అక్టోబర్ 2 నుంచి 'మనం-మన పరిశుభ్రత' రెండో దశ.. | Peddireddy: Manam Mana Parisubratha Program From October 2 | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 2 నుంచి 'మనం-మన పరిశుభ్రత' రెండో దశ..

Published Wed, Sep 23 2020 4:13 PM | Last Updated on Wed, Sep 23 2020 8:40 PM

Peddireddy: Manam Mana Parisubratha Program From October 2 - Sakshi

సాక్షి, అమరావతి : అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో 'మనం-మన పరిశుభ్రత' రెండోదశ కార్యక్రమం ప్రారంభించబోతున్నట్లు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి మండలానికి 5 నుంచి 10 గ్రామాలలో అమలవుతందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులకు మంత్రి బుధవారం లేఖ రాశారు. జూన్ 1న మొదటిదశ మనం-మన పరిశుభ్రత ప్రోగ్రాం రాష్ట్రంలో ప్రారంభమైందని, జూలై 24 నుంచి 15 రోజుల పాటు పక్షోత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా 1320 గ్రామ పంచాయతీల్లో తొలి దశ కార్యక్రమాలు జరిపినట్లు వెల్లడించారు. (‘పంటల బీమాపై రైతులదే తుది నిర్ణయం’)

కోవిడ్-19 సమయంలో ఈ పక్షోత్సవాలు గ్రామాల్లో సత్ఫలితాలు ఇచ్చాయని మంత్రి తెలిపారు. ప్రజా భాగస్వామ్యంతో పల్లెల్లో ఆరోగ్యకర వాతావరణం నెలకొంటుందని, 70 శాతం సీజనల్ వ్యాధుల వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు. ప్రజల నుంచి పంచాయతీలకు విరాళాలుగా రూ.1.72 కోట్లు జమ అయినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున రెండోదశ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. (పలు అనుమతులు, సర్టిఫికేట్ల వ్యాలిడిటీ పొడిగింపు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement