వైభవంగా కార్తిక దీపారాధన మహోత్సవం
Published Tue, Nov 29 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
ద్రాక్షారామ(రామచంద్రపురం రూరల్) :
ఆధ్యాత్మిక క్షేత్రం ద్రాక్షారామలో శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం వద్ద ప్రసన్నాంజనేయ బాల భక్త సమాజం ఆధ్వర్యంలో 53వ కార్తీక దీపారాధన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ప్రసన్నాంజేయ బాలభక్త సమాజం అధ్యక్షుడు నున్న రామచంద్రరావులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం సప్తగోదావరిలో స్వామివారి తెప్పోత్సవం కన్నుల పండుగా సాగింది. విజయవాడకు చెందిన శుభమ్ ఈవెంట్స్ సౌండ్స్ ఆధ్వర్యంలో రోష¯ŒSలాల్ ఆర్కెస్ట్రా, సినీ సింగర్ మనో (నాగూర్‌బాబు) నేతృత్వంలో సినీ సింగర్స్ సింహ, దీపు, దామినిలచే సినీ సంగీత విభావరి, టీవీ యాంకర్ మృదుల యాంకరింగ్ ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ద్రాక్షారామకు చెందిన శ్రీ ఆంజనేయ ఫైర్ వర్క్స్ అధినేత పెద్దిరెడ్డి సూరిబాబు బాణాసంచా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. శ్రీ రామాంజనేయ యు ద్దం వార్ సీను, చింతామణి నాటకాలు ప్రేక్షకులను అలరించాయి.
Advertisement
Advertisement