తన కూతురు సింధు భవిష్యత్తులో స్పెయిన్ ప్లేయర్ కరోలినా మారిన్ లా ఆడుతుందని ఆమె తండ్రి పీవీ రమణ ధీమా వ్యక్తం చేశారు. మారిన్ నుంచి సింధు చాలా నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సింధు విజయాల వెనుక అందరి దీవెనలు ఉన్నాయని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కోచ్ గోపీచంద్, అతడి బృందం సింధుకు ఎంతో సాయపడిందన్నారు.