పలు మార్గాల్లో జన సాధారణ రైళ్లు | South Central Railway officials says General trains on many routes for Sankranthi | Sakshi
Sakshi News home page

పలు మార్గాల్లో జన సాధారణ రైళ్లు

Published Wed, Jan 12 2022 5:12 AM | Last Updated on Wed, Jan 12 2022 5:12 AM

South Central Railway officials says General trains on many routes for Sankranthi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్‌)/రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): సంక్రాంతి రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో జన సాధారణ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 

► సికింద్రాబాద్‌–అనకాపల్లి (07435/07436) ప్రత్యేక రైలు ఈ నెల 13న సాయంత్రం 5.50 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు అనకాపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 14న సాయంత్రం 6.30 గంటలకు అనకాపల్లి నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. 
► సికింద్రాబాద్‌–నర్సాపూర్‌ (07489) (వయా గుంటూరు, విజయవాడ) ప్రత్యేక రైలు 12వ తేదీ (నేడు) రాత్రి 11.50 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి మరుసటిరోజు ఉదయం 10.30 గంటలకు నర్సాపూర్‌ చేరుకుంటుంది. 
► సికింద్రాబాద్‌–తిరుపతి (07437) స్పెషల్‌ ట్రైన్‌ 12వ తేదీ సాయంత్రం 6.40 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. 
► కాచిగూడ–కర్నూల్‌ సిటీ (17435/17436) డెము రైలు 12వ తేదీ సాయంత్రం 5.35 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి రాత్రి 11.40 గంటలకి కర్నూలు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 13వ తేదీ ఉదయం 7 గంటలకు కర్నూలులో బయల్దేరి మధ్యాహ్నం 12.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement