సాక్షి, అమరావతి: చెరకు పిప్పి.. అదో వ్యర్థ పదార్థం, ఎందుకూ పనికిరాదు అనుకున్నాం ఇన్నాళ్లూ.. కానీ, ఇప్పుడు ఈ వ్యర్థ పదార్థాన్నే శాస్త్రవేత్తలు కాసులు కురిపించే ముడిసరుకుగా తేల్చారు. చెరకు రైతులకు అదనపు ఆదాయం చేకూరుస్తుందని నిరూపించారు. ఈ పిప్పిని బ్రికెట్స్ (ఓ మోస్తరు కర్రలు లాంటివి) మాదిరిగా తయారుచేస్తే వంట చెరుకుగానే కాకుండా ఇంధన కొరతకు ప్రత్యామ్నాయంగా.. శుభకార్యాల్లో ఉపయోగించే కప్పులు, ప్లేట్లులా కూడా తయారుచేసి వాడుకోవచ్చని వారంటున్నారు. చెరకు పిప్పి, ఎండుటాకులను బ్రికెటింగ్ టెక్నాలజీ ద్వారా ఈ బ్రికెట్స్‌ను తయారుచేసి రైతులకు అదనపు ఆదాయం లభించేలా అనకాపల్లి చెరకు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు ఆధునిక యంత్ర పరికరాన్ని అభివృద్ధి చేశారు.
సాధారణంగా.. పంట కోసిన తర్వాత వృక్ష సంబంధిత వ్యర్థ పదార్థాలను ‘బయోమాస్’ అంటారు. వీటిని మెజారిటీ రైతులు వంట చెరుకుగా వినియోగిస్తారు. సహజ రూపంలో నిల్వ చేయాలంటే వీటికి ఎక్కువ స్థలం అవసరం. వీటి రవాణా ఖర్చులూ ఎక్కువే కాదు.. వీటి నుంచి వచ్చే ఉష్ణశక్తి తక్కువే. టన్ను పిప్పి నుంచి 35 టన్నుల బ్రికెట్స్ వంద టన్నుల చెరకు నుంచి సుమారు 30 టన్నుల పిప్పి, 10 టన్నుల ఎండుటాకులు వస్తాయి. పిప్పిలో 70 శాతం, ఎండుటాకుల్లో 50 శాతం వంట చెరకుగా, బెల్లం తయారీ కోసం వినియోగిస్తారు. మిగిలిన వాటిని వృధాగా వదిలేయడం లేదా పంట పొలాల్లో కాల్చేయడం చేస్తుంటారు. అదే బ్రికెటింగ్ టెక్నాలజీ ద్వారా వంద టన్నుల పిప్పి, ఎండుటాకుల నుంచి 35 టన్నుల బ్రికెట్స్ తయారుచెయ్యొచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు.
ఇక సహజ రూపంలో ఈ పిప్పిని వంట చెరుకుగా వినియోగిస్తే కిలోకి 1,200 నుంచి 1,300 కిలో కేలరీల ఉష్ణశక్తి మాత్రమే వెలువడుతుంది. అదే బ్రికెట్స్ రూపంలోకి మార్చి మండిస్తే కిలోకి ఏకంగా 4,452 కిలో కేలరీల ఉష్ణశక్తి వెలువడుతుండడం ఈ బ్రికెట్స్ ప్రత్యేకత. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నిల్వచేయడమే కాదు.. వీటిని సులభంగా, చౌకగా కూడా తరలించొచ్చు. అంతేకాదు.. ఇవి మండినప్పుడు పొగ రాకపోవడంవల్ల చుట్టుపక్కల వారికి ఇబ్బంది ఉండదు. పైగా.. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ కన్నా ఇవి భూమిలో సులభంగా కలిసిపోతాయి. మార్కెట్‌లో బ్రికెట్లకు మంచి గిరాకీ ప్రస్తుతం రెస్టారెంట్లు, హోటళ్లలో వరి ఊకనే ప్రధాన వంట చెరకుగా ఉపయోగిస్తున్నారు. ఇక నుంచి ఈ బ్రికెట్లను ఉపయోగించవచ్చు.
ప్రస్తుతం ఈ బ్రికెట్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. టన్ను చెరకు రూ.2,850 ధర పలుకుతుంటే ఈ బ్రికెట్స్ మాత్రం టన్నుకు ఏకంగా రూ.5వేల నుంచి రూ.5,500 వరకు పలుకుతున్నాయి. చెరకు పిప్పిని బ్రికెట్స్‌గానే కాదు.. శుభకార్యాలకు ఉపయోగించేలా కప్పులు, ప్లేట్లను కూడా తయారుచెయ్యొచ్చు. చెరకు పిప్పిని బాగా ఎండబెట్టి, మెత్తని పొడిలా చేసి ఎటువంటి రసాయనాలు కలపకుండా నేరుగా మౌల్డింగ్ యంత్రం ద్వారా మనకు కావాల్సిన రూపంలో తయారుచేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలంటే.. టబ్రికెటింగ్ యంత్రం ద్వారా ఇతర వృక్ష సంబంధిత వ్యర్థ పదార్థాలను బైండరుతో కలిపి బ్రికెట్లుగా తయారుచేసుకోవచ్చు.
అదే చెరకు పిప్పికైతే బైండర్ అవసరం లేకుండానే బ్రికెట్స్ తయారుచెయ్యొచ్చు. ట ముందుగా చెరకు పిప్పిని 7–12 శాతం తేమ వరకు బాగా ఎండబెట్టాలి. ట తరువాత పిప్పిని చిన్నచిన్న ముక్కలుగా చేసి బ్రికెటింగ్ యంత్రంలోని హేమర్ మిల్లు ద్వారా పొడిచేసి బేరల్ ద్వారా పంపించి ఒత్తిడికి గురిచేయాలి. ట బ్రికెటింగ్ మిషన్‌లోని డై సైజును బట్టి బ్రికెట్ల పరిమాణం ఉంటుంది. ట బ్రికెట్లుగా తయారుచేయడం వలన చెరకు పిప్పి పరిమాణం 90 శాతం వరకు తగ్గుతుంది. ట సులభంగా నిల్వచేసుకుని సీజన్‌లో బెల్లం తయారీకి ఉపయోగించవచ్చు లేదా విక్రయించుకోవచ్చు.
చదవండి: జనం మధ్యకు పులి కూనలు..24 గంటలు గడిచిన తల్లి జాడ లేదు!
Comments
Please login to add a commentAdd a comment