
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రులు పెద్దిరామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై చేసిన ఫిర్యాదును అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం సీరియస్‌గా తీసుకున్నారు. తమపై అసత్య ఆరోపణలు చేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మిగడ్డపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని మంత్రులు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిని పూర్తిస్థాయిలో పరిశీలించిన స్పీకర్ తమ్మినేని ఎస్‌ఈసీపై చర్యలు ప్రారంభించారు. నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవల్సిందిగా ప్రివిలైజ్ కమిటీకి సోమవారం సిఫార్సు చేశారు. మంత్రుల ఫిర్యాదును పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవలని స్పీకర్ ఆదేశించారు. దీనిపై ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టనుంది. (మా హక్కులకు భంగం కలిగించారు)
కాగా సీనియర్ శాసనసభ్యులుగా, మంత్రులుగా తమ హక్కులకు భంగం కలిగించిన, తమ గౌరవాన్ని మంట గలిపేలా వ్యవహరించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ స్పీకర్‌ను కోరిన విషయం తెలిసిందే. ‘ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్‌కు రాసిన లేఖలో మాపై మోపిన నిందారోపణలు మాకు తీవ్రమైన బాధను, మానసిక వేదనను కలిగించాయి. ఆ కలతతోనే ఆ లేఖ గురించి మీ దృష్టికి తెస్తున్నాం. లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్న అంశాలు సోషల్ మీడియాతోపాటు ఇతర మీడియా వేదికలుగా విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి’ అని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment