శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: టీటీడీ చైర్మన్ | Tirumala Srivari Brahmotsavam Will Be Held October 7 To Oct 15 2021 | Sakshi
Sakshi News home page

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

Published Wed, Oct 6 2021 6:12 PM | Last Updated on Wed, Oct 6 2021 9:06 PM

Tirumala Srivari Brahmotsavam Will Be Held October 7 To Oct 15 2021 - Sakshi

సాక్షి, తిరుపతి:  తిరుమల తిరుపతి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 7 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా టీటీడి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబర్ 7 నుంచి 15 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగుతాయని, అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు బుధవారం తెలిపారు.

నేడు అంకురార్పణ చేయగా, రేపు ధ్వజారోహణం కార్యక్రమం జరుగుతుందన్నారు. శ్రీ వారి వాహన సేవలు ఉదయం 9 నుంచి 10 గంటలు, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో స్వర్ణ రథం, తేరు కూడా ఉండవని అన్నారు. 

సర్వభూపాల వాహన నిర్వహణ ఉంటుందని చెప్పారు. బ్రహ్మోత్సవాలలో ఆగమోత్తంగా కైంకర్యాలు నిర్వహించనున్నారు. భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీ నుంచి లైవ్, ఇతర చానల్ లింక్స్‌ కూడా ఏర్పాటు చేయనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చక్రస్నాన మహోత్సవం కూడా ఆలయంలోని అయిన మహల్‌లో నిర్వహించనున్నారు. 

బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడ వాహనం రోజున ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించనున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో సీఎం జగన్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలు.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ అలిపిరి వద్ద నూతనంగా నిర్మించిన గోమందిరాన్ని ప్రారంభింస్తారు. పాత బర్డ్‌ హాస్పిటల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. వీటితో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ కన్నడ, హిందీ భాషలలో ప్రారంభించనున్నారు. తిరుమలలో స్వామివారి ప్రసాదాల తయారీకి నూతనంగా నిర్మించిన బూందీ పోటు నిర్మాణాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు. 


చదవండి: Seshachalam Hills: ట్రెక్కింగ్‌కు పెరుగుతున్న ఆదరణ

.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement