సాక్షి, అమరావతి : సుప్రీంకోర్టులో తీర్పు రాకముందే నోటిఫికేషన్ ఇచ్చిన నిమ్మగడ్డ టీడీపీకి తొత్తులా వ్యవహరిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వాక్సినేషన్ పూర్తి కాకుండానే ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి ప్రబుత్వ నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని, ఆలయాలపై దాడుల వెనుక చంద్రబాబు పాత్ర ఉందని మంత్రి వెల్లంపల్లి అన్నారు. ఏడాదిలోగా రామతీర్థంలో రాములవారి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామన్నారు. హిందువుల గురించి మాట్లాడే అర్హత పవన్‌కళ్యాణ్‌కు లేదన్నారు. ప్రజలు, అధికారుల ప్రయోజనాలను నిమ్మగడ్డ పక్కన పెట్టారని, చంద్రబాబు కోసమే నిమ్మగడ్డ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్నారు. (అహంకారంతో ఎన్నికల నోటిఫికేషన్)
వ్యాక్సిన్ పూర్తయ్యే వరకూ ఎన్నికలు వాయిదా వేయాలని కోరినా ఎస్‌ఈసీ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. నిమ్మగడ్డ కేవలం చంద్రబాబు డైరెక్షన్‌లోనే పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ పాలన చూసి ఓర్వలేకపోతున్నారని, రాజకీయ ఉనికి కోసం ప్రతిపక్షాలు నీచంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రభుత్వ సూచనలు, ఉద్యోగుల అభ్యర్థనలు తోసిపుచ్చి ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని మంత్రి శంకర్‌నారాయణ అన్నారు. నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం నిరంకుశత్వానికి అద్దం పడుతోందని, వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికల నిర్వహణ సరికాదని మంత్రి అభిప్రాయపడ్డారు. (నిమ్మగడ్డ తీరు.. విమర్శల జోరు)
Comments
Please login to add a commentAdd a comment