k.narayana swamy
-
వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు: నారాయణ స్వామి షాకింగ్ కామెంట్స్
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ద్రోహం చేయాలనుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదు అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌కు ద్రోహం చేసిన వాళ్లు మనుగడ సాగించలేరు. సీఎం వైఎస్ జగన్ భిక్షతో గెలిచిన వారు ఎవరైనా ద్రోహం చేయాలనుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదు. వైఎస్ జగన్ ఫొటో లేకుండా మీరు గెలిచారా?. చంద్రబాబు ఉచ్చులో పడితే మీ రాజకీయ భవిష్యత్తు శూన్యం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
కత్తెరపల్లెకు రుణపడి ఉంటా
కార్వేటినగరం : తనను గెలిపించి ఎమ్మెల్యేగా చూడాలని 1977 నుంచి ప్రాణాలను లెక్కచేయక పోరాడిన కత్తెరపల్లె గ్రామస్తులకు రుణపడి ఉంటానని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కె.నారాయణస్వామి అన్నారు. గురువారం కత్తెరపల్లెలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ గ్రామంలో తన గెలుపుకోసం ప్రాణాలను సైతం లెక్కచేయక కాళ్లు, చేతులు, కళ్లు పోగొట్టుకుని వికలాంగులుగా ఉన్న వారి సమస్యలను తీర్చలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సమితి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు చేసిన చిన్నచిన్న పనులను గ్రామస్తులు గుర్తుంచుకుని ఇప్పటికీ తనపై అభిమానాన్ని చాటుకుంటున్నారని తెలిపారు. తన గెలుపునకు కృషిచేసిన వారి రుణం తీర్చుకుంటానని, నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కృషిచేస్తానని చెప్పారు. కత్తెరపల్లె గ్రామానికి మేలు జరిగేంతవరకు సన్మానాలకు స్వస్తి పలకాలని సూచించారు. అనంతరం పింఛన్లు రాలేదంటూ వృద్ధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందిస్తూ జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామిఇచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. నాయకులు హేమసుందర్‌రెడ్డి,వెంకటప్రక్య(యూఎస్ఏ), చిరంజీవిరెడ్డి.మాజీ సర్పంచ్ మురగయ్య,శోభన్‌బాబు.అర్జునయ్య,కుప్పయ్య.రామచంద్రన్ పాల్గొన్నారు. -
పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోం
కార్వేటినగరం: అనర్హులైన పింఛన్‌దారుల ఏరివేత కార్యక్రమంలో అర్హులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మె ల్యే కే.నారాయణస్వామి స్పష్టం చేశారు. సోమవారం కార్వేటినగరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో గతంలో వస్తున్న పింఛన్లలో సగానికి పైగా కోతలు విధించినట్లు చెప్పారు. సర్వేల పేరుతో పేదలకు టోకరా పెడుతున్నారని ఆరోపించా రు. అధికారులు టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తూ అర్హులకు మొండిచేయి చూపుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిపించేందుకు ప్రభుత్వం జన్మభూమిని ఒక సాధనంగా వాడుకుంటోం దని అన్నారు. ఒకే ఇంట్లో అర్హులు ఎంతమంది ఉన్నా పింఛన్లు ఇవ్వాలని కోరారు. పేదలకు అన్యాయం జరిగినట్లు తెలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని వివరిం చారు. భూ సమస్యలపైనా పేదల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, రెవెన్యూ అధికారులు వాటిని పరిష్కరించాలని కోరారు. రుణమాఫీ కోసం ఎదురుచూసిన రైతులు, డ్వాక్రా మహిళలు ప్రభుత్వ తీరుతో తీవ్ర నిరాశకు గురయ్యారని తెలిపారు. వెంటనే రుణమాఫీ అమలు చేయకపోతే ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. -
కలెక్టర్‌గారూ ఇంతకీ మీ బాధ్యతలు ఏంటి
శ్రీరంగరాజపురం: జిల్లా కలెక్టర్ ఆయన బాధ్యతలను పక్కవారిపై నెడుతూ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని జీడీనెల్లూరు ఎమ్మెల్యే కె.నారాయణస్వామి అన్నారు. మంగళవారం ఉదయం మండలంలోని నెళవాయిలో కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ నలభై సంవత్సరాలుగా ఇలాంటి కలెక్టర్‌ను చూడలేదన్నారు. మండలంలోని కటికపల్లె పంచాయతీలో పేదలు, దళితుల భూములకు సంబంధించిన పట్టాలు మారిపోయాయని, కొందరి భూములు పెద్దల ఆధీనంలో ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళితే తన పరిధిలోకి రాదని, జేసీని కలవాలని సూచించినట్లు తెలిపారు. తాగునీటి సమస్యను జెడ్పీ సీఈవో దృష్టికి తీసుకెళ్లాలని, క్వారీల సమస్య గురించి అడిగితే మైన్స్ విభాగం దృష్టికి తీసుకెళ్లమని కలెక్టర్ చెబుతున్నారని తెలిపారు. గ్రీవెన్స్ సెల్లో వచ్చిన అర్జీలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతున్నాయూ అనే విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. అలాంటప్పుడు ఆధికారులతో సమీక్షలు మాత్రం ఎందుకని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అందరికీ న్యాయం చేకూరేలా చూడాలని చెప్పారు. వైఎస్సార్ పాలనలో అధికారులు ఇంటింటికీ వెళ్లి ఇందిరమ్మ గృహాలు, పింఛన్లకు అర్హులను ఎంపిక చేశారని, చంద్రబాబు పాలనలో పార్టీ కార్యకర్తలు పింఛన్లకు అర్హులను ఎంపిక చేయడం ఎంతవరకు సమంజసమని నారాయణస్వామి ప్రశ్నించారు. టీడీపీలో చిన్న కార్యకర్తలు చెప్పినా అధికారులు పనులు చేస్తున్నారని, ప్రతిపక్షంలో ప్రజాప్రతినిధులకు ఎందుకు పనులు చేయడం లేదని, ఇదేనా ప్రజాస్వామ్యమని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్ అనంతరెడ్డి, ఎంపీపీ మోహన్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు విజయకుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రమణప్రసాద్‌రెడ్డి ఉన్నారు. -
జననేతకు జేజేలు
సాక్షి, చిత్తూరు: జీడీ నెల్లూరు మండలంలోని తిరువీధికుప్పం నుంచి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి శుక్రవారం నాటి పర్యటన ప్రారంభమైంది. గ్రామంలో తన కోసం వేచి ఉన్న ప్రజలను ప్రతి ఒక్కరినీ ఆయన పలకరించారు. మహదేవ మంగళం వరకు రోడ్ షో నిర్వహించారు. అక్కడ వేచి ఉన్న మహిళలతో ముచ్చటించారు. మంగినాయని కుప్పంలోనూ గ్రామస్తులతో ముచ్చటించారు. ఇక్కడ ఎం.వెన్నెల అనే 8వ తరగతి విద్యార్థిని లీడర్ అంటే వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అని, అసలు సిసలు నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ వై.ఎస్.జగన్‌లో ఉన్నాయంటూ స్వీయరచన చేసిన పుస్తకాన్ని జననేతకు బహూకరించింది. ఈ విద్యార్థినిని జగన్ అభినందించారు. పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆ విద్యార్థినితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అక్కడ నుంచి జగన్ శ్రీనివాసపురం బీసీ కాలనీ చేరుకుని రోడ్‌షో నిర్వహించారు. ఇక్కడ ప్రజలు తమకు ఇళ్లు లేవని, దారి సమస్య ఉందని తెలిపారు. ప్రభుత్వం వచ్చాక అన్ని సమస్యలూ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మహానేత విగ్రహావిష్కరణ ముసలయ్యగారిపల్లెలో మహానేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహం, పార్టీ జెండాను జగన్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మీ అందరి హృదయాల్లో వైఎస్ఆర్ బతికే ఉన్నారన్నారు. గురువారం జరగాల్సిన కార్యక్రమం బాగా ఆలస్యమైనా చికాకు పడకుండా శుక్రవారం ఉదయాన్నే గ్రామం మొత్తం మహానేత విగ్రహావిష్కరణకు రావడం సంతోషం కలిగిస్తోందన్నారు. ఒక రోజు కార్యక్రమం ఆలస్యమైనందుకు పేరుపేరునా క్షమించాలని అన్నప్పుడు జనం పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో స్పందిం చారు. జగన్‌కు గ్రామస్తులు డప్పులు, మేళతాళాలు, వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. ఇక్కడ వేపంజేరి సర్పంచ్ వరదరాజులు రెడ్డి జగన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ములసయ్యగారిపల్లెలోజగన్ను చూసేం దుకు జనం చెట్లపై, ఫ్లెక్సీ బోర్డులపై ఎక్కారు. ఈ సభలో చిత్తూరు జిల్లా ఉపాధ్యాయ సంఘం నాయకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ జగన్ రాబోయే 30 సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా పని చేస్తారన్నారు. అనంతరం జగన్ అర్ధగంట సేపు మహిళలను, వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. అక్కడ నుంచి అరిమాకులపల్లె వెళుతూ దారిలో రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం (వైఎస్ఆర్టీయూసీ అనుబంధం) 2014 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర కన్వీనర్ జనకప్రసాద్, జిల్లా కన్వీనర్ బీరేంద్రవర్మ, విద్యుత్ సంఘం నాయకులు పాల్గొన్నారు. తొప్పనపల్లెలోనూ జననేత కాన్వాయ్ దిగి జనం వద్దకు వెళ్లారు. వారు చెప్పేది ఓపిగ్గా విని మాట్లాడారు. దాసరపల్లెలోనూ మహిళలు ఘనస్వాగతం పలికారు. కండ్రిగలో రోడ్డుపై పూలుపరిచి గ్రామస్తులు ఆహ్వానించారు. ఆవులకొండలోని ముస్లింకాలనీలో ముస్లింలు, గ్రామస్తులు జగన్ చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరింపజేశారు. తూంగుం డ్రంలో భారీగా బాణసంచా కాలుస్తూ తమ అభిమాన నాయకుడికి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. జగన్ రాక కోసం ఎదురుచూస్తున్న చిన్నారులు, వృద్ధులు, మహిళలు, యువకులతో గ్రామంలోని రోడ్లన్నీ నిండిపోయాయి. మిద్దెలపై నుంచీ మహిళలు జగన్‌ను ఆసక్తిగా చూస్తూ కనిపించారు. వీరందరికీ చిరునవ్వుతో అభివాదం చేస్తూ ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ జనంతో కలిసి అడుగేస్తూ నెమ్మదిగా కదిలారు. తూంగుండ్రం దాటేం దుకు గంటకుపైగా సమయం పట్టింది. జగన్ కలిసేందుకు పాఠశాలల పిల్లలూ క్యూలో వేచి ఉండడం కనిపించింది. తూంగుండ్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గుణశేఖర్ ఇంటికి జగన్మోహన్రెడ్డి వెళ్లారు. వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. పాళ్యం, కొత్తూరులో రోడ్‌షో నిర్వహించారు. ఇక్కడ రుక్మిణి అనే వికలాంగురాలు జగన్‌ను కలిసి దెబ్బతిన్న కాలును చూపించి సాయం చేయాలని కోరారు. ఈమెకు సా యం చేయాల్సిందిగా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కె.నారాయణస్వామికి సూచించారు. జీడీ నెల్లూరు మండలం చివరి గ్రామం పిళ్లారి కుప్పంలోనూ జగన్‌కు జనం బ్రహ్మరథం పలికారు. కావేరి రాజపురంలోనూ ప్రజలు కాన్వాయ్‌ను ఆపి జగన్‌ను కలుసుకున్నారు.