
ఫైల్ ఫోటో
సాయిబాబా కాలేజీలో విద్యార్థులపై లాఠీఛార్జ్ జరగలేదని ఎస్పీ ఫక్కీరప్ప సృష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థుల ముసుగులో కొందరు రాళ్ల దాడి చేసినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు.
సాక్షి, అనంతపురం: సాయిబాబా కాలేజీలో విద్యార్థులపై లాఠీఛార్జ్ జరగలేదని ఎస్పీ ఫక్కీరప్ప సృష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థుల ముసుగులో కొందరు రాళ్ల దాడి చేసినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. రాళ్ల దాడి వల్లే గాయపడ్డానని విద్యార్థిని జయలక్ష్మి నిజాయితీగా చెప్పారు. ఘటనపై లోతుగా విచారణ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. అబద్ధాలు సృష్టించి ధర్నాలు చేయడం మానుకోవాలని ఎస్పీ ఫక్కీరప్ప హితవు పలికారు.