
సిట్ చైర్మన్ విజయ్‌కుమార్ (ఫైల్‌ఫొటో)
సాక్షి, విశాఖపట్నం: విశాఖ భూ అక్రమాలపై సిట్ దర్యాప్తు ముగిసింది. టీడీపీ హయాంలో రికార్డుల తారుమారు, ఎన్‌వోసీ జారీ, నిషేధిత భూముల్లో అక్రమాలపై పూర్తిస్థాయిలో సిట్ నివేదిక సిద్ధమయ్యింది. సిట్ నివేదిక ఏం తేలుస్తుందోనని టీడీపీ ముఖ్య నేతల్లో గుబులు పట్టుకుంది. సిట్ కార్యాలయానికి కేటాయించిన 19 మంది రెవెన్యూ సిబ్బందిని చైర్మన్ వెనక్కి పంపించారు. వచ్చే వారంలో చివరిరోజు ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని సిట్ చైర్మన్ విజయ్‌కుమార్ తెలిపారు. గత ప్రభుత్వంలో వందలాది ఎకరాల్లో అక్రమాలు జరిగాయని, అన్ని విషయాలు నివేదికలో స్పష్టంగా పొందుపరుస్తామని ఆయన వెల్లడించారు. (చదవండి: ‘ఇల్లు కదలరు.. బయటకు రారు..’)
Comments
Please login to add a commentAdd a comment