
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ద్రోహం చేయాలనుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదు అంటూ వ్యాఖ్యలు చేశారు.
కాగా, నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌కు ద్రోహం చేసిన వాళ్లు మనుగడ సాగించలేరు. సీఎం వైఎస్ జగన్ భిక్షతో గెలిచిన వారు ఎవరైనా ద్రోహం చేయాలనుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదు. వైఎస్ జగన్ ఫొటో లేకుండా మీరు గెలిచారా?. చంద్రబాబు ఉచ్చులో పడితే మీ రాజకీయ భవిష్యత్తు శూన్యం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment