
ఘటాల ఊరేగింపులో భక్తులు
అనకాపల్లి: జీవీఎంసీ విలీన గ్రామమైన కొత్తూరు నర్సింగరావుపేటలో మోదకొండమ్మ మహోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 7న అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమైన విషయం విదితమే.
ఇందులో భాగంగా అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం అమ్మవారి ఘటాల ఊరేగింపు ఘనంగా జరిగింది. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ఎంపీపీ గొర్లె సూరిబాబు, కశింకోట జెడ్పీటీసీ శ్రీధర్ రాజు, మళ్ల బుల్లిబాబు, చేబ్రోలు సత్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment