డుడుమ డ్యాం నుంచి వృథాగా పోతున్న నీరు
ముంచంగిపుట్టు (విశాఖపట్నం): ఆంధ్ర ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం డైవర్షన్ డ్యాం(డుడుమ డ్యాం)కు చెందిన రెండో నంబర్ పవర్ గేట్ వద్ద సాంకేతిక లోపం తలెత్తింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పవర్ గేట్‌కు చెందిన బ్యాలెన్సింగ్ రోప్ అకస్మాత్తుగా తెగిపోయింది. దీంతో డ్యాం నుంచి భారీగా నీరు వృథా అవుతోంది.
డుడుమ డ్యాం నుంచి టన్నెల్ పాండ్ డ్యాంకు వెళ్లే నీటి మార్గంలో కెనాల్ మీద నీటి ప్రవాహ ఉధృతి పెరగడంతో కెనాల్‌కు ప్రమాదం పొంచి ఉంది. వేలాది క్యూసెక్కుల నీరు వృథాగా దిగువున ఉన్న బలిమెల డ్యామ్‌లోకి చేరుతోంది. దీనిపై డ్యాం సిబ్బంది వెంటనే స్పందించి.. తెగిపోయిన బ్యాలెన్సింగ్ రోప్‌ను తొలగించి దాని స్థానంలో కొత్తది అమర్చే పనుల్లో నిమగ్నమయ్యారు. బ్యాలెన్సింగ్ రోప్‌ను బుధవారం రాత్రికే పునరుద్ధరిస్తామని మాచ్‌ఖండ్ ప్రాజెక్ట్ ఎస్‌ఈ కేవీ నాగేశ్వరరావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment