15 నుంచి రెవెన్యూ సదస్సులు | Revenue Conferences from August 15: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

15 నుంచి రెవెన్యూ సదస్సులు

Published Sun, Aug 11 2024 6:01 AM | Last Updated on Sun, Aug 11 2024 6:01 AM

Revenue Conferences from August 15: Andhra Pradesh

మంత్రులు ప్రారంభించాలి.. ఎంపీ, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలి 

రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  

సాక్షి, అమరావతి: భూములకు సంబంధించిన అంశాలను పరిష్కరించేందు­కు ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రెవె­న్యూ సదస్సులు నిర్వహించనుంది. 15న అన్ని జిల్లాలో ప్రారంభించి 16–30 వరకు సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రెవె­న్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసో­డియా ఆదివారం మెమో ఇచ్చారు. గ్రామ స్థాయి­లో భూముల సమస్యలు పరిష్కారానికి ప్రతి రె­వెన్యూ గ్రామంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాలని అందులో అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. భూ­కబ్జాలు, 22ఏ జాబితా దురి్వనియోగంతో పాటు అన్ని భూ సంబంధిత విషయాలపై అర్జీలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రతి జిల్లాకు సీనియర్‌ ఐఏ­ఎస్‌ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి జి­ల్లాల వారీగా సదస్సుల షెడ్యూల్‌ రూపొందిస్తామన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వినతులు స్వీకరించడం, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను ప్రత్యేక అధికారి సమీక్షిస్తారని, వచి్చ­న అన్ని పిటిషన్లను.. వినతుల పరిష్కారానికి ప్రత్యేకంగా ఏర్పా­టు చేసిన ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

జేసీలు సదస్సులకు కో–ఆర్డినేటర్లుగా ఉంటారని, సబ్‌ కలెక్టర్లు/­ఆర్డీవోలు, తహశీల్దార్లు తమ పరిధిలోని ప్రతి గ్రామంలో సదస్సు నిర్వహించేలా షెడ్యూల్‌ రూపొం­దించాలన్నారు. ప్రతి సదస్సుకి తహశీల్దార్, ఆర్‌ఐ, వీ­ఆర్‌వో, మండల సర్వేయర్‌ ఇతర అన్ని శాఖలకు చెందిన వారు వెళ్లాలని, జిల్లా కలెక్టర్‌ జిల్లా నుంచి మండల నోడల్‌ అధికారులను నియమించాలని సూచించారు. సెపె్టంబర్‌ నెలాఖరుకి సదస్సులన్నీ పూర్తి కావాలని, ఆ తర్వాత వాటికి సంబంధించిన పరిష్కారాల ఆదేశాలను 45 రోజుల్లో ఇవ్వాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement