సాక్షి, అమరావతి: దేశంలో పెద్ద రాష్ట్రాల కన్నా చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత కేంద్రాల్లోని జనాభాకే అత్యధిక శాతం సొంత కార్లున్నాయి. ఈ సంఖ్య గోవా రాష్ట్రంలో అత్యధికంగా ఉండగా.. బీహార్ రాష్ట్రంలో అత్యల్పంగా ఉంది. గోవా తరువాత కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 24.2 శాతం జనాభాకు సొంతకార్లున్నాయి. ఈ విషయాన్ని 2019–21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. గోవాలో పట్టణాల్లో 49.1 శాతం మందికి, గ్రామాల్లో 39.6 శాతం మందికి సొంత కార్లున్నాయి.
మొత్తం మీద గోవాల్లో 45.2 శాతం జనాభాకు సొంత కార్లున్నాయి. బీహార్‌లో పట్టణాల్లో 6.4 శాతం జనాభాకు, గ్రామీల్లో 1.2 శాతం జనాభాకు సొంతకార్లున్నాయి. బీహార్‌లో 2.0 శాతం మందికి మాత్రమే సొంతకార్లున్నాయి. డిల్లీలో పట్టణాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధిక శాతం మందికి సొంతకార్లుండటం గమనార్హం. కాగా, దేశం మొత్తం మీద 7.5 శాతం జనాభాకే సొంతకార్లున్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో 22.1 శాతం, పంజాబ్‌లో 21.9, నాగాలాండ్‌లో 21.3, సిక్కింలో 20.9, ఢిల్లీలో 19.4, అరుణాచల్ ప్రదేశ్‌లో 19.3,మణిపూర్‌లో 17, మిజోరాంలో 15.5 శాతం జనాభాకు సొంతకార్లున్నాయి. పెద్ద రాష్ట్రాల్లో ఒక్క గుజరాత్‌లో మాత్రమే అత్యధికంగా 10.9 శాతం జనాభాకు సొంతకార్లున్నాయి. ఆ తరువాత కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ శాతం మందికి కార్లుండగా మిగతా రాష్ట్రాలో చాలా తక్కువ శాతం మందికే సొంత కార్లున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 2015–16లో 2.0 శాతం మాత్రమే సొంతకార్లుండగా.. 2019–21లో ఆ సంఖ్య 2.8 శాతంకు పెరిగింది. 2019–21లో ఏపీలో పట్టణ ప్రాంతాల్లో 5.8 శాతం జనాభాకు సొంతకార్లుండగా గ్రామాల్లో కేవలం 1.4 శాతం మందికే సొంతకార్లున్నాయి. అలాగే ఏపీలో సైకిళ్లు ఉన్న వారి జనాభా 30.9 శాతం ఉంది. మోటార్ సైకిళ్లు లేదా స్కూటర్ ఉన్న వారి జనాభా ఏపీలో 47 శాతం ఉంది. తెలంగాణలో మొత్తం 5.2 శాతం జనాభాకు సొంత కార్లుండగా.. ఇందులో పట్టణాల్లో 10.8 శాతం, గ్రామాల్లో 2.1 శాతం జనాభాకు సొంతకార్లున్నాయి.
కారున్నోళ్లు కేరాఫ్ చిన్న రాష్టాలు!
Published Sun, May 29 2022 5:03 AM | Last Updated on Sun, May 29 2022 11:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment