mahotsavam
-
Vemulawada : వేములవాడ ఆలయంలో రాజన్న కల్యాణ మహోత్సవం (ఫొటోలు)
-
ఏలూరులో బైక్ ర్యాలీ తో పాటు మానవహారం
-
‘మహాబోధి’ మహోత్సవానికి భారీగా బౌద్ధ అనుచరుల రాక!
ప్రపంచ పర్యాటక కేంద్రమైన సాంచి(మధ్యప్రదేశ్)లో 71వ మహాబోధి మహోత్సవం ఈరోజు (శనివారం) ప్రారంభమైంది. రెండు రోజుల ఈ ఉత్సవంలో భగవాన్ గౌతమ బుద్ధుని సన్నిహిత శిష్యుల అస్థికలను అనుచరుల దర్శనం కోసం అందుబాటులో ఉంచారు. శనివారం ఉదయం 7 గంటలకు అస్థికల కలశ యాత్రను మహాబోధి సొసైటీ కార్యాలయం నుంచి చెతీస్గిరి వరకూ నిర్వహించారు. అనంతరం అనుచరుల దర్శనార్థం ఆ కలశాన్ని అందుబాటులో ఉంచారు. శ్రీలంక, వియత్నాం, థాయ్‌లాండ్, జపాన్‌తో సహా పలు దేశాల బౌద్ధ అనుచరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శ్రీలంక మహాబోధి సొసైటీ చీఫ్ వంగల్ ఉపాథిస్ నాయక్ థెరో ఈ వేడుకల్లో పాల్గొనేందుకు శ్రీలంక నుంచి సాంచి చేరుకున్నారు. ఊరేగింపు సందర్భంగా సాంచిలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. తెల్లవారుజామున కళాకారులు ఢోలక్, వేణువుల శ్రావ్యమైన రాగాలకు సాంప్రదాయ నృత్యాలు చేస్తూ సాంచి వీధుల్లో నడిచారు. ఈ ఊరేగింపు సాంచి స్థూపం వద్దనున్న చెటియగిరి విహార్‌కు చేరుకుంది. అక్కడ బుద్ధ భగవానుని శిష్యులైన అర్హంత్ సారిపుత్ర, అర్హంత్ మహామొగ్గలన్ల అస్థికలను నేలమాళిగలో నుండి బయటకు తీసి పూజలు నిర్వహించారు. అనంతరం అనుచరుల దర్శనార్థం వాటిని ప్రత్యేక స్థలంలో ఉంచారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు, అనుచరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ‘26/11’ తరువాత కూడా నిర్లక్ష్యం వీడని ముంబై పోలీసులు.. -
వేడుకగా తిరుమలనంబి 1050వ అవతార మహోత్సవాలు
తిరుమల: ప్రముఖ వైష్ణవాచార్యులు తిరుమలనంబి 1050వ అవతార మహోత్సవం గురువారం తిరుమలలోని శ్రీవారి ఆలయ దక్షిణ మాడ వీధిలో ఉన్న శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య చక్రవర్తి రంగనాథ ముఖ్య అతిథిగా హజరై ఉపన్యసించారు. తిరుమల శ్రీవారికి పుష్ప కైంకర్యం, మంత్రపుష్ప కైంకర్యం, వేదపారాయణ కైంకర్యం, ఇతర కైంకర్యాలు చేసి తిరుమల తొలి పౌరుడిగా శ్రీ తిరుమలనంబి నిలిచారని ఆయన పేర్కొన్నారు. శ్రీవారి కైంకర్యాలు చేసేందుకు శ్రీ తిరుమలనంబి 973వ సంవత్సరంలో తిరుమలకు చేరుకున్నారని తెలిపారు. శ్రీ తిరుమలనంబి స్వయాన శ్రీభగవద్ రామానుజులవారికి మేనమామ అని చెప్పారు. తిరుమలనంబి తన జీవితం మొత్తాన్ని స్వామివారి కైంకర్యానికి అంకితం చేసి శ్రీవారి చేత తాత అని పిలిపించుకున్నారని, ఈ కారణంగానే వారికి తాతాచార్య వంశీయులుగా పేరు వచ్చిందని వివరించారు. ఈ సందర్భంగా తిరుమలనంబికి సంబంధించిన విశేష అంశాలతో రచించిన తిరుమలనంబి దివ్యచరితామృతం పుస్తకాన్ని ఆవిష్కరించారు. విజయవాడకు చెందిన పాలకొలను వెంకటరామిరెడ్డి ఈ పుస్తకాన్ని తెలుగులో రచించారు. దీన్ని గిద్దలూరుకు చెందిన గంటా మోహన్ రెడ్డి ఇంగ్లీషులోకి, బెంగళూరుకు చెందిన రంజని కన్నడ భాషలోకి అనువదించారు. -
ఆగస్టులో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకలు
సాక్షి, అమరావతి : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకల్లో భాగంగా ఆగస్టు 9–15 తేదీల మధ్య ‘మేరీ మిట్టి మేరా దేశ్’ నినాదంతో దేశవ్యాప్తంగా 2.50 లక్షల గ్రామ పంచాయతీలు, 7,500 బ్లాకులు, 90 వేల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. అదే నెల 29, 30 తేదీల్లో ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ముగింపు వేడుకల గ్రాండ్ ఫినాలే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. వీటి నిర్వహణ, ఏర్పాట్లపై శనివారం ఆయన రాష్ట్రాల సీఎస్‌లతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలకులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఏపీ తరఫున జవహర్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కీలక అంశాలపై కార్యక్రమాలు.. ఆయా గ్రామాలు, పట్టణాల నుంచి దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమరయోధులు, రక్షణ దళాల విశ్రాంత సిబ్బంది, కేంద్ర ఆర్మ్డ్ రిజర్వు పోలీసు, రాష్ట్ర పోలీసు దళాలకు చెందిన వారికి సంఘీభావాన్ని తెలియజేయాలి. వివిధ తాగునీటి వనరుల వద్ద శిలాఫలకాలను ఏర్పాటుచేయాలి. జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయ గీతాలాపన చేయాలి. ప్రతి పంచాయతీలో వసుధ వందన్ కింద కనీసం 75 మొక్కలను నాటాలి. అలాగే, వీరన్ కా వందన్ కింద స్వాతంత్య్ర సమరయోధులు, అమర వీర సైనిక కుటుంబాలకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించాలి. -
యోగ గొప్పతనం ఏంటో చెప్పిన విశ్వక్ సేన్ శ్రీలీల..
-
స్వర్ణ రథంపై సర్వాంతర్యామి
తిరుమల/మంగళగిరి/సింహాచలం/శ్రీశైలం టెంపుల్/నెల్లిమర్ల: ఇల వైకుంఠం తిరుమలలో సోమవారం వైకుంఠ ఏకాదశి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వర్ణరథంపై సర్వాంతర్యామి అయిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద నామ స్మరణతో సప్తగిరులు పులకించాయి. శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధన అనంతరం వైకుంఠ ఏకాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సామాన్య భక్తులకు సైతం గంట ముందుగానే ఆరు గంటలకే సర్వదర్శనం ప్రారంభించారు. అలంకార ప్రియుడైన శ్రీనివాసుడి సన్నిధిని అరుదైన పుష్పాలు, ఫలాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పుష్పాలను వినియోగించారు. పది టన్నుల పుష్పాలు, లక్ష కట్ ఫ్లవర్స్ అలంకరణకు వాడారు. ఆలయ మహాగోపురానికి పుష్పాలతో ఏర్పాటు చేసిన విష్ణుమూర్తి, శంఖుచక్రాలు.. నామం బోర్డు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మండపం లోపల శ్రీ మహాలక్ష్మి, దశావతారాలతో పాటు శ్రీమహా విష్ణువు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండపాన్ని సందర్శించిన భక్తులు ఆనంద పరవశులవుతున్నారు. ఆలయం వెలుపల విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన స్వామి వారి నిలువెత్తు విగ్రహాలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. నిలువెత్తు బంగారాన్ని ర«థంగా మార్చి దేవేరులతో కలిసి కోనేటిరాయుడు ఆలయ తిరువీధుల్లో ఊరేగడాన్ని చూసిన భక్తులు పరవశించిపోయారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు చేరుకున్న అశేష భక్తవాహిని స్వర్ణర«థ వాహనసేవను తిలకించి స్వామి, అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. మహిళా భక్తులు ఉత్సాహంతో స్వర్ణర«థాన్ని లాగారు. నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనం: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. నిర్ణీత సమయంలో కేటాయించిన టైమ్స్ స్లాట్ టికెట్లకు దర్శనమవుతుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 53,101 మంది స్వామి వారిని దర్శించుకోగా, 23,843 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.48 కోట్లు సమర్పించారు. నేడు చక్రస్నానం వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని తిరుమలలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి మంగళవారం తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 గంటల మధ్య చక్రస్నాన మహోత్సవం ఏకాంతంగా నిర్వహించనున్నారు. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం పలువురు ప్రముఖులు వైకుంఠ ద్వారంలో శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల ఆలయ పెద్ద జీయర్, చిన్న జీయర్ స్వామి, తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.రాజా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేష్ కుమార్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారాం, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నంద, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ టి.రాజశేఖర్‌రావు, జస్టిస్ రవినాథ్ తిలహరి, జస్టిస్ రవీంద్రబాబు, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.శ్రీనివాస్, జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్, కర్ణాటక గవర్నర్ తవార్ చంద్ గెహ్లా, తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్, ఉషశ్రీ చరణ్, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, నేతలు సీఎం రమేష్, విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనృసింహస్వామి వారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా సోమవారం ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సామాన్య భక్తుల క్యూలైన్లో వెళ్లి దర్శించుకున్నారు. విశాఖ జిల్లాలోని సింహాచలం క్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి శ్రీదేవి, భూదేవి సమేతుడై ఆలయ ఉత్తర రాజగోపురంలో వైకుంఠవాసుడిగా శేషతల్పంపై భక్తులకు దర్శనమిచ్చారు. విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, రాష్ట్ర డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్వామిని దర్శించుకున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామి వార్లకు ప్రత్యేక ఉత్సవం, రావణ వాహనసేవ వైభవంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో సోమవారం నిర్వహించిన గిరి ప్రదక్షిణతో నీలాచలం గిరులు పులకించాయి. సీతారామలక్ష్మణుల ఉత్సవ మూర్తుల ఊరేగింపులో సుమారు పదివేల మంది భక్తులు పాల్గొని శ్రీరామనామాన్ని స్మరిస్తూ నీలాచలం చుట్టూ ప్రదక్షిణ చేశారు. -
ఘనంగా రామచంద్రమ్మ జాతర
యలమంచిలి రూరల్: యలమంచిలిలో రామచంద్రమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. అ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భారీ అన్నసమారాధన ఏర్పాటు చేశారు. పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. బాణసంచా కాల్చారు. ఘనంగా యల్లమ్మ తల్లి పండుగ మునగపాక: మండల కేంద్రంలో యల్లమ్మతల్లి అమ్మవారి పండగ ఘనంగా జరిగింది. మావూరి, బూడిద కుటుంబాలకు చెందిన వారంతా రెండేళ్లకొకసారి ఈ పండగ జరుపుకుంటారు. ఈ ఏడాది భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఘనంగా సాయిబాబా సప్తాహం మునగపాక: స్థానిక సాయిబాబా మందిరంలో సప్తాహ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. సాయినామ స్మరణతో మునగపాక మార్మోగింది. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో సాయి కీర్తనలు ఆలపించారు. ఆలయ చైర్మన్ బొడ్డేడ వీరేంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమలం నిర్వహించారు. పూడిమడకలో మహోత్సవాలు ప్రారంభం అచ్యుతాపురం(అనకాపల్లి): పూడిమడక అమ్మవారి మహోత్సవాలు గురువారం మొదలయ్యాయి. జూన్ 2వ తేదీ వరకు గంటాలమ్మతల్లి, దుర్గాలమ్మ తల్లి, సత్తెమ్మతల్లి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్టు స్థానికుడైన పోలవరపు పారునాయుడు తెలిపారు. -
ఘనంగా మోదకొండమ్మ ఉత్సవాలు
అనకాపల్లి: జీవీఎంసీ విలీన గ్రామమైన కొత్తూరు నర్సింగరావుపేటలో మోదకొండమ్మ మహోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 7న అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమైన విషయం విదితమే. ఇందులో భాగంగా అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం అమ్మవారి ఘటాల ఊరేగింపు ఘనంగా జరిగింది. మంత్రి గుడివాడ అమర్నాథ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ఎంపీపీ గొర్లె సూరిబాబు, కశింకోట జెడ్పీటీసీ శ్రీధర్ రాజు, మళ్ల బుల్లిబాబు, చేబ్రోలు సత్య ఉన్నారు. -
శ్రీవారి పుష్పయాగ మహోత్సవం
-
స్వచ్ఛతకు పెద్దపీట: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: కాలుష్యం తగ్గించేందుకు పారిశ్రామిక వేత్తలు కృషి చేయాలని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పిలుపు నిచ్చారు. గాంధీ జయంతి పురస్కరించుకుని విశాఖ స్వచ్ఛ మహోత్సవ్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛ మహోత్సవ్-2020 అవార్డ్ గ్రహీతలకు ఆయన పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షన్- 2021 కరపత్రాలు, సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉండాలని గాంధీజీ పిలుపునిచ్చారని పేర్కొన్నారు. 2014లో రాజ్ ఘాట్ లో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించారని, ప్రజలంతా స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్నారని ఆయన తెలిపారు. ఎయిర్ సీడింగ్ ద్వారా కొండల్లో పచ్చదనం పెంపుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పొల్యూషన్ ఫ్రీ సిటీ గా విశాఖ ను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రతి పథకంలోను మహిళలకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సుందర నగరం విశాఖ:ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలోనే విశాఖపట్నం సుందర నగరమని పేర్కొన్నారు. విశాఖలో మొక్కలు నాటి పచ్చదనం పెంపునకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రెండు హెలికాప్టర్స్ లో సీడ్ బాల్స్ ను కొండల్లో వదలడం ద్వారా మరింతగా పచ్చదనం పెంచవచ్చన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాబోతోందని, మరింతగా అభివృద్ధి జరుగుతుందని ఎంపీ సత్యనారాయణ తెలిపారు. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు: ఎంపీ సత్యవతి అనకాపల్లి ఎంపీ కె.సత్యవతి మాట్లాడుతూ ఏపీకి వలంటీర్ల వ్యవస్థ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని తెలిపారు.ఈ వ్యవస్థను తీసుకొచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా వలంటీర్లకు ఆమె ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మరింత అభివృద్ధి చెందుతుంది: ఎమ్మెల్యే వాసుపల్లి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. 25 లక్షలు మొక్కలు నాటాలి అని సీఎం లక్ష్యం గా పెట్టుకున్నారని పేర్కొన్నారు. 23 శాతం నుంచి 33 శాతం అటవీ ప్రాంతం పెంపునకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు.. విశాఖ కమిషనర్ సృజన మాట్లాడుతూ నగరంలో పచ్చదనం పెంపొందించేందుకు, పర్యావరణ పరిరక్షణకు లక్ష విత్తన బంతులను ప్రజలకు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. చెత్త నుంచి సంపదను సృష్టించుకుంటున్నామని, 50 వేల మందికి చెత్త బుట్టలు అందించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. సీఎం జగన్ విజ్ఞప్తి మేరకు నేడు సాయంత్రం 7 గంటలకు వలంటీర్లు, కార్యదర్శులను చప్పట్లతో అభినందించాలని ఆమె కోరారు. మంచి కోసం జరిగే మార్పులో వీరి పాత్ర చాలా కీలకమైందని ఆమె పేర్కొన్నారు. -
వైభవంగా తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం
-
నాథ్ యోగి.. నాదే!
లక్నో : బాలీవుడ్ ప్రముఖ సింగర్ కైలాష్ ఖేర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గోరఖ్‌పూర్ మహోత్సవ్ కోసం నిర్వాహకులు ఓ ప్రత్యేక ఆల్బమ్‌ను రూపకల్పన చేశారు. అయితే వారు తన పాటను కాపీ కొట్టారంటూ కైలాష్ ఆరోపిస్తున్నారు. గత ఫిబ్రవరిలో ఇసా యోగా సెంటర్లో నిర్వహించిన మహాశివ రాత్రి ఉత్సవాల కోసం గేయ రచయిత ప్రసూన్ జోషి ఓ పాటను రాశారు. దానిని కైలాష్ ఆలపించారు. ఇక ఇప్పుడు గోరఖ్‌పూర్ లో మూడు రోజుల పాటు నిర్వహించే మహోత్సవం కోసం విమల్ బర్వా ఓ పాట రాయగా.. ప్రణయ్ సింగ్ దానిని పాడాడు. నాథ్ యోగి పేరిట ఆ పాట జనాల్లోకి బాగా దూసుకుపోతోంది. పాటను విన్న కైలాష్ అనుచరులు అది కాపీ అన్న విషయాన్ని అతని దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కైలాష్ ఇది కాపీ రైట్ ఉల్లంఘన కిందకే వస్తుందని చెబుతున్నారు. ‘‘ విదేశాల్లో కాపీ హక్కుల ఉల్లంఘన తీవ్ర నేరం. కానీ, మన దగ్గర మాత్రం ప్రజలు ఆ అంశాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. అందుకు కారణం చట్టంపై అవగాహలేమినే. ఈ విషయంలో గోరఖ్‌పూర్ మహోత్సవ నిర్వాహకులతో న్యాయపోరాటానికి నేను సిద్ధం’’ అని కైలాష్ ప్రకటించారు. బహుశా ఈ విషయం ముఖ్యమంత్రికి తెలీకపోయి ఉండొచ్చని.. మంచి పరిపాలకుడిగా పేరున్న యోగి ఈ విషయంలో చర్యలు తీసుకుంటారని భావిస్తున్నానని.. అవసరమైతే తానే స్వయంగా సీఎంను కలిసి ఘటనపై వివరిస్తానని కైలాష్ అంటున్నారు. -
వైభవంగా కార్తిక దీపారాధన మహోత్సవం
ద్రాక్షారామ(రామచంద్రపురం రూరల్) : ఆధ్యాత్మిక క్షేత్రం ద్రాక్షారామలో శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం వద్ద ప్రసన్నాంజనేయ బాల భక్త సమాజం ఆధ్వర్యంలో 53వ కార్తీక దీపారాధన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ప్రసన్నాంజేయ బాలభక్త సమాజం అధ్యక్షుడు నున్న రామచంద్రరావులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం సప్తగోదావరిలో స్వామివారి తెప్పోత్సవం కన్నుల పండుగా సాగింది. విజయవాడకు చెందిన శుభమ్ ఈవెంట్స్ సౌండ్స్ ఆధ్వర్యంలో రోష¯ŒSలాల్ ఆర్కెస్ట్రా, సినీ సింగర్ మనో (నాగూర్‌బాబు) నేతృత్వంలో సినీ సింగర్స్ సింహ, దీపు, దామినిలచే సినీ సంగీత విభావరి, టీవీ యాంకర్ మృదుల యాంకరింగ్ ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ద్రాక్షారామకు చెందిన శ్రీ ఆంజనేయ ఫైర్ వర్క్స్ అధినేత పెద్దిరెడ్డి సూరిబాబు బాణాసంచా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. శ్రీ రామాంజనేయ యు ద్దం వార్ సీను, చింతామణి నాటకాలు ప్రేక్షకులను అలరించాయి.