
అంత్యక్రియలకు మృతదేహాన్ని సిద్ధం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు
నల్లమాడ: భార్య, కుమారుడు ఇతర కుటుంబ సభ్యులందరూ కరోనా బారిన పడి హోం క్వారంటైన్‌లో ఉండిపోయారు. అనారోగ్యంతో 10 రోజులుగా మంచాన పడిన కుటుంబ పెద్ద గురువారం తెల్లవారుజామున కన్నుమూశాడు. కుటుంబ సభ్యులు బయటకు రాకూడని పరిస్థితి. దీంతో అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందే బంధువులై మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలు..స్థానిక వైఎస్సార్ కూడలిలో నివాసం ఉండే రిటైర్డ్ హెల్త్ సూపర్‌వైజర్ బి.రంగనాయకులు (77) అనారోగ్యంతో గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు.
అప్పటికే ఆయన భార్య, కుమారుడు, కోడలితో పాటు మరో ముగ్గురు సమీప బంధువులకు కరోనా వైరస్ సోకడంతో మొత్తం ఆరుగురు మూడు రోజులుగా హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, వీఆర్‌ఓ చంద్రశేఖర్, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ పొరకల రామాంజనేయులు పెద్దకోట్లపల్లికి వెళ్లే రహదారిలోని శ్మశాన వాటికలో గుంత తవ్వించి, మృతదేహాన్ని పూడ్చిపెట్టి హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు , ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment