్పాటు చేయడాన్ని ప్రాధాన్యతాంశంగా తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిపై ఆశలు పెరుగుతున్నాయి. ‘ఫీల్డ్’ కథ ఇది.. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో సుమారు 35వేల ఎకరాల్లో రాచకొండ అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. కేంద్ర ప్రభుత్వం 1982లో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌ను నల్లమల అడవుల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. వన్యమృగాలకు తోడు...హైదరాబాద్‌కు దూరంగా ఉందన్న కారణాలతో అక్కడ నుంచి విరమించుకున్నారు. రాష్ట్ర రాజధానికి చేరువలోని రాచకొండ గుట్టల్లో ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. సరిగ్గా 13 ఏళ్ల క్రితం అంటే... 1992లో రక్షణశాఖ అధికారులు రాచకొండ గుట్టలను పూర్తిగా సర్వే చేశారు. సుమారు 35వేల ఎకరాలకు సరిహద్దులు కూడా గుర్తించారు. సంస్థాన్నారాయణపురంతో పాటు చౌటుప్పల్, మర్రిగూడ, రంగారెడ్డి జిల్లా మంచాల మండలాల సరిహద్దులను గుర్తించారు. అయితే, అప్పుడు అన్ని వర్గాల నుంచి వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని వెనక్కి తగ్గారు. అయితే వివిధ కారణాల వల్ల మళ్లీ 2003లో రాచకొండ గుట్టల్లోనే ఫీల్డ్ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మళ్లీ వ్యతిరేకతలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఫైరింగ్రేంజ్ ఏర్పాటు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అప్పటి నుంచి రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు దీనికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాయి. వైఎస్ హయాంలోనే ఈ ప్రాజెక్టును అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు తరలిస్తున్నట్టు ప్రకటించారు. పారిశ్రామిక కారిడార్‌కు సదవకాశం రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులో రాచకొండ గుట్టల్లో 42వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఈ ప్రాంతమంతా శంషాబాద్ విమానాశ్రయానికి చేరువలో ఉంది. దీంతో ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ కారిడార్‌గా అభివృద్ధిచేసే యోచనలో ఉంది. అందులో భాగంగా ముశ్చర్లలో ఫార్మాసిటీకి 11వేల ఎకరాల భూములను ప్రభుత్వం ఇటీవలే కేటాయించింది. ఇదే క్రమంలో రాచకొండకు హైదరాబాద్ నుంచి, శంషాబాద్ నుంచి నాలుగులేన్ల రోడ్లను ఏర్పాటు చేసి, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. క్లస్టర్లుగా విభజించి ఓ క్లస్టర్లో 2వేల ఎకరాల్లో ఫిలింసిటీ మిగిలిన వాటిలో స్పోర్ట్స్‌సిటీ, ఎడ్యుకేషన్‌హబ్ పేరుతో ప్రతి ష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 1.30లక్షల ఎకరాల భూములు జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ భూముల సర్వే పూర్తయింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1.30 లక్షల ఎకరాల భూములున్నాయని అధికార యంత్రాంగం గుర్తించింది. రాచకొండ, దిలావర్పూర్ అటవీరేంజ్లను మినహాయించి ఈ భూముల సర్వే జరిగింది. ప్రభుత్వ భూము ల్లో మొత్తం 4వేల ఎకరాల వరకు పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే భూములున్నా యి. ఈ భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఎలాంటి అవాంతరాలు లేవని, మరో 5వేల ఎకరాల్లో చిన్న చిన్న సమస్యలను తొలగిస్తే పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవచ్చని తెలుస్తోంది. ఈ మేర కు అధికారులు నివేదికలు కూడా పంపారు. మేం సిద్ధంగా ఉన్నాం : జేసీ సత్యనారాయణ జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఏ కంపెనీ ముందుకొచ్చినా సహకరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే భూముల సర్వే పూర్తి చేసి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను కూడా గుర్తించాం. ఈ మేరకు టీఎస్‌ఐడీసీకి నివేదిక పంపాం. -
పెట్టుబడులకు స్వాగతం
నేడే టీఎస్ ఐపాస్ మార్గదర్శకాలు విడుదల * నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ * 2 వేల మంది ప్రతినిధుల సమక్షంలో మార్గదర్శకాల ఆవిష్కరణ సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించేలా రూపొందించిన నూతన పారిశ్రామిక విధానాన్ని (టీఎస్ ఐపాస్) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రారంభించనున్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో జరిగే ఈ సమావేశానికి ప్రపంచం నలుమూలల నుంచి 2 వేలమందికిపైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. వివిధ దేశాల రాయబారులు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీల చైర్మన్లు, సీఈవోల సమక్షంలో టీఎస్ ఐపాస్ మార్గదర్శకాలను సీఎం ఆవిష్కరించనున్నారు. మేక్ ఇన్ తెలంగాణ పేరిట రూపొందించిన ప్రత్యేక లోగో, ఇన్ఫోసిస్ సహకారంతో అభివృద్ధి చేసిన టీఎస్ ఐపాస్ వెబ్‌సైట్‌ను కూడా సీఎం ఆవిష్కరిస్తారు. ప్రతిష్టాత్మకంగా టీఎస్ ఐపాస్ ఆవిష్కరణ రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా చూపేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం మార్గదర్శకాల విడుదల కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. హెచ్ఐసీసీలో 40 వేల చదరపు అడుగుల వైశాల్యంలో వంద మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, ప్రపంచం నలుమూలల నంచి తరలివస్తున్న ఆహ్వానితులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వరంగ సంస్థల అధిపతులు, బిజినెస్ స్కూళ్ల నిర్వాహకులు, ఫిక్కీ, ఫ్యాప్సీ, క్రెడాయ్, ఐటీ, ఫార్మా, టెక్స్టైల్, ఆటోమొబైల్ రంగాల ప్రముఖులు, వివిధ జిల్లాల్లోని పరిశ్రమల యజమానులు హాజరవుతున్నారు. అతిథులకు ఎయిర్‌పోర్టులోనే స్వాగతం పలికి హెచ్ఐసీసీకి తోడ్కొనివచ్చేలా వలంటీర్ల బృందాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రత్యేకతను చాటేలా ఎయిర్‌పోర్టు, సచివాలయం నుంచి హెచ్ఐసీసీ వరకు హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. భారీ పరిశ్రమలకు పక్షంలో అనుమతులు... నూతన పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్ చట్టం)ను రాష్ట్ర అసెంబ్లీ గత ఏడాది నవంబర్ 27న ఏకగ్రీవంగా ఆమోదించింది. ‘తెలంగాణ సింగిల్ విండో వితౌట్ గ్రిల్స్’ నినాదంతో రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే వారికి అనువైన వాతావరణం కల్పించేలా టీఎస్ ఐపాస్‌ను రూపొందించారు. రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ)కు ఇప్పటికే 1.65 లక్షల ఎకరాల భూమిని పారిశ్రామిక అవసరాలకు ప్రభుత్వం కేటాయించింది. టీఎస్ఐఐసీ ఆధీనంలోని భూముల్లో విద్యుత్, నీరు, రహదారులు వంటి మౌలిక సౌకర్యాలను కల్పిస్తారు. వాటర్‌గ్రిడ్ ద్వారా 10 శాతం నీటిని పారిశ్రామిక అవసరాలకు కేటాయిస్తారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేవారితో సీఎం కార్యాలయంలోని చేజింగ్ సెల్ దరఖాస్తుదారులతో ముఖాముఖి జరుపుతుంది. మెగా పరిశ్రమలకు 15 రోజుల్లో, ఇతర పరిశ్రమలకు నెల రోజుల్లో అనుమతులు జారీ చేస్తారు. చట్టంలోని నిబంధనలు అంగీకరిస్తూ దరఖాస్తుదారులు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇవ్వడం నూతన విధానం ప్రత్యేకతగా పేర్కొంటున్నారు. నిర్ణీత వ్యవధిలోగా అనుమతులు ఇవ్వకున్నా, చట్టంలోని నిబంధనలు పాటించకున్నా అపరాధరుసుము విధించనున్నారు. -
పరిశ్రమలకు 1.45 లక్షల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: కొత్త పరిశ్రమల స్థాపనకు అనువైన 1.45 లక్షల ఎకరాల భూములను తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. వెంటనే ఈ భూములను పరిశ్రమల శాఖకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పారిశ్రామిక విధానాన్ని ఈ నెల 12న లాంఛనంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భూముల ముందస్తు అప్పగింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దేశ విదేశాల్లోనే మేటైన పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేసినట్లు స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇది అత్యంత సులభమైన విధానం కావటంతో.. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతాయని.. కొత్త పరిశ్రమల స్థాపనకు ఔత్సాహి కులు తరలివస్తారనే భారీ అంచనాలున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే భూములు.. మౌలిక వసతుల కల్పనపై సర్కారు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. హైదరాబాద్ మినహా రాష్ట్రం లోని 9 జిల్లాల పరిధిలో పరిశ్రమల శాఖకు 1.45 లక్షల ఎకరాల భూములను ముందస్తుగా అప్పగిస్తూ ఇటీవలే రెవెన్యూ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూములను మూడు కేటగిరీలుగా విభజించింది. 47,912.62 ఎకరాలు చదును భూములు, 45,503.99 ఎకరాల్లో చిన్న చిన్న గుట్టలు, మట్టి దిబ్బలున్న భూములు, 52,266.38 ఎకరాలు గుట్టలు, కొండలున్న భూములుగా వర్గీకరించింది. గతంలో ఉన్న జీవో నం.571 లోని విధివిధానాలు, మార్గదర్శకాల ప్రకారం తుది అప్పగింత ప్రక్రియను తదుపరి నిర్వహించుకోవాలని సూచించింది. పరిశ్రమల శాఖకు భూములను అప్పగించటంతో పాటు.. ఆక్రమణలకు గురవకుండా ఈ భూములను పరిరక్షించే చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా సర్క్యులర్ జారీ చేశారు. భూముల అప్పగింతతో పాటు కొత్త పారిశ్రామిక విధానానికి అనుగుణంగా సర్కారు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. సింగిల్ విండో విధానం, ఆన్లైన్లో అప్లికేషన్ల ప్రాసెసింగ్, 10-12 రోజుల్లో అనుమతుల జారీ, సీఎం కార్యాలయంలో చేజింగ్ సెల్ ఏర్పాటు, సింగిల్ విండో విధానం, ఆన్లైన్ దరఖాస్తులు స్వయంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అన్ని విభాగాల అనుమతుల ప్యాకేజీని అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. -
అతిరథుల సమక్షంలో పారిశ్రామిక విధానం
2 వేల మంది ప్రముఖులను ఆహ్వానించనున్న రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నూతన పారిశ్రామిక విధానం కోసం మార్గదర్శకాల విడుదలకు ఈ నెల 12న ముహూర్తం ఖరారు కావడంతో ఆహ్వానితుల జాబితాను రూపొందించడంపై టీఆర్ఎస్ సర్కారు దృష్టి సారించింది. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు, బహుళజాతి కంపెనీల ప్రతినిధుల సమక్షంలో నూతన విధానాన్ని ప్రకటించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్... ఇందుకోసం 2 వేల మంది పారిశ్రామికరంగ ప్రముఖులను మార్గదర్శకాల విడుదల కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలు, ప్రముఖులు వంద మందికి కేసీఆర్ స్వయంగా ఆహ్వాన పత్రాలు పంపనున్నారు. హెచ్ఐసీసీలో జరిగే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిశ్రమలశాఖ...వంద మంది ప్రముఖుల జాబితా తయారీ ప్రక్రియను కేసీఆర్ సూచనలకు అనుగుణంగా చేపడుతోంది. అలాగే మిగతా ఆహ్వానితులకు సంబంధించిన జాబితాపై కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలతోపాటు, వివిధ అసోసియేషన్లకు ఆహ్వానాలు పంపుతున్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) ద్వారా ఆయా జిల్లాల్లోని పరిశ్రమల యాజమాన్యాలకు కూడా ఆహ్వానాలు పంపుతున్నారు. ఆహ్వాన పత్రాల పంపిణీ, కార్యక్రమానికి వచ్చే వారిని సమన్వయం చేసేందుకు పరిశ్రమలశాఖ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే మిస్త్రీకి ఆహ్వానం: నూతన పారిశ్రామిక విధానం మార్గదర్శకాల విడుదల కార్యక్రమానికి టాటా సన్స్ చైర్మన్ సైరస్ మిస్త్రీని ప్రభుత్వం ఆహ్వానించింది. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు మే 27న ముంబై వెళ్లి మిస్త్రీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. మరికొంత మంది ప్రముఖులకు సీఎం స్వయంగా ఫోన్ చేయడంగానీ, మంత్రులతో ఆహ్వానం పంపడంగానీ జరుగుతుందని పరిశ్రమలశాఖ అధికారులు వెల్లడించారు. మార్గదర్శకాల విడుదల కార్యక్రమాన్ని ఈ నెల 7న నిర్వహించాలని ప్రభుత్వం భావించినా హెచ్ఐసీసీలో ఇతర కార్యక్రమాలు ఉండటం, ఆహ్వానితుల జాబితా సకాలంలో సిద్ధం కాదనే భావనతో ఈ నెల 12కు వాయిదా వేసింది. -
నూతన పారిశ్రామిక విధానం భేష్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం భేషుగ్గా ఉందని చెప్పవచ్చు. కొత్త రాష్ట్రంలోకి భారీ ఎత్తున పెట్టుబ డులు ఆకర్షించే విధంగా నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా ఉంది. పరిశ్రమల్లో నామమాత్రపు తనిఖీలు, పూర్తిస్థాయి మద్దతు, ప్రాజెక్టు అనుమతులు తదితరాలను మంజూరు చేసేందుకు సింగిల్‌విండో విధానాన్ని ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, పెట్టుబడుల సేకర ణకు విరివిగా అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకోసం 2014-15 బడ్జెట్లో 1,165 కోట్ల రూపాయలు కేటాయించడం, చిన్న తరహా సూక్ష్మస్థాయి పరిశ్రమల రంగానికి సంబంధించి లెసైన్సులు, అనుమ తుల మంజూరుకు సంబంధించిన విధానాలను వికేంద్రీకరించడం, జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనేందుకు అవస రమైన మార్కెటింగ్ సహకారాన్ని అందించడం శుభసూచకం. ఎస్సీ, ఎస్టీలకు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకోసం చర్యలు ప్రతిపాదించడం సంతోషదాయకం. నిరంతర సమీక్ష, పర్యవేక్షణతో పాలసీ అమలుపై బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. సురేష్ కాలేరు భారత్‌నగర్, భువనగిరి -
పరిశ్రమకు పండుగ
-
పరిశ్రమకు పండుగ
* మెగా ప్రాజెక్టులకు 15 రోజుల్లోనే అన్ని అనుమతులు * మిగతావాటికి నెల రోజుల్లోగా గ్రీన్‌సిగ్నల్ * అసెంబ్లీ ముందుకు కొత్త పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్-2014 * శాసనసభలో బిల్లును పెట్టిన హరీశ్‌రావు * సత్వర అనుమతులకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు * సహాయ సహకారాలకు నోడల్ ఏజెన్సీల ఏర్పాటు * ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన పెట్టుబడి సదుపాయాల బోర్డు * దరఖాస్తుదారులకు అండగా ‘టీఎస్ఐపాస్ అనుమతుల హక్కు’ * అనుమతుల్లో జాప్యం, దరఖాస్తుల తిరస్కరణకు కారణాల వెల్లడి * ఏ స్థాయిలో తప్పు జరిగినా బాధ్యులందరికీ శిక్ష సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రంగాన్ని కొత్తపుంతలు తొక్కించేందుకు నూతన పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించింది. రాష్ర్టంలో పెట్టుబడిదారులకు అనువైన వాతావరణం సృష్టించి, భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే తన లక్ష్యమని అసెంబ్లీలో ప్రకటించింది. ‘తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు ఆమోదం, స్వీయ ధ్రువీకరణ(టీఎస్ఐపాస్) చట్టం-2014’ పేరుతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశాల మేరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ కొత్త విధానాన్ని మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు ఈ బిల్లును సభ ముందుంచారు. దీని ప్రకారం రాష్ర్ట, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి, కంపెనీలు పెట్టడానికి ముందుకువచ్చే పారిశ్రామికవేత్తల దరఖాస్తులను ఆ కమిటీల ద్వారా పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో రాష్ర్ట, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే నోడల్ ఏజెన్సీలు కూడా సహాయసహకారాలను అందిస్తాయి. మెగా ప్రాజెక్టులకు 15 రోజుల్లో, మిగతా వాటికి 30 రోజుల్లోగా ఒకే చోట అన్ని అనుమతులు ఇవ్వాలన్నది ఈ విధానం లక్ష్యం. దరఖాస్తుల సమయంలోనే పారిశ్రామికవేత్తలు సమర్పించే స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని ప్రభుత్వ కమిటీలన్నీ ప్రామాణికంగా తీసుకుంటాయి. ఈ ప్రక్రియలో ఏ స్థాయిలో మోసం జరిగినా, ఏమాత్రం నిబంధనలను ఉల్లంఘించినా అందుకు బాధ్యులైనవారంతా శిక్షార్హులవుతారని బిల్లులో పేర్కొన్నారు. ఒకవేళ దరఖాస్తులు తిరస్కరణకు గురైనా, అనుమతుల్లో జాప్యం జరిగినా అందుకు కారణాలను కూడా ‘టీఎస్ఐపాస్ అనుమతుల హక్కు’ కింద పారిశ్రామికవేత్తలు తెలుసుకోవచ్చు. అసెంబ్లీలో ఆమోదం లభించి ఈ కొత్త చట్టం అమల్లోకి రాగానే రాష్ర్టంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సింగిల్ విండో క్లియరెన్స్ చట్టం-2002 రద్దుకానుంది. టీఎస్ఐపాస్(తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం)లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. * రాష్ట్ర స్థాయిలో స్టేట్ టీఎస్ఐపాస్ కమిటీ ఏర్పాటవుతుంది. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, పరిశ్రమల శాఖ కమిషనర్ సభ్య కార్యదర్శిగా వ్యవ హరిస్తారు. సంబంధిత విభాగాల అధిపతులు సభ్యులుగా ఉంటారు. * జిల్లా స్థాయిలోనూ టీఎస్ఐపాస్ కమిటీలను ఏర్పాటు చేస్తారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్‌గా ఉంటారు. సంబంధిత శాఖల జిల్లా, ప్రాంతీయ స్థాయి అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. * జిల్లా పరిధిలో పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే అనుమతులకు సంబంధించిన దరఖాస్తులను జిల్లా కమిటీ స్వీకరిస్తుంది. 30 రోజుల్లో అనుమతులు జారీ చేస్తుంది. జిల్లా పరిధిలోకి రాని ప్రాజెక్టులను రాష్ట్ర కమిటీకి చేరవేస్తుంది. * దరఖాస్తుల పురోగతి, ఎప్పటిలోగా అనుమతి మంజూరవుతుందనే తేదీల సమాచారాన్ని సంబంధిత శాఖలు, కమిటీలు దరఖాస్తుదారులకు తెలియపరచాలి. * సంబంధిత శాఖల్లో దరఖాస్తుల పురోగతిని కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. శాఖలతో సంబంధం లేకుండానే దరఖాస్తుదారుని స్వీయ ధ్రువీకరణను ఆధారం చేసుకుని జిల్లా కమిటీ ఆమోదం తెలుపుతుంది. * రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర స్థాయిలో పరిశ్రమల శాఖ అదనపు డెరైక్టర్ హోదాకు తక్కువ కాని అధికారి సారధ్యంలో పర్యవేక్షక సిబ్బంది ఉంటారు. జిల్లా స్థాయిలో జిల్లా పారిశ్రామిక కేంద్రాన్ని నోడల్ ఏజెన్సీగా పరిగణిస్తారు. * ఈ నోడల్ ఏజెన్సీలు జిల్లా కమిటీలకు, రాష్ట్ర కమిటీకి సహాయ సహకారాలను అందిస్తాయి. కమిటీలకు అందిన దరఖాస్తులన్నింటికీ రశీదులు అందజేస్తాయి. మూడు రోజుల వ్యవధిలో సంబంధిత విభాగాలకు పంపిస్తాయి. దరఖాస్తుల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తాయి. * నోడల్ ఏజెన్సీ రశీదు జారీ చేయకముందే పరిశ్రమలకు సంబంధించిన దరఖాస్తులను రాష్ట్ర కమిటీ క్షుణ్నంగా పరిశీలిస్తుంది. పెట్టుబడిదారులకు మార్గదర్శకంగా, సహాయకారిగా ఉండేందుకు వారంలో రెండుసార్లు ఈ పరిశీలన చేపడుతుంది. * మెగా ప్రాజెక్టుల అనుమతులకు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన పెట్టుబడి సదుపాయాల బోర్డు(తెలంగాణ స్టేట్ వైడ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ బోర్డు-టీస్విప్ట్)ను ఏర్పాటు చేస్తారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి దీనికి మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. స్వీయ ధ్రువీకరణ దరఖాస్తు మేరకు ఈ ప్రాజెక్టులకు 15 రోజుల వ్యవధిలోనే బోర్డు తాత్కాలిక ఆమోదం తెలుపుతుంది. పరిశ్రమలు వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభించకముందే నోడల్ ఆఫీసర్ ద్వారా సంబంధిత శాఖల నుంచి తుది అనుమతుల జారీ అంశాన్ని కూడా బోర్డు పరిశీలిస్తుంది. * టీ స్విప్ట్ బోర్డు జారీ చేసిన అనుమతులు అంతిమమైనవి. అన్ని శాఖలు అందుకు కట్టుబడి ఉంటాయి. * జిల్లా కమిటీకి తనంతట తానుగా దరఖాస్తులను, అనుమతులను సైతం తిరస్కరించే అధికారముంటుంది. సంబంధిత శాఖలు జారీ చేసిన ఉత్తర్వులను పరీక్షిస్తుంది. తాము తీసుకున్న నిర్ణయాలు, మార్పులు చేర్పులకు సహేతుకమైన కారణాలున్నాయని జిల్లా కమిటీ భావిస్తే.. ఆ కేసును రాష్ట్ర కమిటీ నిర్ణయానికి పంపిస్తుంది. తుది నిర్ణయం అక్కడే జరుగుతుంది. రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయాలను జిల్లా కమిటీలు విధిగా అమలు చేయాలి. * రాష్ట్ర కమిటీ తనంతట తానుగా దరఖాస్తులు, అనుమతులను తిరస్కరించవచ్చు. మార్పులతో ఆమోదించే ఉత్తర్వులేమైనా ఉంటే తగిన ఆధారాలతో నివేదికను ప్రభుత్వానికి పంపించాలి. * కంపెనీల పెట్టుబడుల పరిమితిని బట్టి రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు వేటికి అనుమతులు జారీ చేయాలో ప్రభుత్వం నిర్దేశిస్తుంది. * నోడల్ ఏజెన్సీలకు ఇచ్చిన స్వీయ ధ్రువీకరణలో పొందుపరిచిన షరతులు, రాతపూర్వక హామీలు పాటించడంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విఫలమైతే ప్రభుత్వం వారికి జరిమానా విధిస్తుంది. * అనుమతుల జారీలో జాప్యానికి కారణాలు, జరిమానా విధింపునకు కారణాలను ‘టీఎస్ఐపాస్ అనుమతుల హక్కు’ కింద దరఖాస్తుదారులు తెలుసుకోవచ్చు. * ఈ ప్రక్రియలో దరఖాస్తుదారుల ఫిర్యాదుల పరిష్కారానికి, ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం ‘ఇబ్బందుల నివారణ యంత్రాంగా’న్ని ఏర్పాటు చేస్తుంది. * ఏదైనా కంపెనీ అపరాధానికి పాల్పడితే కం పెనీతో పాటు దాని వ్యాపార నిర్వహణలో ఉన్న ప్రతి వ్యక్తి శిక్షార్హులవుతారు. తనకు తెలియకుం డా అపరాధం జరిగినట్లు రుజువు చేస్తేనే శిక్ష పడ దు. సంబంధిత కంపెనీల డెరైక్టర్, మేనేజర్, కార్యదర్శి లేదా ఇతర అధికారుల సమ్మతి లేదా నిర్లక్ష్యం లేదా వారి కనుసన్నల్లోనే అపరాధం జరిగినట్లు తేలితే వారందరూ శిక్షర్హులవుతారు. -
నెలలోపే పరిశ్రమలకు అనుమతులు!
మీరు ఏదైనా పరిశ్రమ పెట్టాలనుకుంటున్నారా? అందుకు అనుమతుల కోసం చెప్పులరిగేలా తిరగాల్సిన అవసరం లేదు. ఇక ఎలాంటి పరిశ్రమకైనా నెల రోజుల్లోనే అనుమతులు వచ్చేస్తాయి. తెలంగాణ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. ఇంతకుముందున్న ఏపీ సింగిల్ విండో క్లియరెన్స్ యాక్ట్ 2002కు మార్పులు చేసి కొత్త విధానాన్ని అమలు చేయనుంది. దీనికింద నెల రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వనున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ఈ విధానం ఉండబోతోంది. అనుమతలు కోసం కలెక్టర్ నేతృత్వంలో జిల్లాస్థాయి, కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పాటుచేస్తున్నారు. నోడల్ ఏజెన్సీలు కూడా ఏర్పాటవుతున్నాయి. అనుమతుల జాప్యానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతుల ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటుచేస్తారు. -
ఆల్ ఫ్రీ... తూచ్!
-
ఆల్ ఫ్రీ... తూచ్!
* ఎన్నికల ముందు వందలాది ఉచిత హామీలిచ్చిన చంద్రబాబు * ఆరునెలలవుతున్నా ఒక్కశాతం కూడా అమలు కాని తీరు * 30 రోజుల్లో నూతన పారిశ్రామిక విధానం ప్రకటిస్తామని మర్చిపోయారు * ఆరు నెలల్లో ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అమలు కాలేదు * వ్యవసాయ రుణాలపై తొలిసంతకమూ అంతే * డ్వాక్రా మహిళల రుణాల మాఫీ లేదని తేల్చి చెప్పారు * కలగా మారిన వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ * పది లక్షల వృద్ధాప్య, వితంతు పింఛన్లకు కోత * రాష్ట్ర విభజన- ఆర్థిక సమస్యలంటూ హామీల దాటవేత * రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పన్ను రాయితీ సాధించడంలోనూ వైఫల్యం సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షం హెచ్చరించిన చందంగానే, పరిశీలకులు ఊహించిన విధంగానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలకు స్వయంగా ‘తూచ్’ మంత్రం పఠించారు. విజయవాడలో గురువారం జరిగిన తెలుగుదేశంపార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల సమక్షంలో పచ్చి అబద్ధాలను కన్నార్పకుండా పలికేయడంతో రాష్ట్ర ప్రజల్లో అక్కడక్కడా మిగిలి ఉన్న భ్రమలు పటాపంచలైపోయాయి. తాను పంటరుణాలు మాత్రమే మాఫీ చేస్తానని హామీ ఇచ్చినట్టూ. ఇంట్లో ఎన్ని రుణాలున్నా ఒకరికి మాత్రమే... అదీ లక్షన్నర లోపే మాఫీ చేస్తానని వాగ్దానం చేసినట్టూ అవలీలగా బొంకేయడంతో వింటున్న పార్టీ నేతలుసైతం నోళ్లు వెళ్లబెట్టక తప్పలేదు. ఎందుకంటే పంటరుణాలేకాదు, మొత్తం వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని, బంగారం తాకట్టు పెట్టిన రుణాలను కూడా తామే కట్టేస్తామనీ, డ్వాక్రా మహిళల రుణాలు కూడా తీర్చేస్తామనీ ఊరూవాడా ఏకం చేస్తూ ఎన్నికల ముందు తెలుగుదేశం చేసిన ప్రచారం జనం మదిలో ఇంకా తాజాగానే ఉంది. మొత్తం 300 వాగ్దానాలతో పంచిన మేనిఫెస్టో ప్రతులు, వేసిన కరపత్రాలు, అంటించిన పోస్టర్లు, మోత మోగించిన టీవీ ప్రకటనలు, పత్రికలనిండా పరుచుకున్న ప్రచారం... ఇంకా సాక్ష్యంగా లభ్యమవుతుండగానే చంద్రబాబు అడ్డంగా బుకాయించడంతో అన్ని వాగ్దానాలూ అటకెక్కినట్టేనన్న విషయం బోధపడింది. అన్నింటికంటే కీలకమైన రైతుల రుణమాఫీ విషయాన్నే తీసుకుందాం. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ ప్రభుత్వం ఈ విషయంలో వేస్తున్న పిల్లి మొగ్గల్ని చూస్తే... పంచపాండవులు మంచంకోళ్లలాగా ముగ్గురే అని రెండు వేళ్లు చూపించిన సామెత గుర్తొస్తుంది. రుణమాఫీకి అర్హమైన రైతుల ఖాతాలను తగ్గించేందుకు ఆరునెలలుగా సర్కారు చేస్తున్న యత్నాలు చూస్తుంటే పీసీ సర్కార్ మేజిక్‌షో గుర్తుకొస్తుంది. ప్రధానమైన ఇతర రంగాల సంగతీ అంతే. డ్వాక్రా మహిళల రుణమాఫీ సంగతి నోటితో చెప్పి నొసటితో వెక్కిరించినట్టయింది. సామాజిక పెన్షన్లు పెంచినట్టే పెంచి 10 లక్షలమంది లబ్ధిదారులను కత్తిరించేశారు. ఇంటికో ఉద్యోగం-లేదంటే రెండువేలు నిరుద్యోగ భృతి హామీని పూర్తిగా మరచిపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యవసాయానికి తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్‌ను రైతులకు ఉచితంగా ఇస్తామని స్పష్టంగా చెప్పిన హామీ... ఆ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఖరీఫ్ సీజను పూర్తయి, రబీ సీజన్ కూడా మొదలైనా అమలుకు నోచుకోలేదు. అసలా హామీ ముఖ్యమంత్రి నోట నుంచిగానీ, ఏ ఇతర మంత్రి నోట నుంచి వినిపించడం కూడా లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు తీసుకున్న ఐదు కీలక నిర్ణయాల్లో ఒకటైన ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంపు తమకూ వర్తింపజేయాలంటూ కార్పొరేషన్ల ఉద్యోగులు మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఉన్న 12 వేలకు పైగా గ్రామాల్లో కనీసం రెండు గ్రామాల్లో కూడా ఎన్టీఆర్ సుజల పథకం ఏర్పాటుకు నోచుకోలేదు. అధికారంలోకి రాగానే 30 రోజుల్లో నూతన పారిశ్రామిక విధానం ప్రకటిస్తామని పూర్తిగా మరిచిపోయారు. ఆరు నెలల్లో ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని స్పష్టంగా గడువు పెట్టిన హామీని అమలు చేసి చూపించలేకపోయారు. ఇసుక రీచ్‌లను పంచాయతీరాజ్ శాఖకే అప్పగించి, వచ్చే ఆదాయం దామాషా ప్రకారం గ్రామ, మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయిస్తామన్న హామీ అమలుకాలేదు. మార్చి 31న విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో రూ. రెండు లక్షల కోట్ల వ్యయమయ్యే హామీలిచ్చారని అప్పట్లోనే ఉజ్జాయింపు లెక్కలు వేశారు. మేనిఫెస్టోలోని ప్రతి హామీనీ, పథకాన్నీ, ప్రణాళికనూ అమలు చేసి ఆదర్శంగా నిలుస్తామని ఎన్నికలప్పుడు ప్రకటించుకున్నారు. అధికారంలోకి వచ్చాకేమో ‘రాష్ట్ర విభజన- ఆర్థిక సమస్యలు’ అంటూ దాటవేత మొదలుపెట్టారు. కానీ ఇప్పటికిప్పుడు ఏ మాత్రం అదనపు ఆర్థిక భారం పడని హామీలూ అమలుకు నోచుకోవడం లేదు. పరిశ్రమల అభివృద్ధికి పన్ను రాయితీలను కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించే గురుతర బాధ్యతను నిర్వర్తించగల సత్తా టీడీపీకే ఉందంటూ చెప్పి.. చివరకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పొందిన ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’, ‘పన్ను రాయితీ’ హామీలలో ఒక్కదానిని కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సాధించడంలోనూ చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. టీడీపీ మేనిఫెస్టోలోని కొన్ని హామీలు... - పార్టీ అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీపైనే తొలి సంతకం. రైతులకు లాభసాటి ధర వచ్చేందుకు స్వామినాథన్ కమి టీ సిఫార్సులు అమలయ్యేలా చూస్తాం. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులకు ఎరువుల సబ్సిడీ నిమిత్తం రూ. 500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం. రూ.5,000 కోట్లతో పంటల ధర స్థిరీకరణ నిధి ఏర్పా టు. కౌలురైతులకు గుర్తింపు కార్డులు అం దించి వారికీ రుణసౌకర్యాలు కల్పిస్తాం. - వ్యవసాయానికి తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుతును ఉచితంగా ఇస్తాం. గృహా వసరాలకు, పరిశ్రమలకు నిరంతరాయం గా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తాం. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం. - డ్వాక్రా సంఘాలను పునరుజ్జీవింపజేసే ప్రక్రియలో భాగంగా డ్వాకా సంఘాలు తీసుకున్న రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం. మహిళా సంఘాలకు రూ.లక్ష వరకు వడ్డీలేని రుణాలు ఇస్తాం. - పుట్టిన బిడ్డ పేరుతో అర్హులైన కుటుంబాలకు రూ. 25వేలు బ్యాంకులో డిపాజిట్ చేసి, వారికి యుక్త వయసు వచ్చేనాటికి రూ. 2 లక్షలను అందజేస్తాం. పేద గర్బిణులకు ఆరోగ్యం, పౌష్టికాహారం కోసం రూ. 10వేలు అందజేస్తాం - ఒక్కొక్క గ్యాస్ సిలిండర్‌కు రూ. 100 సబ్సిడీతో ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా సంవత్సరానికి ఒక కుటుంబానికి 12 గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తాం. - అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తాం. మద్యం బెల్ట్‌షాపుల రద్దు, ప్రతి జిల్లాలో డీఆడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం. - నిరుద్యోగ యువకులకు రూ. 1,000 నుంచి రూ. 2000 వరకు నిరుద్యోగ భృతి. ఇంటి కో ఉద్యోగం, కళాశాల విద్యార్థులకు ఉచితంగా టాబ్లెట్ కంప్యూటర్లు. విద్య, ఉద్యోగాల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్లను 33 శాతానికి పెంచుతాం. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆధార్‌తో సంబంధం లేకుండా అమలు చేస్తాం. - చేనేత కార్మికుల బ్యాంకు రుణాల మాఫీ. పవర్ లూమ్స్పైఉన్న రుణాలు కూడా రద్దు చేస్తాం. చేనేత కార్మికులకు రూ. 1000 కోట్లతో ప్రత్యేక నిధి మరియు బడ్జెట్లో ప్రతి ఏటా వెయ్యి కోట్లు కేటాయింపులు. జిల్లాకు ఒక చేనేత పార్కు. - ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ ఆరు నెలల కాలంలో అభ్యర్థులు అందుబాటులో ఉంటే భర్తీ చేస్తాం. ఎస్సీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తాం. భూమి లేని గిరిజన కుటుంబాలకు రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇస్తాం. గిరిజన అమ్మాయి వివాహానికి రూ. 50 వేల ఆర్థిక సహాయం. ప్రతి జిల్లాలో గిరిజన భవన్ నిర్మాణం. - ముస్లింలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించే ప్రక్రియను చట్టపరంగా సాధించడానికి కృషి చేస్తాం. దళిత క్రైస్తవులను ఎస్సీల్లోకి చేర్చడానికి చర్యలు చేపడతాం. కాపుల రిజర్వేషన్ విషయమై ప్రత్యేక కమిషన్‌ను నియమించి నిర్ణీత కాలవ్యవధిలో బీసీలకు నష్టం కలగకుండా సమస్యను పరిష్కరిస్తాం. - ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేస్తాం. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంపు. ఉద్యోగులు రిటైర్మెంట్కల్లా ఇల్లు ండేలా అందుబాటులో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తాం. - అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తాం. పరిశ్రమల స్థాపనకు 30 రోజుల్లోనే అన్ని అనుమతులిస్తాం. కడప, అనంతపురం జిల్లాల్లో ఇనుప ఖనిజం ఆధారంగా ఉక్కు ఫ్యాక్టరీలను నిర్మించేందుకు కృషి. జిల్లాల్లో డెయిరీ పరిశ్రమలు పటిష్టం. పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు. - శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం నుండి నెల్లూరు జిల్లా దుగరాజుపట్నం వరకు పాత పోర్టులతోపాటు అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ప్రతి జిల్లాలో ఒక పోర్టును అభివృద్ధి చేస్తాం. ఈ పోర్టులన్నీ అనుసంధానం చేస్తూ ఇప్పుడున్న కలక త్తా- చెన్నై జాతీయ రహదారికి సమాంతరంగా సముద్రతీరానికి దగ్గరగా మరొక రహదారిని నిర్మిస్తాం. బకింగ్‌హాం కెనాల్‌ను పునరుద్ధరించి జల రవాణాకు అనుకూలంగా మారుస్తాం. - ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు కల్పించిన ప్రత్యేక ప్యాకేజీలను వినియోగించుకొని అక్కడ పారిశ్రామిక అభివృద్ధి. రాయలసీమ జిల్లాలకు కల్పించిన ప్రత్యేక ప్యాకేజీలను వినియోగించుకొని చిత్తూరు, అనంతపురం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా సీఎంవోకు
హైదరాబాద్ : చిత్తశుద్ధితో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ముఖ్యమంత్రి కెసీఆర్ స్పష్టం చేశారు. గ్రాండ్ కాకతీయలో నూతన పారిశ్రామిక విధానంపై ఆయన మంగళవారం పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. 3 లక్షల ఎకరాలు పరిశ్రమలకు అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. సింగపూర్ తరహాలో సింగిల్ విండో సిస్టం ఏర్పాటు చేస్తామని, 24 గంటల కరెంట్, 10 శాతం నీరు పరిశ్రమలకు కేటాయిస్తామని కేసీఆర్ తెలిపారు. పూర్తి పారదర్శకంగా నూతన పారిశ్రామిక విధానం ఉంటుందని, కొత్త పారిశ్రామిక విధానంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. పారిశ్రామికవేత్తలను శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా సీఎంవోకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. పరిశ్రమల ఏర్పాటులో త్వరిత అనుమతుల కోసం ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. అన్నింటికి 21రోజుల్లోగా అనుమతులు ఉంటాయని, ఒకట్రెండు తప్ప అన్ని అనుమతులు ఒకే రోజు ఇస్తామని కేసీఆర్ వెల్లడించారు. ప్రతి సాగునీటి ప్రాజెక్టులో పది శాతం నీటిని పరిశ్రమలకు కేటాయించారు. పరిశ్రమల అభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధే లక్ష్యమన్నారు. అలాగే హైదరాబాద్‌లో హార్డ్‌వేర్ రంగాన్ని అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. -
పెట్టుబడులకు భూములు రెడీ!
‘మేడిన్ తెలంగాణ ’ నినాదమెత్తుకున్న కొత్త ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. నూతన పారిశ్రామిక విధానంతో పరిశ్రమల స్థాపనకు ద్వారాలు తెరుస్తోంది. ఏకగవాక్షం (సింగిల్ విండో) పద్ధతిలో అనుమతులు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి తరలివచ్చే ఐటీ ఆధారిత, ఫార్మా తదితర రంగాలకు భూముల కేటాయింపులను సరళతరం చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. భూ కేటాయింపుల్లో జాప్యాన్ని నివారిస్తే పెట్టుబడులను ఆకర్షించవచ్చని భావిస్తున్న ప్రభుత్వం... నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గత ప్రభుత్వాల హయాంలో వివిధ సంస్థలకు కేటాయించిన భూమిలో అవసరాలకు సరిపోగా, మిగులు భూమిని స్వాధీనం చేసుకోవాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. అంతేగాకుండా కేటాయించిన భూమిలో ఇప్పటికీ పరిశ్రమలు స్థాపించని వారి నుంచి భూములు వెనక్కి తీసుకోవాలని ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే వివిధ సంస్థలకు బదలాయించిన భూములపై జిల్లా యంత్రాంగం ఆరా తీస్తోంది. ఆయా సంస్థలకు కేటాయించిన భూములపై క్షేత్రస్థాయిలో సర్వే చేస్తోంది. ఒకవైపు యూఎల్సీ, సీలింగ్ భూములపై సర్వే చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం... మరోవైపు ఈ ప్రక్రియను కూడా చకచకా పూర్తిచేస్తోంది. తద్వారా కొత్తగా వచ్చేవారికి భూములను వెంటవెంటనే కేటాయిస్తే పరిశ్రమల స్థాపన త్వరితగతిన జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పరిశ్రమలు తరలకుండా... పన్ను మినహాయింపు, రాయితీలతో పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ తన్నుకుపోయే ఆస్కారం ఉన్న తరుణంలో.. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు పక్క రాష్ట్రానికి తరలిపోకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఇటీవల అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ), ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(ఏపీఐఐసీ), దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(దిల్), రాజీవ్ స్వగృహ తదితర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూముల వినియోగంపై క్షేత్రస్థాయిలో వివరాలను సేకరిస్తున్నారు. భూ సేకరణ చట్టం కఠినతరం చేసినందునభవిష్యత్తులో ప్రైవేటు భూముల సేకరణ కష్టతరమని భావిస్తున్న ప్రభుత్వం... గతంలో సేకరించి ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న భూములపై దృష్టి సారించింది. ఐటీ కంపెనీలు, పరిశ్రమల స్థాపన, ప్రజావసరాల కోసం జిల్లాలో 39,500 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆయా సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టింది. దీంట్లో కేవలం 26,500 ఎకరాలు మాత్రమే వినియోగంలోకి వచ్చింది. మిగతా దాంట్లో 9,824 ఎకరాలను సదరు సంస్థలు అట్టిపెట్టుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం... దీన్ని స్వాధీనం చేసుకునే దిశగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తోంది. బహుళ జాతి సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు తమ కార్యాకలాపాలను స్థాపనకు రంగారెడ్డి జిల్లా అనువుగా ఉన్నందున, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆయా సంస్థలకు బదలాయించిన స్థలాలతోపాటు న్యాయపరమైన చిక్కులు ఉన్న భూములను గుర్తించే పనిలో జిల్లా యంత్రాంగం తలమునకలైంది. ప్రతిష్టాత్మంగా భావిస్తున్న ఐటీఐఆర్ ప్రాజెక్టు జిల్లాలో వస్తున్నందున పలు సాఫ్ట్వేర్ ఆధారిత కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అదే విధంగా ఫార్మారంగంలోనూ పెట్టుబడులు పెట్టడానికి ప్రఖ్యాత సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ, స్పేస్ సిటీ, ఫార్మా హబ్‌గా తెలంగాణను మార్చాలని భావిస్తున్న ప్రభుత్వం... దీనికి జిల్లాను కేంద్రంగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. జిల్లాలో కొన్ని ప్రధాన సంస్థలకు కేటాయించిన భూమి (ఎకరాల్లో) ఏపీఐఐసీ 8,450 హెచ్ఎండీఏ 4,738 దిల్ 4,435 ప్రభుత్వ సంస్థలు 12,031 ప్రైవేటు 2,273 ఆయా సంస్థల ఆధీనంలో ఉన్న భూమి హెచ్ఎండీఏ 2900 దిల్ 3449 ఏపీఐఐసీ 2863 రాజీవ్‌స్వగృహ 612 -
2014లో రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం
కోలారు, న్యూస్‌లైన్ :వచ్చే ఏడాది(2014)లో రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కోలారు తాలూకాలోని నరసాపురం పారిశ్రామిక వాడలో స్కానియా ఇండియా కంపెనీని ఆయన మంగళవారం ప్రారంభించి, ప్రసంగించారు. నూతన పారిశ్రామిక విధానం అమలు వల్ల పరిశ్రమలకు మరిన్ని సౌకర్యాలు, రాయితీలు అందుతాయని అన్నారు. పారిశ్రామిక వేత్తలను ఆకర్షించే ఉద్దేశ్యంతో ఈ విధానానికి తెరలేపనున్నట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇతర దేశాల పారిశ్రామిక వేత్త లు ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు వల్ల రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పారు. తుమకూరులో 12వేల ఎకరాల్లో పారిశ్రామిక మండలిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని, ఇదే విధంగా కోలారు, గుల్బర్గా జిల్లాల్లో కూడా పారిశ్రామిక మండళ్లు ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు. ఆటోమోటివ్ ఉత్పత్తుల్లో దేశంలో కర్ణాటక నాల్గవస్థానంలో ఉందని తెలిపారు. కరువు జిల్లా వాసులను ఆదుకోవాలన్న లక్ష్యంతో కోలారు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపన కోసం భూములను ఇచ్చిన రైతు కుటుంబాలలో ఒకరికి ఆయా ఫ్యాక్టరీల్లో తప్పనిసరిగా ఉద్యోగం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కేహెచ్ మునియప్ప, రాష్ట్ర మంత్రులు రామలింగారెడ్డి, యూటీ ఖాదర్, ఎమ్మెల్యే వర్తూరు ప్రకాష్, ఎమ్మెల్సీ నజీర్ అహమ్మద్, స్కానియా ఇండియా కంపెనీ సీఈఓ మార్టిన్ లూండ్స్టెడ్, ఎండీ అండెర్స్ గ్రూండ్ స్ట్రోమర్, స్వీడన్ రాయబారి హెరాన్డ్ సోన్బర్గ్ పాల్గొన్నారు. విపక్షాల ప్రశ్నలకు తగిన సమాధానమిస్తాం అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలు సంధించే ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇస్తామని సీఎం సిద్ధరామయ్య అన్నారు. స్కానియా ఇండియా కంపెనీ ప్రారంభోత్సవం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సంతోష్ లాడ్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించకుంటే అసెంబ్లీ కార్యకలాపాలను అడ్డుకుంటామన్న బీజేపీ హెచ్చరికపై ఆయన పై విధంగా స్పందించారు. ప్రజా ప్రభుత్వ వ్యవస్థలో అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ బెంగళూరు పర్యటన సందర్భంగా గట్టి భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. వర్తూరు చెరువు నుంచి వృథా అవుతున్న నీటిని నరసాపురం, వేమగల్ పారిశ్రామిక వాడలకు అందించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు చెప్పారు.