Gulab Cyclone: PM Narendra Modi Phone Call to AP CM YS Jagan, Over Gulab Cyclone - Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్ జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్

Published Sun, Sep 26 2021 4:05 PM | Last Updated on Sun, Sep 26 2021 4:52 PM

PM Narendra Modi Phone Call to AP CM YS Jagan, Over Gulab Cyclone - Sakshi

సాక్షి, అమరావతి: గులాబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రధాని నరేంద్రమోదీ ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అందరూ సురక్షితంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు.   చదవండి: (అప్రమత్తంగా ఉండండి: సీఎం జగన్‌)

కాగా, ఆదివారం అర్థరాత్రి  గోపాల్‌పూర్‌-కళింగపట్నం మధ్య గులాబ్‌ తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో తీర ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో ఈదురుగాలు వీయనున్నాయి. ఉత్తరాంధ్ర, ఒడిశాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు భారీ సూచనలు ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement