PV Ramana
-
ఆటలకు ఆస్తులతో పనేంటి?
న్యూఢిల్లీ: క్రీడల్లో తమ పిల్లలను ప్రోత్సహించే ముందు మధ్య తరగతి వర్గాల వారు తీవ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని... ఆర్థికపరంగా మంచి స్థాయిలో ఉన్నవారి పిల్లలే ఆటల వైపు రావాలంటూ భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు గోపీచంద్ మాటలతో ఏకీభవిస్తుండగా, మరికొందరు వాటిని తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ వాలీబాల్ క్రీడాకారుడు, స్టార్ షట్లర్ పీవీ సింధు తండ్రి పీవీ రమణ దీనిపై స్పందించారు. ఆటగాడిగా ఎదిగేందుకు ధనవంతులు కావడం ముఖ్యం కాదని... ప్రతిభ ఉంటే దూసుకుపోవచ్చని అభిప్రాయపడ్డారు. తానూ దిగువ స్థాయి నుంచే వచ్చి ఆటగాడిగా ఎదిగానని... సింధును క్రీడల వైపు మళ్లించినప్పుడు కూడా తన వద్ద పెద్దగా డబ్బేమీ లేదని ఆయన స్వీయానుభవాన్ని పంచుకున్నారు. ‘నాకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. 10 మంది సంతానంలో నేను అందరికంటే చిన్నవాడిని. కానీ అన్నలు, అక్కలు నాకు ఎంతో అండగా నిలిచి జాతీయ స్థాయిలో వాలీబాల్ ఆడేందుకు సహకరించారు. ఆట కారణంగానే నాకు రైల్వేస్‌లో ఉద్యోగం వచ్చింది. మీరు దిగువ మధ్య తరగతి లేదా మధ్య తరగతికి చెందినా... ఆటల్లో మంచి ప్రదర్శన కనబరిస్తే ఎన్నో అవకాశాలు వస్తాయి. చిన్నారులు అన్ని రకాలుగా ఎదిగేందుకు కూడా క్రీడలు ఉపయోగపడతాయి’ అని రమణ వివరించారు. 1986 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో రమణ సభ్యుడిగా ఉన్నారు. తన పెద్ద కూతురు చదువులో చురుగ్గా ఉందని ఆమెను డాక్టర్ అయ్యేలా ప్రోత్సహించానని, సింధుకు బ్యాడ్మింటన్‌లో ఎంతో ప్రతిభ ఉందనే విషయం ఆరంభంలో గుర్తించామని ఆయన అన్నారు. ‘ప్రతిభ ఎక్కడో ఒక చోట వెలుగులోకి వస్తుంది. దానిని ఎవరూ దాచి ఉంచలేరు. తల్లిదండ్రులు తగిన రీతిలో మార్గనిర్దేశనం చేయాలి. ఒక క్రీడాకారుడు మరొకరిని క్రీడల్లోకి రావద్దంటూ హెచ్చరించడం సరైంది కాదని నా అభిప్రాయం’ అని గోపీచంద్ వ్యాఖ్యలను రమణ వ్యతిరేకించారు. తనకు రైల్వేలో ఉద్యోగం ఉండటం వల్లే సింధు కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లగలిగానని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘క్రీడల ద్వారా ఉద్యోగం తెచ్చుకోవడం మధ్యతరగతి వారి దృష్టిలో పెద్ద ఘనత. అలాంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. రైల్వేలోనే వేలాది మంది క్రీడాకారులు ఉద్యోగాలు చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో పెద్ద చదువులు చదివే అవకాశం కూడా లభిస్తుంది. కోచ్‌లు ఈ విషయంలో వారికి సరైన దారి చూపిస్తే చాలు’ అని రమణ పేర్కొన్నారు. ఇటీవల ఒక యువ షట్లర్‌కు ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం లభించే విధంగా తాను తగిన విధంగా మార్గనిర్దేశనం చేసినట్లు రమణ వెల్లడించారు. డబ్బున్న వారే ఆటల్లోకి రావాలంటూ సూచించడం సరైంది కాదని ఆయన అన్నారు. సింధు కెరీర్ ఆరంభంలో తాము రైలు ప్రయాణాలు చేస్తే కొందరు విమానాల్లో వచ్చేవారని... ఇప్పుడు సింధు ఏ స్థాయికి చేరుకుందో చూడాలని రమణ వ్యాఖ్యానించారు. -
త్వరలోనే కొత్త లీగ్.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ సహా 6 జట్లు
సాక్షి, హైదరాబాద్: వాలీబాల్ క్రీడను మరింత ఆకర్షణీయంగా మార్చే క్రమంలో కొత్తగా మరో లీగ్ తెరపైకి వచ్చింది. ‘ప్రైమ్ వాలీబాల్ లీగ్’ పేరుతో దీనిని నిర్వహించనున్నారు. ఇందులో హైదరాబాద్ బ్లాక్ హాక్స్, చెన్నై బ్లిట్జ్, బెంగళూరు టార్పెన్డోస్, కాలికట్ హీరోస్, కొచ్చి బ్లూ స్పైకర్స్, అహ్మదాబాద్ డిఫెండర్స్ పేర్లతో ఆరు నగరాలకు చెందిన జట్లు ఉంటాయి. ఈ టోర్నీ వివరాలను బుధవారం జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు వెల్లడించారు. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీ కోసం వేలం ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేస్తారు. 2019లో జరిగిన ప్రొ వాలీబాల్ లీగ్‌లో స్వల్ప మార్పులు చేసి కొత్తగా ఈ టోర్నీని ముందుకు తెచ్చారు. ఫ్రాంచైజీల చేతుల్లోనే టోర్నీ మొత్తం యాజమాన్య హక్కులు ఉండే పద్ధతిలో తొలిసారి ఇలాంటి టోర్నమెంట్ జరగనుందని ప్రైమ్ వాలీబాల్ లీగ్ లీగ్ సీఈఓ జాయ్ భట్టాచార్య వెల్లడించారు. ఆన్లైన్ కంపెనీ ఏ23, ప్లేయర్ మేనేజ్మెంట్ సంస్థ బేస్‌లైన్ వెంచర్స్ లీగ్‌లో ప్రధాన భాగస్వాములు కాగా... సోనీ నెట్వర్క్ ఈ లీగ్ మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది. కార్యక్రమంలో టీమ్‌ల యజమానులు, సోనీ ప్రతినిధులతో పాటు భారత మాజీ వాలీబాల్ క్రీడాకారుడు పీవీ రమణ కూడా పాల్గొన్నారు. చదవండి: Neeraj Chopra: ఒలింపిక్ రికార్డును సవరించాల్సి ఉంది -
పతకం మీకే అంకితం: పీవీ సింధు
సాక్షి, హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు ఆ మెడల్‌ను పోలీసు విభాగానికి అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. తన తండ్రి పీవీ రమణతో కలిసి ఆమె మంగళవారం నగర పోలీసు కమిషనరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసు విభాగం సింధుకు ఘన స్వాగతం పలికింది. నగర పోలీసు విభాగానికి చెందిన అశ్విక దళాలు నిజాం కాలేజీ హాస్టల్ వద్ద నుంచి సింధు కారుకు పైలట్‌గా వచ్చాయి. కమిషనరేట్ పోర్టుకో వద్ద కొత్వాల్ అంజనీకుమార్, అదనపు సీపీలు అనిల్‌కుమార్, షికాగోయల్ పుష్పగుచ్ఛం అందించి ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సింధు తన పతకాన్ని ప్రదర్శిస్తూ పోలీసు అధికారులకు ఉద్దేశించి మాట్లాడారు. లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ తన ప్రాక్టీసు నిరాటంకంగా కొనసాగడానికి పోలీసులు అందించిన సహకారం మరువలేనిదని, తాను టోక్యో ఒలింపిక్స్‌లో విజయం సాధించడానికి ఆ ప్రాక్టీస్ కీలకమని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాను సాధించిన పతకాన్ని పోలీసు విభాగానికి అంకితమిస్తున్నానని ప్రకటించారు. అకుంఠిత దీక్ష, నిరంతర సాధనతో సింధు సా«ధించిన విజయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి అని పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కొనియాడారు. ఫస్ట్‌వేవ్, సెకండ్‌వేవ్ సందర్భాల్లో నగర పోలీసులు అందించిన సేవలపై ‘కాప్స్ వర్సెస్ కోవిడ్’, ‘ది సెకండ్ వేవ్’పేర్లతో రూపొందించిన పుస్తకాలను సింధుకు బహూకరించారు. -
ఏ పీ సీఎం వై ఎస్ జగన్ ఎంతో ప్రోత్సహించారు
-
మళ్లీ పతకం తెస్తున్నావా అని సీఎం జగన్ అడిగారు: పీవీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో కాంస్య పతకం రావడం ఆనందంగా ఉందని తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు హర్షం వ్యక్తం చేశారు. దేశానికి పతకం తెచ్చినందుకు గర్వంగా ఉందన్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా... ‘‘సెమీస్‌లో ఓడినప్పుడు కొంచెం బాధేసింది. ఆ సమయంలో కోచ్, పేరెంట్స్ నాకు మద్దతుగా నిలిచారు. నాకు మరో ఛాన్స్ ఉందని ప్రోత్సహించారు. కాంస్యం పతకం రావడం చాలా సంతోషంగా ఉంది. ఒలింపిక్స్‌లో పతకం గెలవడం ఓ డ్రీమ్. వచ్చే టోర్నమెంట్లో బంగారు పతకం సాధించేందుకు కష్టపడతా’’ అని పీవీ సింధు పేర్కొన్నారు. సీఎం జగన్ ఎంతో ప్రోత్సహించారు: ఒలింపిక్స్‌లో రెండుసార్లు పతకం సాధించడం ఆషామాషీ కాదని టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు తండ్రి రమణ అన్నారు. ఎంతో కఠినమైన పోటీ ఉంటుందని, దానిని ఎదుర్కొని సింధు పతకం గెలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ‘‘సింధు ప్రతిరోజు 7 గంటలు ప్రాక్టీస్ చేసింది. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు ప్రధాని మోదీ మాట్లాడారు. పతకం తీసుకొచ్చిన తర్వాత ఐస్‌క్రీమ్ తిందామని ప్రధాని అన్నారు. మరికొద్ది రోజుల్లో ప్రధాని మోదీని కలుస్తాం. కేంద్రం నుంచి మంచి ప్రోత్సాహం ఉంది. కేంద్రం నుంచి వచ్చే ప్రోత్సాహాలు నేరుగా క్రీడాకారులకు అందాలి. మరింత పారదర్శకత అవసరం’’ అని తెలిపారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సింధును ప్రోత్సహించారన్న ఆయన.. ‘‘మళ్లీ పతకం తెస్తున్నావా? అని సీఎం అడిగారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు శాలువా కప్పి ఆల్ ది బెస్ట్ చెప్పారు’’ అని హర్షం వ్యక్తం చేశారు. -
రాట్నాలమ్మ ఆశీస్సులతోనే..
పెదవేగి (దెందులూరు): పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలోని రాట్నాలమ్మ ఆశీస్సులతోనే తాను ఈ విజయం సాధించినట్టు పీవీ సింధు చెప్పారు. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో చైనా క్రీడాకారిణిపై సింధు విజయం సాధించిన నేపథ్యంలో ఆమె తండ్రి పీవీ రమణను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ఈ విజయంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పీవీ సింధును అదే ఫోన్ కాల్లో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడించారు. ఈ సందర్భంగా సింధు తన విజయంపై పట్టరాని ఆనందాన్ని వ్యక్తం చేశారు. పెదవేగి మండలం రాట్నాలకుంట అమ్మవారి కృపతోనే తాను విజయం సాధించినట్టు చెప్పారు. సింధు భారత్‌కు వచ్చాక రాట్నాలకుంటకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటామని రమణ వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 25న సింధు తన తండ్రితో కలిసి రాట్నాలమ్మను దర్శించుకున్నారు. -
సీఎం జగన్ దంపతులకు పీవీ సింధు తండ్రి ప్రత్యేక కృతజ్ఞతలు
-
సింధు పతకం సాధించడం ఆనందంగా ఉంది : సింధు తల్లి
-
ఒత్తిడిలోనూ సింధు విజయం సాధించింది: తండ్రి రమణ
-
సింధు కంటే తైజూకు మెరుగైన రికార్డు ఉంది: పీవీ రమణ
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్స్ సెమీస్‌లో పీవీ సింధు గెలుపు కోసం వంద శాతం కృషి చేసిందని సింధు తండ్రి పీవీ రమణ తెలిపారు. సింధు సెమీస్‌లో ఓటమి అనంతరం ఆయన స్పందించారు. అయితే సింధూ కంటే తైజూకు మెరుగైన రికార్డు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పీవీ సింధు అటాకింగ్ గేమ్ ఆడలేకపోయిందని ఓటమికి కారణాలను వివరించారు. సింధు ప్రత్యర్థి తైజూయింగ్ వరల్డ్ ఛాంపియన్, ఆమె చాలా వ్యూహాత్మకంగా ఆడింది అని రమణ తెలిపారు. కాగా, బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీస్‌లో పీవీ సింధు- చైనీస్ తైపీకి చెందిన తైజుయింగ్ మధ్య పోరు నువ్వా- నేనా అన్నట్లుగా సాగింది. తొలి గేమ్‌లో ఆధిక్యం దిశగా దూసుకుపోయిన సింధును తైజు సమర్థవంతంగా ఎదుర్కొంది. అనంతరం దూకుడైన ఆటతో తొలి గేమ్‌లో 21-18తో పీవీ సింధును ఓడించింది. ఇక రెండో గేమ్‌లో తైజుయింగ్‌కు సింధు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. రెండో గేమ్‌లో 12-21 తేడాతో సింధు ఓటమిపాలైంది. సెమీస్‌లో ఓడిన సింధు ఇక కాంస్య పతక వేట కొనసాగించనుంది. హీ బింగ్ జియాతో సింధు గెలిస్తే కాంస్య పతకం ఖాయమవుతుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
PV Sindhu: సెమీస్‌కు పీవీ సింధు.. ట్విటర్లో ప్రశంసల వర్షం
సాక్షి, హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టిన పీవీ సింధుకు ప్రశంసల వర్షం కురుస్తోంది. కూతురి అద్భుత ప్రదర్శనపై ఆమె తండ్రి రమణ హర్షం వ్యక్తం చేశారు. యమగూచిపై పీవీ సింధు విజయం అనంతరం ఆయన హైదరాబాద్‌లోని స్వగృహంలో మాట్లాడుతూ.. ఇవాళ జరిగినక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సింధు ఒత్తిడిని జయించి విజయం సాధించిందని అన్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచి ప్రత్యర్ధిపై సింధు చాలా బాగా ఆడిందని పేర్కొన్నారు. తన కూతురి విజయంలో కోచ్ సహా అందరి సమష్టి కృషి ఉందని రమణ తెలిపారు. సింధు దేశానికి మంచి పేరు తెస్తున్నందుకు ఆనంద పడుతున్నాని ఆనందం వ్యక్తం చేశారు. సెమీస్‌లో కూడా సింధు విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెందిన యమగూచిపై 21-13, 22-20తో విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, క్రీడాభిమానులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ , కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ, జగ్గీ వాసుదేవ్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. OMG YES YES YES🎉🇮🇳🇮🇳 #PVSindhu #Cheer4India pic.twitter.com/wgnhAJo4wg — nemboi7 (@nemboi7) July 30, 2021 A thriller of a match at #Olympics#PVSindhu wins a two set nailbiter to breeze into the semi-finals of the women's badminton singles. 🏸 Way to go India 🇮🇳 pic.twitter.com/0D6PaPA577 — Piyush Goyal (@PiyushGoyal) July 30, 2021 Hearty Congratulations @Pvsindhu1 on winning the #Badminton quarter finals by defeating Akane Yamaguchi of Japan at #TokyoOlympics2020 #PVSindhu now moves into semi-finals. Let us continue to #Cheers4India pic.twitter.com/7tQZxRpi1t — G Kishan Reddy (@kishanreddybjp) July 30, 2021 Sindhu, congratulations on a spectacular win. You’ve raised the bar for yourself & done the Nation proud. My Best Wishes & Blessings for Victory. –Sg @Pvsindhu1 #Cheer4India #PVSindhu #Tokyo2020 https://t.co/8f2FvQ0sBW — Sadhguru (@SadhguruJV) July 30, 2021 This is a hattrick as we register third impressive win today at #TokyoOlympics2020 with the very bright @Pvsindhu1 storming into the semi final. Congratulations and we are so happy.#TeamIndia #Olympics2020 @BAI_Media #PVSindhu pic.twitter.com/41JVRWGlw3 — Himanta Biswa Sarma (@himantabiswa) July 30, 2021 -
సింధు పేరెంట్స్ ఏమన్నారంటే..
-
సింధు పేరెంట్స్ ఏమన్నారంటే..
తన కూతురు సింధు భవిష్యత్తులో స్పెయిన్ ప్లేయర్ కరోలినా మారిన్ లా ఆడుతుందని ఆమె తండ్రి పీవీ రమణ ధీమా వ్యక్తం చేశారు. మారిన్ నుంచి సింధు చాలా నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సింధు విజయాల వెనుక అందరి దీవెనలు ఉన్నాయని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కోచ్ గోపీచంద్, అతడి బృందం సింధుకు ఎంతో సాయపడిందన్నారు. భవిష్యత్తులో తన కూతురు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భారతీయుల విశ్వాసాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని, అయితే ప్రత్యర్థిపై తొలి గేమ్ సింధు గెలిచినా ఆమెపై గెలుపు అంత సులువుకాదని మరోసారి పీవీ రమణ ప్రస్తావించారు. బ్యాడ్మింటన్ ఫైనల్లో సింధు కాస్త నెర్వస్‌గా కనిపించిందని ఆమె తల్లి విజయ అన్నారు. కచ్చితంగా సింధు స్వర్ణం నెగ్గుతుందని భావించామని, అయితే అనవసర తప్పిదాలు చేయడం వల్లే కూతురు స్వర్ణం సాధించలేక పోయిందని పేర్కొన్నారు. సింధు తల్లి విజయ మీడియాతో మాట్లాడుతూ.. 'శారీరకంగానూ కాస్త అలసిపోవడం సింధు ఆటపై ప్రభావం చూపింది. మొదట్లో మెరుగ్గానే ఆడినా చివరికొచ్చే సరికి కాస్త టెన్షన్ పడ్డట్లు కనిపించింది. మరో ప్రయత్నంలో కచ్చితంగా ఒలింపిక్ స్వర్ణం నెగ్గుతుంది' అని ఆశాభావం వ్యక్తం చేశారు. కూతుళ్లను కనడం భారమని భావించే తల్లిదండ్రుల ఆలోచనల్లో ఇకనుంచి మార్పు వస్తుందని, తన కాన్పు సమయంలో కూతురే పుట్టాలని కోరుకున్నట్లు పుత్రికోత్సాహంలో ఉన్న ఆమె తెలిపారు. -
'సింధు తప్పకుండా గెలుస్తుంది'
హైదరాబాద్: రియో ఒలింపిక్స్ లో తమ కుమార్తె పతకం సాధిస్తుందని బ్యాడ్మింటర్ స్టార్ పీవీ సింధు తల్లిదండ్రులు పీవీ రమణ, విజయ విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం జరిగే సెమీఫైనల్లో సింధు విజయం సాధించాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. 'కచ్చితంగా సింధు గెలవాలని కోరుకుంటున్నాం. ఆమెతో మాట్లాడాను. ఆటపైనే దృష్టి పెట్టమని చెప్పాను. సెమీఫైనల్లో ఆమె విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం. పతకంతో తిరిగొస్తుందన్న విశ్వాసంతో ఉన్నామ'ని రమణ అన్నారు. తమ కుమార్తె సెమీస్ చేరడం సంతోషంగా ఉందని సింధు తల్లి విజయ అన్నారు. తాను ఆడిన మొదటి ఒలింపిక్స్ లోనే సింధు సెమీఫైనల్ చేరడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. రేపు జరగనున్న సెమీఫైనల్లో జపాన్ క్రీడాకారిణి నజోమి ఒకుహరాతో తలపడనుంది. అయితే ఒకుహరా కేడా మంచి ప్లేయర్ అని, ఆమెతో మ్యాచ్ అంత ఈజీ కాదని రమణ పేర్కొన్నారు. రేపు ఎవరు బాగా ఆడతారనే దానిపై విజయావకాశాలు ఆధారపడివుంటాయని చెప్పారు. -
‘దేశం’లో లుకలుకలు!
పీవీ రమణను సస్పెండ్ చేయాలని పట్టణ పార్టీ తీర్మానం అధినాయకుడి దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే నిర్ణయం ద్వితీయశ్రేణికి చెందిన ముగ్గురు నాయకుల ఫోను సంభాషణ బయటపడటమే కారణం ఒకరినే సస్పెండ్ చేయాలని తీర్మానించడంపై కార్యకర్తల అభ్యంతరం శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి పీవీ రమణను సస్పెండ్ చేయాలని శ్రీకాకుళం పట్టణ పార్టీ తీర్మానం చేయడమే దీనికి కారణం. సస్పెండ్‌కు సంబంధించిన తీర్మానాన్ని అధినాయకుని దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించి ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తన వెంట తీర్మాన ప్రతిని తీసుకువెళ్లడం చర్చనీయాంశమైంది. ఇటీవల పట్టణస్థాయి సమావేశం జరగ్గా.. దీనిపై ముగ్గురు నాయకులు ఫోన్లో చేసుకున్న సంభాషణ వాట్సాఫ్‌లో హల్చల్ చేసింది. పీవీ రమణ, గుమ్మా నాగరాజు, మావూరి శ్రీనివాసరావులు చేసుకున్న సంభాషణ జిల్లా వ్యాప్తంగా వాట్సాఫ్‌లో ప్రత్యేక్షమైంది. సమావేశంలో జామి భీమశంకర్ తనకు ఏయూ పాలకమండలి సభ్యునిగా నియమించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు, ఇతర పార్టీల నుంచి ఎవరైనా టీడీపీలోకి రావాలని యోచిస్తే వారిని అడ్డుకునేలా పార్టీయే తీర్మానం చేయాలని ఎమ్మెల్యే సూచించినట్లు మాదారపు వెంకటేష్ తనతో చెప్పినట్లు పీవీ రమణతో గుమ్మా నాగరాజు చెప్పినట్టు సమాచారం. ఇదే సందర్భంలో మంత్రి అచ్చెన్నాయుడు.. మున్సిపల్ మాజీ చైర్మన్ వరంను గాని, వారి కుటుంబ సభ్యులనుగాని టీడీపీలోకి తీసుకువచ్చే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే భయపడుతున్నారని కూడా రమణతో నాగరాజు అన్నట్టు సమాచారం. ఏప్రిల్ మాసాంతంలో, మే మొదటి వారంలోగాని శ్రీకాకుళం నగరపాల సంస్థకు ఎన్నికలు జరుగుతాయని, ఈలోగా మున్సిపాలిటీకి మంజూరైన రూ. 28 కోట్లు ఖర్చు చేయాలని, పనులన్నీ పార్టీ కార్యకర్తలతోనే చేయించాలని నిశ్చయించినట్లు ఎమ్మెల్యే సమావేశంలో తెలిపారని కూడా రమణ దృష్టికి నాగరాజు తీసుకొచ్చారు. అయితే ఈ నిధులు మంజూరైనట్లు సమావేశం ముందురోజునే తాను మీ దృష్టికి తీసుకువచ్చాను కదా అని నాగరాజును రమణ ప్రశ్నిస్తూ తనకు ఈ విషయాన్ని మంత్రి ముందురోజే చెప్పారని రమణ అనడం కూడా ఆ సంభాషణలో ఉంది. దీనికి నాగరాజు బదులిస్తూ మంత్రి ప్రస్తావననే ఎమ్మెల్యే తీసుకురాలేదని, తానే మున్సిపల్ మంత్రి నారాయణను, ముఖ్యమంత్రిని అడిగి మంజూరు చేయించానని చెబుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే చుట్టూ ఉన్న కొందరు గ్యాంగ్‌గా తయారయ్యారని, అలాంటి వారిని పెట్టుకొని వెళితే నగరపాలకసంస్థ ఎన్నికల్లో గెలవడం కష్టమని కూడా నాగరాజు సంభాషణలో అభిప్రాయపడ్డారు. నాన్నకు ప్రేమతో తరహాలో కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించి అమ్మకు ప్రేమతో అన్నట్లుగా పనిచేయాలని గ్యాంగ్ సభ్యులంతా చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మాజీ కౌన్సిలర్ మావూరి శ్రీనివాసరావు.. రమణతో అన్నారు. నాగరాజు చెప్పిన వివరాలను కూడా ఆయన ధ్రువీకరించారు. ఇలా ముగ్గురి మధ్య సంభాషణ జరగ్గా పీవీ రమణను మాత్రమే సస్పెండ్ చేయాలని తీర్మానించడంపై కార్యకర్తలు అభ్యంతరం చెబుతున్నారు. సమావేశంలోని నాయకులు, కార్యకర్తలంతా ముగ్గురినీ సస్పెండ్ చేయాలని పట్టుబట్టగా, త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని తన మాటను ఏ ఒక్కరూ కాదనవద్దని ఎమ్మెల్యే చెప్పినట్లు భోగట్టా. గుమ్మా నాగరాజు, మావూరి శ్రీనివాసరావులు ఎమ్మెల్యేకు అనుచరులు కావడం, తొలినుంచీ పీవీ రమణను ఎమ్మెల్యే దూరంగా ఉంచడమే ప్రస్తుత నిర్ణయానికి కారణమని టీడీపీలో చర్చ జరుగుతోంది. కారణమేదైనప్పటికీ సంభాషణలో ఎక్కువగా ఆరోపణలు చేసింది నాగరాజు, శ్రీనివాసరావులు కాగా రమణను సస్పెండ్ చేయడంపై టీడీపీలోని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో.. ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన ఓ నాయకుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నానా దుర్భాషలాడటం, ఈ సంభాషణ కూడా అప్పట్లో రికార్డు చేసి సీడీల ద్వారా ప్రచారం జరగడాన్ని ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. అటువంటి వారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని, ఓ సమావేశంపై ముగ్గురు చర్చించుకొని తమ అభిప్రాయాలను చెప్పుకుంటే ఒకరిని సస్పెండ్ చేయాలని తీర్మానం చేయించడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. కాగా విషయాన్ని ఇప్పటివరకు పార్టీ జిల్లా నేతలు, మంత్రి, శాసనసభ్యుల దృష్టికి తీసుకురాకుండా తీర్మానం చేసి రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకువెళ్లాలని నిశ్చయించడం పట్ల పలువురు నేతలు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. -
నాడు తండ్రి... నేడు తనయ
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు అరుదైన ఘనత సాధించింది. 28 ఏళ్ల క్రితం తన తండ్రి పీవీ రమణ సాధించిన ఘనతను ఆమె పునరావృతం చేసింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ వేదికగా జరిగిన 1986 ఆసియా క్రీడల్లో రమణ భారత పురుషుల వాలీబాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఆ క్రీడల్లో భారత వాలీబాల్ జట్టుకు కాంస్య పతకం లభించింది. దక్షిణ కొరియాలో మరోసారి ఆసియా క్రీడలు జరుగుతున్నాయి. ఈసారి రమణ కూతురు సింధు కాంస్యం నెగ్గిన భారత మహిళల బ్యాడ్మింటన్ టీమ్ విభాగంలో సభ్యురాలిగా ఉండటం విశేషం. తాజా ప్రదర్శనతో సింధు ప్రపంచ చాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో పతకాలు నెగ్గిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. - సాక్షి క్రీడావిభాగం