కోటిన్నరతో.. కృష్ణా రామా! | Retirement life at lowest cost in India | Sakshi
Sakshi News home page

కోటిన్నరతో.. కృష్ణా రామా!

Published Fri, Mar 3 2023 4:37 AM | Last Updated on Fri, Mar 3 2023 4:38 AM

Retirement life at lowest cost in India - Sakshi

సాక్షి, అమరావతి: రూ.కోటిన్నర ఉంటే చాలు.. మన దేశంలో రిటైర్‌మెంట్‌ అనంతరం కృష్ణా రామా అని ప్రశాంతంగా జీవనం గడిపేయొచ్చట. అయితే.. ఈ లెక్క భారతీయులకు సంబంధించి కాదండోయ్‌. అమెరికన్ల కోసం మాత్రమే! ఎందుకంటే.. అమెరికా ఉద్యోగులు, రిటైరైన వారిలో 13 శాతం మంది పదవీ విరమణ అనంతర జీవితాన్ని విదేశాల్లో గడిపే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘ఏగాన్‌’ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. అమెరికన్లు రిటైర్‌మెంట్‌ అనంతరం వివిధ దేశాల్లో సాఫీగా జీవితం గడిపేందుకు ఎంత ఖర్చవుతుందనే గణాంకాలను ఆ సంస్థ విడుదల చేసింది.  

► రిటైర్‌మెంట్‌ అనంతరం జీవించేందుకు ప్రపంచంలో అత్యధికంగా సింగపూర్‌లో ఎక్కువ వ్యయం (దాదాపు రూ.9.21 కోట్లు) కానుంది. అమెరికాతో పోలిస్తే సింగపూర్‌లోనే 60% అధికంగా రిటైర్డు జీవితానికి ఖర్చవుతుంది. ఆ తరువాత స్థానంలో ఉన్న స్విట్జర్లాండ్‌లో కూడా అమెరికాతో పోలిస్తే శేష జీవిత ఖర్చులు ఎక్కువే.

► రిటైరైన అమెరికా ఉద్యోగులు తరువాత జీవితాన్ని సాఫీగా గడపాలంటే పాకిస్థాన్‌లో రూ.1.30 కోట్లు, భారత్‌లో రూ.1.53 కోట్లకుపైగా వ్యయం అవుతుంది. 

► ఓ అమెరికా ఉద్యోగి రిటైరైన తరువాత స్వదేశంలో (అమెరికా) శేష జీవితం గడపాలంటే దాదాపు రూ.5.79 కోట్లు కావాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement