necklace missing case
-
పెళ్లిలో వధువు నెక్లెస్ మాయం.. కాసేపటికే..
సాక్షి, బత్తలపల్లి (అనంతపురం): వివాహ వేడుకలో వధువు మెడలోని నెక్లెస్ను పోగొట్టుకుంది. సకాలంలో పోలీసులు స్పందించి నెక్లెస్ స్వాధీనం చేసుకుని అప్పగించారు. వివరాలు.. ధర్మవరం రూరల్ మండలం కుణుతూరుకు చెందిన మీనాక్షి, నారాయణస్వామి దంపతుల కుమార్తె లక్ష్మీ ప్రసన్నకు... ముదిగుబ్బ మండలం ఉప్పలపాడుకు చెందిన అనంతమ్మ, వెంకట్రాముడు దంపతుల కుమారుడు తిమ్మరాజుతో శనివారం బత్తలపల్లి మండలం సంగమేశ్వర క్షేత్రంలో వివాహం జరిగింది. పెళ్లితంతు పూర్తి అయిన తర్వాత తన మెడలోని సుమారు 2 తులాల బంగారు నెక్లెస్ కనిపించడం లేదని కుటుంబసభ్యులకు పెళ్లి కుమార్తె తెలిపింది. బంధువులు వెదికినా ఫలితం దక్కలేదు. దీంతో సమాచారం అందుకున్న బత్తలపల్లి ఎస్ఐ టీవీ శ్రీహర్ష వెంటనే అక్కడకు చేరుకుని సోదాలు ప్రారంభించారు. ఇంతలో ఒకరు వచ్చి తమకు నెక్లెస్ దొరికిందంటూ అప్పగించడంతో వివరాలు తెలుసుకుని నెక్లెస్ను పెళ్లికుమార్తెకు అప్పగించి, నూతన జంటను ఆశీర్వదించారు. చదవండి: (సామాజిక మాధ్యమాల్లో భార్య నగ్న దృశ్యాలు.. విటులకు ఆహ్వానం..) -
అమ్మవారి గర్భగుడిలో లక్ష్మీహారం ప్రత్యక్షం
చిత్తూరు జిల్లా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల క్రితం మాయమైన లక్ష్మీ హారం శుక్రవారం ఆలయ గర్భగుడిలో లభ్యమైంది. దాంతో అటు ఆలయ అధికారులు ఇటు అర్చకులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే లక్ష్మీ హారం లభ్యం కావడంపై ఆలయ అర్చకులు భిన్న కథనాలు వెల్లడిస్తుండటంతో పలు అనుమానాలకు తావిస్తుంది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించే లక్ష్మీహారం మంగళవారం మాయమైంది. ఆ విషయాన్ని గ్రహించిన అర్చకులు గోప్యంగా ఆలయ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రూ.10 లక్షల విలువైన ఆమ్మవారి హారం కనిపించకపోవడంతో ఆలయ ఉన్నతాధికారులు అగమేఘాలపై స్పందించారు. ఆలయ సిబ్బంది చేత అంతటా వెతికించారు. అయిన హారం జాడ తెలియలేదు. ఇంతలో అమ్మవారి హారం మాయమైన విషయం మీడియాకు పొక్కింది. దీంతో మీడియా లక్ష్మీ హారం అదృశ్యంపై పలు కథనాలు వెలువరించింది... శుక్రవారం ఉదయం అమ్మవారి ఆలయం గర్బగుడిలో లక్ష్మీ హారం ప్రత్యక్షమైంది. లక్ష్మీ హారం అదృశ్యంపై ఉన్నతాధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అయితే గర్బగుడిలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడం కొసమెరుపు.