sri vari temple
-
కరీంనగర్లో శ్రీవారి ఆలయం.. టీటీడీ ఆధ్వర్యంలో రూ.20 కోట్లతో..
కరీంనగర్: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కరీంనగర్ లో కొలువుదీరనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం కేసీఆర్ కరీంనగర్లో 10 ఎకరాల స్థలాన్ని టీటీడీ ఆలయానికి కేటాయించారు. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కరీంనగర్ టీటీడీ ఆలయ నిర్మాణ అనుమతి పత్రాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, టీటీడీ తెలంగాణ లోకల్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ జి.భాస్కర్రావులకు అందజేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో కరీంనగర్ పట్టణంలో రూ.20 కోట్ల వ్యయంతో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. అదే రోజు శ్రీవేంకటేశ్వరుని కళ్యాణోత్సవం ఈనెల 31న ఉదయం 7.26 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణలతో నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం అదే ప్రాంగణంలో సాయంత్రం నుంచి ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు అందించేలా శ్రీవేంకటేశ్వరుని కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామన్నారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, త్వరలోనే వినోద్‌రావు, భాస్కర్‌రావుతో కలిసి తిరుమలకు వెళ్తామని, ఆగమశాస్త్రం ప్రకారం కరీంనగర్ పద్మనగర్‌లో నిర్మించే శ్రీవేంకటేశ్వరసామి ఆలయం అంతరాలయం, గోపురాలు, బాహ్యాలయ నిర్మాణాల నమూనాలతో పాటు మూల విరాట్, పోటు, ప్రసాద వితరణ కేంద్రం తదితర అంశాలను పరిశీలిస్తామని చెప్పారు. చదవండి: 16 బోగీలతో సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్.. ఎప్పటి నుంచి అంటే? -
శ్రీవారికి బంగారు వరద–కటి హస్తాలు విరాళం
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి సుమారు రూ.3 కోట్లు విలువ చేసే బంగారు వరద–కటి హస్తాలను పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ భక్తుడు శుక్రవారం విరాళంగా అందించారు. వజ్రాలు, కెంపులు పొదిగిన దాదాపు 5.3 కిలోల బరువున్న ఈ బంగారు వరద–కటి హస్తాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి దాత అందజేశారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: టీటీడీ చైర్మన్
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 7 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా టీటీడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబర్ 7 నుంచి 15 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగుతాయని, అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు బుధవారం తెలిపారు. నేడు అంకురార్పణ చేయగా, రేపు ధ్వజారోహణం కార్యక్రమం జరుగుతుందన్నారు. శ్రీ వారి వాహన సేవలు ఉదయం 9 నుంచి 10 గంటలు, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో స్వర్ణ రథం, తేరు కూడా ఉండవని అన్నారు. సర్వభూపాల వాహన నిర్వహణ ఉంటుందని చెప్పారు. బ్రహ్మోత్సవాలలో ఆగమోత్తంగా కైంకర్యాలు నిర్వహించనున్నారు. భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీ నుంచి లైవ్, ఇతర చానల్ లింక్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చక్రస్నాన మహోత్సవం కూడా ఆలయంలోని అయిన మహల్లో నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడ వాహనం రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించనున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలు.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ అలిపిరి వద్ద నూతనంగా నిర్మించిన గోమందిరాన్ని ప్రారంభింస్తారు. పాత బర్డ్ హాస్పిటల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. వీటితో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ కన్నడ, హిందీ భాషలలో ప్రారంభించనున్నారు. తిరుమలలో స్వామివారి ప్రసాదాల తయారీకి నూతనంగా నిర్మించిన బూందీ పోటు నిర్మాణాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు. చదవండి: Seshachalam Hills: ట్రెక్కింగ్‌కు పెరుగుతున్న ఆదరణ . -
శ్రీవారి ఆలయంలో అర్చకుల నియామకం చేపట్టిన టీటీడీ
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ అర్చకుల నియామకం చేపట్టింది. శ్రీవారి ఆలయంలో 2007 తర్వాత ఈ ఏడాది అర్చకుల నియామకం జరిగింది. మీరాశి వంశానికి చెందిన 8 మందికి శ్రీవారి కైంకర్యాలు చేసే అవకాశం టీటీడీ కల్పించింది. కాగా మీరాశి వంశీకుల్లో నూతన తరానికి శ్రీవారి ఆలయంలో అర్చకత్వం చేసే భాగ్యం లభించింది. ఈ క్రమంలో నేడు నియమితలైన 8 మంది అర్చకులు శ్రీవారికి పాదసేవ చేశారు. అనంతరం ఈ అదృష్టం కల్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వాళ్లు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన అర్చకులు కృష్ణ శేషచల దీక్షితులు మాట్లాడుతూ.. శ్రీవారి అర్చకులకు మరపురాని రోజని అన్నారు. వంశపారంపర్యం కొనసాగిస్తూ మా పిల్లలకు కైంకర్యాలు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇందుకు కారణమైనా సీఎం జగన్మోహన్రెడ్డికి, టీటీడీ పాలకమండలికి ధన్యవాదాలు తెలిపారు. కాగా నేడు మూడు కుటుంబాల నుంచి 8 మంది అర్చకులు బాధ్యతలు చేపట్టారు. నూతన అర్చకులు అందరు కూడా రెగులరైజ్ ఉద్యోగులగా బాధ్యతలు చేపట్టారు. చదవండి: టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్‌గా జవహర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం -
మంచుతెరల్లో మహిమాన్వితుడు
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కోసం ముస్తాబయ్యే తిరుమల పరిసరాలను చూడడానికి రెండు కళ్లూ సరిపోవు. సుగంధభరిత పుష్పాలు, విద్యుద్దీపాలతో ఇలవైకుంఠాన్ని తలపించే ఆ పరిసరాలకు ఆదివారం తెల్లవారుజామున ప్రకృతి మంచు తెరలతో మరిన్ని వన్నెలద్దింది. దీంతో ఆ మంచు తెరల్లోనుంచి దేదీప్యమానంగా వెలుగుతున్న శ్రీవారి ఆలయం భక్తులను ఆనందపారవ శ్యంలో ఓలలాడించింది. శ్రీవారి పుష్కరిణి సైతం కొత్త శోభను సంతరించుకుంది. చక్రస్నానం సందర్భంగా పుష్కరిణి వద్దకు వచ్చిన భక్తులు మహదానందంతో పుణ్యస్నానాలు ఆచరించారు. -సాక్షి, తిరుమల -
బంజారాహిల్స్‌లో శ్రీవారి ఆలయం
రూ. 12 కోట్లతో నిర్మాణం హైదరాబాద్‌కు టీటీడీ వరాలు సాక్షి, తిరుమల: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న టీటీడీ స్థలంలో రూ.28 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఇందులో రూ.12 కోట్లతో శ్రీవారి ఆలయం, రూ.4.7 కోట్లతో వినాయకుడి ఆలయం, రూ.9.2 కోట్లతో పోటు, ప్రహరీ గోడ నిర్మాణం, శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ ఉప కార్యాలయం నిర్మించాలని తీర్మానించింది. చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్ నేతృత్వంలో శనివారం ఇక్కడి అన్నమయ్య భవన్ అతిథి గృహంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 11న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా కాలినడకన వచ్చే భక్తులందరికీ ఉచితంగా ఒక్కో లడ్డూ పంపిణీ. అదే రోజు నుంచి తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం, విష్ణు నివాసంలో రెండు పూటలా ఉచిత అన్న ప్రసాదం పంపిణీ. వచ్చే ఏడాది 44 వేల ఆలయాల్లో ఐదో విడత మనగుడి కార్యక్రమం నిర్వహణ. రూ.12.63 కోట్లతో 4.5 లక్షల కిలోల ఆవు నెయ్యి, రూ.1.15 కోట్లతో 4.4 లక్షల కిలోల రవ్వ కొనుగోలుకు అనుమతి. తిరుమలలో 30 ఎకరాల్లో విస్తరించిన శ్రీగంధం వనంలో రూ.5 కోట్లతో ప్రహరీ గోడ నిర్మాణం, డ్రిప్ ఇరిగేషన్ తదితర అభివృద్ధి పనులు. తిరుమలలో నిత్యాన్న ప్రసాదానికిచ్చే బియ్యంపై మార్కెట్ రేటుకన్నా కిలోకు 50 పైసలు తక్కువగా అందిస్తామని ఏపీ రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ చెప్పడాన్ని సభ్యులు ప్రశంసించారు. చెన్నైలోని టీటీడీ లోకల్ అడ్వరుుజరీ కమిటీని మరో రెండేళ్లు కొనసాగించేందుకు తీర్మానం. గంగాధర్‌కు రూ.40 లక్షల చెక్కు అందజేత సంపూర్ణ భగవద్గీతను ఆలపించిన భగవద్గీత ఫౌండేషన్ నిర్వాహకుడు, గాయకుడుగంగాధర్కు శనివారం రూ.40 లక్షల చెక్కును చైర్మన్, ఈవో అందజేశారు. దీనితో సీడీలు రూపొందించి ప్రచారం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సీడీ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. లడ్డూ నాణ్యత పెంపు భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా స్వీకరించే తిరుమల లడ్డూ నాణ్యత పెరిగింది. 175 గ్రాముల బరువుండే లడ్డూ తయారీలో వాడే ముడి సరుకుల దిట్టాన్ని పెంచకుండానే వస్తువుల నాణ్యత, తయారీ విధానంలో మెరుగైన మార్పు చేశారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ముంతమామిడి, శనగపప్పు, ఎండుద్రాక్ష, యాలకులు, ఇతర ముడిసరుకులు వినియోగించేలా చర్యలు తీసుకున్నారు. ముడి సరుకులు నిల్వ చేసే పద్ధతుల్లో కూడా మార్పులు చేశారు. దీనిని ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రదర్శించారు. వాటిని రుచిచూసిన వారు లడ్డూలో నాణ్యత పెరిగిందని, రుచి కూడా మారిందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విధంగా తయారు చేసిన లక్ష లడ్డూలను భక్తులకు కూడా విక్రయించారు. కాగా, జనవరి 1, వైకుంఠ ఏకాదశి పర్వదినాన పరిమిత సంఖ్యలోనే వీఐపీ పాసులు కేటాయిస్తామని చైర్మన్, ఈవో తెలిపారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. కాగా, శ్రీవారి ఆలయంలో ఒకసారి 5,100 లడ్డూలు తయారు చేయడానికి మొత్తం 852 కేజీల ముడి సరుకుల్ని దిట్టం కింద వినియోగిస్తారు. ఇందులో 185 కిలోల ఆవు నెయ్యి, 200 కిలోల శనగపిండి , 400 కిలోల చక్కెర, 35 కిలోల ముంత మామిడిపప్పు, 17.5 కిలోల ఎండు ద్రాక్ష, 10 కిలోల కలకండ, ఐదు కిలోల యూలకులు వినియోగిస్తారు. శ్రీవారి లడ్డూ పోలిన లడ్డూను మరొకరు తయారు చేయకుండా ఉండేందుకు చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ చట్టం కింద తిరుమల లడ్డూకు ప్రత్యేకమైన భౌగోళిక గుర్తింపు నమోదు చేశారు. అయితే, పెరుగుతున్న ధరల వల్ల ముడిసరుకులు వినియోగంలో కచ్చితమైన దిట్టాన్ని వినియోగించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీనివల్ల లడ్డూ నాణ్యత, రుచి తగ్గిందని భక్తుల నుంచి ఆరోపణలు వచ్చారుు. ప్రత్యేక భౌగోళిక గుర్తింపు కింద నమోదు చేసిన లడ్డూలో వినియోగించే ముడిసరుకుల దిట్టం కూడా పొందు పరచడంతో, ఆ దిట్టాన్ని మార్చితే సాంకేతిక సమస్యలు వస్తాయని టీటీడీ చెబుతోంది.