సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో టీడీపీ మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. పచ్చ పార్టీ నేతల కనుసన్నల్లో పలమనేరులో అనధికారికంగా క్వారీల నిర్వహణ జరుగుతోంది. అంతేకాకుండా అక్కడ పనిచేస్తున్న వారిపై దాడులు కూడా జరుగుతున్నాయి.
వివరాల ప్రకారం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా పలమనేరు మండలం కొలమాసనపల్లిలో శరత్ కుమార్ అనే వ్యక్తి క్వారీని టీడీపీ నేత ఆక్రమించుకున్నారు. ఇక, అక్కడ క్వారీలో పనిచేస్తున్న సిబ్బందికి రెండు నెలలుగా జీతం ఇవ్వకుండా వారిని వేధింపులకు గురిచేస్తున్నాడు సదరు టీడీప నేత. అంతేకాకుండా క్వారీలో పనిచేస్తున్న చిన్నస్వామి అనే యువకుడిని క్వారీలో చంపిపడేయటం తీవ్ర కలకలం సృష్టించింది.
దీంతో, ఈ హత్య విషయం పలమనేరు పోలీసు స్టేషన్‌కు చేరింది. పోలీసు స్టేషన్‌లో టీడీపీ నేతలు పంచాయతీ పెట్టారు. ఇక, మృతుడు చిన్న స్వామి డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మృతుడి కుటుంబీకులు, వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అతడిని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment