
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 84,502 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 14,429 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 20,746 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 14 లక్షల 66 వేల 990 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,90,09,047 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,80,362 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు.. శ్రీకాకుళం- 897, విజయనగరం- 535, విశాఖ- 1145 , తూ.గో- 2022, ప.గో- 991, కృష్ణా- 1092, గుంటూరు- 798 , ప్రకాశం- 924, నెల్లూరు- 930, చిత్తూరు- 2291, అనంతపురం- 1192, కర్నూలు- 1034, వైఎస్ఆర్ జిల్లా- 578 కేసులు నమోదయ్యాయి.
చదవండి: ఆరోగ్యశ్రీలో ఉచితం.. మిగిలిన వారికి ప్రభుత్వ ధరలే
Comments
Please login to add a commentAdd a comment