సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి పాలనలో బెదిరింపుల పర్వం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. బెదిరింపులతో, దొడ్డిదారిలో ఎమ్మెల్సీ పదవి, మేయర్ పీఠం దక్కించుకోవాలని టీడీపీ, జనసేన కుట్రలు చేస్తోంది. ఈ క్రమంలోనే కూటమిలో చేరకపోతే వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల ఆస్తులను ధ్వంసం చేస్తామని, వారిపై దాడులు చేస్తామని కూటమి నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు.
కాగా.. విశాఖ మేయర్, ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు టీడీపీ, జనసేన కుట్రలు చేస్తోంది. ఈనేపథ్యంలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరాలని పచ్చ పార్టీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. టీడీపీలో చేరకపోతే వారి ఆస్తులను ధ్వంసం చేస్తామని తప్పుడు కేసులు పెడతామని కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు. ఇలా ఇప్పటికే పలువురు కార్పొరేటర్లను టార్గెట్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చారు.
ఇక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. ఎన్నికల్లో టీడీపీకి తగిన మద్దతు లేకపోయినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారం దుర్వినియోగంతో గెలవాలని దుర్భుద్ధితో ముందుకు సాగుతోంది. ఎన్నికల కోసం కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్సీ పదవికి పోటీ చేయాలని టీడీపీ రాజకీయం చేస్తోంది. మరోవైపు.. టీడీపీకి మేయర్ పీఠం, జనసేనకు డిప్యూటీ మేయర్ దక్కేలా కుట్రలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కూటమికి పూర్తి మెజార్టీ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడంపై విశాఖవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment