
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు కార్యదర్శిగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అడుసుమిల్లి రాజమౌళి నియామకం అయ్యారు. కాగా, రాజమౌళి కొద్దిరోజుల క్రితమే కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్‌పై ఏపీకి వచ్చిన విషయం తెలిసిందే.
..సీఎం చంద్రబాబు కార్యదర్శిగా అడుసుమిల్లి రాజమౌళి నియమితులయ్యారు. ఇక, రాజమౌళి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఈరోజు(శుక్రవారం) బాధ్యతల నుంచి రాజమౌళి రిలీవ్ కావడంతో నేడు ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. అయితే, ఏపీకి చెందిన రాజమౌళి 2003 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.
ఇక, ఆయన సీఎం కార్యదర్శిగా పనిచేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చంద్రబాబుకు కార్యదర్శిగా వ్యవహరించారు. 2015 నుంచి 2019 వరకు ఆయన సీఎంవోలో పనిచేశారు.