
పెళ్లికుమార్తెకు నెక్లెస్ అందజేస్తున్న ఎస్‌ఐ శ్రీహర్ష
సాక్షి, బత్తలపల్లి (అనంతపురం): వివాహ వేడుకలో వధువు మెడలోని నెక్లెస్‌ను పోగొట్టుకుంది. సకాలంలో పోలీసులు స్పందించి నెక్లెస్ స్వాధీనం చేసుకుని అప్పగించారు. వివరాలు.. ధర్మవరం రూరల్ మండలం కుణుతూరుకు చెందిన మీనాక్షి, నారాయణస్వామి దంపతుల కుమార్తె లక్ష్మీ ప్రసన్నకు... ముదిగుబ్బ మండలం ఉప్పలపాడుకు చెందిన అనంతమ్మ, వెంకట్రాముడు దంపతుల కుమారుడు తిమ్మరాజుతో శనివారం బత్తలపల్లి మండలం సంగమేశ్వర క్షేత్రంలో వివాహం జరిగింది.
పెళ్లితంతు పూర్తి అయిన తర్వాత తన మెడలోని సుమారు 2 తులాల బంగారు నెక్లెస్ కనిపించడం లేదని కుటుంబసభ్యులకు పెళ్లి కుమార్తె తెలిపింది. బంధువులు వెదికినా ఫలితం దక్కలేదు. దీంతో సమాచారం అందుకున్న బత్తలపల్లి ఎస్‌ఐ టీవీ శ్రీహర్ష వెంటనే అక్కడకు చేరుకుని సోదాలు ప్రారంభించారు. ఇంతలో ఒకరు వచ్చి తమకు నెక్లెస్ దొరికిందంటూ అప్పగించడంతో వివరాలు తెలుసుకుని నెక్లెస్‌ను పెళ్లికుమార్తెకు అప్పగించి, నూతన జంటను ఆశీర్వదించారు.
చదవండి: (సామాజిక మాధ్యమాల్లో భార్య నగ్న దృశ్యాలు.. విటులకు ఆహ్వానం..)
Comments
Please login to add a commentAdd a comment