
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 83,461 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 7,943 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 98 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 10,930కు చేరింది. గడిచిన 24 గంటల్లో 19,845 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 15 లక్షల 28 వేల 360 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 1,92,56,304 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 1,53,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,92,56,304 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు.. శ్రీకాకుళం- 231, విజయనగరం- 271, విశాఖ- 551, తూ.గో- 1877, ప.గో- 461, కృష్ణా- 291, గుంటూరు- 765, ప్రకాశం- 345, నెల్లూరు- 378, చిత్తూరు- 1283, అనంతపురం- 544, కర్నూలు- 499, వైఎస్ఆర్ జిల్లా- 447 కేసులు నమోదయ్యాయి.
చదవండి: ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Comments
Please login to add a commentAdd a comment