శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి  | Supreme Court judge visiting TTD Srivaru | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి 

Published Mon, Oct 11 2021 5:34 AM | Last Updated on Mon, Oct 11 2021 5:34 AM

Supreme Court judge visiting TTD Srivaru - Sakshi

జస్టిస్‌ పీఎస్‌ నరసింహకు శ్రీవారి చిత్రపటాన్ని అందజేస్తున్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి

తిరుమల/చంద్రగిరి: తిరుమల శ్రీవారిని ఆదివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీఎస్‌ నరసింహ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం న్యాయమూర్తికి పండితులు వేద ఆశీర్వచనం అందించగా, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, ఏఈవో ధర్మారెడ్డిలు శ్రీవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. అలాగే, శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామిని, కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని కూడా జస్టిస్‌ నరసింహ ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం చంద్రగిరిలోని రాయలవారి కోటను సందర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. ఇక, ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో ఇన్‌కమ్‌టాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌ సంజయ్‌ పురి, నటుడు విజయ్‌దేవరకొండ ఉన్నారు. అధికారులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement