
తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు మంగళవారం భారీగా భక్తులు తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రత్యేక దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది.
ఇక, మంగళవారం శ్రీవారిని 69,937మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక, స్వామివారికి 22,978 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.58 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment