సాక్షి, విజయవాడ: ఈ నెల 26న నూతన పారిశ్రామిక విధానాన్ని ఖరారు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన నేతృత్వంలో ఇండస్ట్రియల్ టాస్క్‌ఫోర్స్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో నూతన పారిశ్రామిక పాలసీ పై చర్చించారు. నాలుగు రంగాల్లో ప్రాధాన్యం ఇచ్చేలా పాలసీ రూపొందిస్తామని తెలిపారు. పరిశ్రమలకు 30 రోజుల్లో అనుమతులు ఇచ్చే విధానం తీసుకువస్తామని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమలకు స్థలం, వాటర్, పవర్, స్కిల్ మ్యాన్ పవర్ కూడా అందిస్తామని చెప్పారు. (తాగి వాహనాలు నడపొద్దు: సీఎం జగన్ విజ్ఞప్తి )
అవినీతికి ఆస్కారం లేకుండా..
రాష్ట్రంలో అన్ని వనరులను సమర్థవంతంగా వినియోగిస్తామని తెలిపారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేని పారిశ్రామిక పాలసీ ని తీసుకొస్తున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు, ఉద్యోగాల తో పాటు పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. పర్యావరణానికి హాని చేసే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వొద్దని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారని మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.
(సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం: కార్మికులు)
Comments
Please login to add a commentAdd a comment