రేపు, ఎల్లుండి గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు | Next 2 Days Heavy Rainfall Due To Low pressure In Godavari Districts | Sakshi
Sakshi News home page

రేపు, ఎల్లుండి గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు

Published Wed, Aug 19 2020 7:25 PM | Last Updated on Wed, Aug 19 2020 8:24 PM

Next 2 Days Heavy Rainfall Due To Low pressure In Godavari Districts - Sakshi

సాక్షి, విజయవాడ : వాయువ్య బంగాళాఖాతం అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు, రేపు ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. గోదావరికి వరద ఉధృతి ఉన్నందున జిల్లా అధికారులను అప్రమత్తం చేశామని కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంత, లంక గ్రామల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే మూడు రోజుల వాతావరణ వివరాలను కమిషనర్ కన్నబాబు వెల్లడించారు.

►ఆగష్టు 19వ తేదిన:  తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తారు నుంచి  భారీ వర్షాలు పడే అవకాశం.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ,  కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం. 
రాయలసీమ, నెల్లూరు చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం 

►ఆగష్టు 20వ తేదిన:  తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో మోస్తారు నుంచి  భారీ వర్షాలు పడే అవకాశం.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ,  కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం.
రాయలసీమ, నెల్లూరు చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం. 

►ఆగష్టు 21వ తేదిన:  తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో  తేలికపాటి  నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం. 
రాష్ట్రంలో మిగిలిన చోట్ల చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement