సాక్షి, అమరావతి : రాష్ట్రం, జిల్లా వస్తువుల ప్రత్యేకతను చాటేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సరికొత్త ఆలోచనకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఆచరణలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. గురువారం వన్ డిస్ట్రిక్ట్ - వన్ ప్రొడక్ట్ అంశంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని రాష్ట్రాల పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ భౌగోళిక గుర్తింపు ఉన్న ప్రత్యేక వస్తువుల ఎగుమతులు ఏపీలోనే ఎక్కువ. ఏపీలోని అన్ని జిల్లాల్లో ఆర్థిక ప్రగతిని నిర్దేశించే ఉత్పత్తులు అనేకం ఉన్నాయి. (ఐఎస్‌బీ ఒప్పందం చారిత్రాత్మకం : మేకపాటి)
ప్రతి జిల్లాలో ప్రత్యేకతను చాటే చేనేత కళా నైపుణ్యం, హస్తకళలు, వ్యవసాయ, ఉద్యాన, గ్రామీణ ప్రత్యేక కళోత్పత్తులకు ఏపీ నిలయం. గ్రామీణ యువతకు ఉద్యోగాలు, గ్రామీణులను పారిశ్రామికవేత్తలుగా మలచగల సామర్థ్యం ఉన్న వస్తువులకు కొదవ లేదు. నైపుణ్యం, శిక్షణ, మార్కెటింగ్, ఉత్పత్తిలో నాణ్యత, క్యాపిటల్ ఇన్ఫ్యూజన్, ఎగుమతులపై దృష్టి సారించాలి. ఉత్పత్తులను తయారు చేసే కళాకారులను గుర్తించి, అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాల’’న్నారు.
Comments
Please login to add a commentAdd a comment