సాగుభూమిని పరిశ్రమలకు కేటాయించొద్దు | Area under cultivation industries do not want to afford | Sakshi
Sakshi News home page

సాగుభూమిని పరిశ్రమలకు కేటాయించొద్దు

Published Sat, Oct 18 2014 12:09 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Area under cultivation industries do not want to afford

రైతు సంఘం
 
హైదరాబాద్:  సాగుభూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ  పరిశ్రమలు ఇతర అభివృద్ధి కార్యకమాల కోసం కేటాయించవద్దని తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం డిమాండ్‌చేసింది. భూసేకరణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో, ఒక్కో పరిశ్రమకు గరిష్టంగా 2 వేల ఎకరాలను కేటాయించాలని నిర్ణయించారని పేర్కొంది. 

ఈ నిర్ణయం ఆహారభద్రత కోసం పంటలు పండించడానికి ఉపయోగించాల్సిన భూమిని కార్పొరేట్ రంగానికి ధారాదత్తం చేయడమేనని ఈ సంఘం నేతలు టి.విశ్వేశ్వరరావు, పశ్యపద్మ ధ్వజమెత్తారు. ఇందులో 15 శాతం సాగుభూమిని కేటాయించడానికి ప్రభుత్వం పూనుకోవడం రైతాంగాన్ని పూర్తిగా దెబ్బతీయడమేనని విమర్శించారు. భూసేకరణచట్టం రూపకల్పనకు అఖిలపక్ష రైతుసంఘాల సమావేశం ఏర్పాటుచేయాలని, ఏ పరిశ్రమకు ఎంత భూమి అవసరమో ఆభేటీలో చర్చించి నిర్ణయించాలని డిమాండ్‌చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement