
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తెలంగాణ ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్ నిబంధనలను పాటించాలని రైతు సంఘాలు కోరాయి. నీటి విషయంలో వైఎస్సార్ న్యాయంగా ముందుకెళ్లారన్నాయి. విద్యుదుత్పత్తి పేరుతో శ్రీశైలంలోని నీటిని అక్రమంగా తరస్తున్నారని, ప్రభుత్వ పోరాటం, కేఆర్‌ఎంబీ తీర్పుతో తెలంగాణ అక్రమ చర్యలకు అడ్డుకట్టపడుతుందని తెలిపాయి. ఇరు రాష్ట్రాలకు చట్టబద్ధమైన కేటాయింపులు జరగాలని, కృష్ణా నీటిపై కేంద్రం మౌనం తగదన్నాయి.