రాట్నాలమ్మ ఆశీస్సులతోనే.. | PV Sindhu Ratnalakunta Lord Ratnalamma Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రాట్నాలమ్మ ఆశీస్సులతోనే..

Published Mon, Aug 2 2021 3:49 AM | Last Updated on Mon, Aug 2 2021 3:49 AM

PV Sindhu Ratnalakunta Lord Ratnalamma Andhra Pradesh - Sakshi

మార్చి 25న రాట్నాలమ్మకు పూజలు చేస్తున్న సింధు, ఆమె తండ్రి రమణ(ఫైల్‌)

పెదవేగి (దెందులూరు): పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలోని రాట్నాలమ్మ ఆశీస్సులతోనే తాను ఈ విజయం సాధించినట్టు పీవీ సింధు చెప్పారు. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో చైనా క్రీడాకారిణిపై సింధు విజయం సాధించిన నేపథ్యంలో ఆమె తండ్రి పీవీ రమణను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా.. ఈ విజయంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

అనంతరం పీవీ సింధును అదే ఫోన్‌ కాల్‌లో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడించారు. ఈ సందర్భంగా సింధు తన విజయంపై పట్టరాని ఆనందాన్ని వ్యక్తం చేశారు. పెదవేగి మండలం రాట్నాలకుంట అమ్మవారి కృపతోనే తాను విజయం సాధించినట్టు చెప్పారు. సింధు భారత్‌కు వచ్చాక రాట్నాలకుంటకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటామని రమణ వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 25న సింధు తన తండ్రితో కలిసి రాట్నాలమ్మను దర్శించుకున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement