మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం | NAADU-NEDU to Construction of Medical Colleges including Nursing College | Sakshi
Sakshi News home page

మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం

Published Mon, Aug 24 2020 7:06 PM | Last Updated on Mon, Aug 24 2020 8:14 PM

 NAADU-NEDU to Construction of Medical Colleges including Nursing College - Sakshi

సాక్షి, విజయవాడ:  రాష్ట్రంలో నాడు-నేడు పథకం కింద నూతన మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీల నిర్మాణ బాధ్యతలు కన్సల్టెంట్స్‌కి అప్పగించేందుకు.. డీఎంఈకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా అన్ని సదుపాయలతో ప్రభుత్వ కాలేజీలు, ఆసుపత్రులు నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఐపీహెఎస్‌, ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా మెడికల్‌ కాలేజీల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. తక్కువ సమయం ఉండటంతో కాలేజీల నిర్మాణాలను అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ఈ బాధ్యతలను కన్సల్టెంట్స్‌కి అప్పగించేందుకు డీఎంఈకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తదనుగుణంగా టెండర్లను ఆహ్వానించి ఒక్కో కన్సల్టెంట్స్‌కి ఒక్కో ప్రాజెక్టును అప్పగించినట్టు డీఎంఈ తెలిపింది. నిబంధనలకు లోబడి ఈ ప్రక్రియను పూర్తి చేసినట్టు వెల్లడించింది.

చదవండి: ఏపీలో కొత్తగా 8601 పాజిటివ్‌ కేసులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement