TTD devotees
-
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు 20 కాంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం పొందడానికి సుమారు 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఒక ప్రకటనలో వెల్లడించింది.రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, 6 కంపార్ట్ మెంట్లలో టైమ్ స్లాట్ ఎస్ ఎస్ డీ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు 4 గంటల సమయం పడుతుంది. ఆదివారం శ్రీవారిని 85,935 మంది భక్తులు దర్శించుకోగా, 31,222మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.21 కోట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు 15 నుంచి
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 14న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.పవిత్రోత్సవాలు తిరుమలలో 1516 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 15న పవిత్రాల ప్రతిష్ట, ఆగస్టు 16న పవిత్ర సమర్పణ, ఆగస్టు 17న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఆర్జితసేవలు రద్దుపవిత్రోత్సవాల్లో ఆగస్టు 14న అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్ధు చేసింది. అదేవిధంగా, ఆగస్టు 15న తిరుప్పావడతోపాటు ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి. తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు తిరుమల ఘాట్ రోడ్డులో రాత్రి వేళ టూవీలర్లకు ప్రవేశంపై నిషేధం విధించారు. సెప్టంబరు 30వ తేదీ వరకూ ఈ నిషేధాజ్ఞలు విధించారు. వర్షాలు కురుస్తుండటంతో పాటు అడవిలో ఉన్న చిరుతపులులు రహదారులపైకి వచ్చే అవకాశముందని అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు. సెప్టంబరు నాటికి చిరుతపులుల సంచారం ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు తెలిపారు. వన్యమృగాల సంచారం ఎక్కువగా ఉందని అటవీ శాఖ అధికారులు చేసిన సూచనతో ఈ చర్యలు తీసుకుంటున్నారు.వన్యప్రాణుల సంచారంతో...దీంతో తిరుమల ఘాట్ రోడ్డులో రాత్రి తొమ్మిది గంటల తర్వాత టూ వీలర్లను అనుమతించకూడదని నిర్ణయించారు. అలాగే కాలినడకన తిరుమలకు చేరుకునే భక్తుల విషయంలో రక్షణ చర్యలు పెంచాలని డిసైడ్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా తిరుమల కొండకు చేరుకునే మార్గంలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించామని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు తమకు సహకరించాలని కోరారు. వచ్చే దారి, వెళ్లే దారిలో కూడా వాహనాలను అనుమతించరు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ మాత్రమే ద్విచక్ర వాహనాలను కొండపైకి అనుమతిస్తారు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీతిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 24 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు . నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,728 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 29,611 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.66 కోట్లు సమర్పించారు. సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంట సమయం పడుతుంది -
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట ATGH వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు . శనివారం అర్ధరాత్రి వరకు 79,313 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 39,344 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.65 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 15 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 6 గంటల సమయం.దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలలో అనుమతించారని స్పష్టం చేసింది. -
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 63,095 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,127 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.72 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన భక్తులను అనుమతించమని వెల్లడించింది. -
Tirumala : శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా..2 గంటల సమయం పడుతోంది. నిన్న (ఆదివారం) 75,356 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 21,815 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.90 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 05 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా..4 గంటల సమయం పడుతోంది. నిన్న (శుక్రవారం) 62,540 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 24,241 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.92 కోట్లుగా లెక్క తేలింది. -
Aug 02: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 18 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. నిన్న (గురువారం) 61,465 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 21,206 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.66 కోట్లుగా లెక్క తేలింది. -
TTD : తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే
తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా..4 గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) 67,916 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 23,010 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.93 కోట్లుగా లెక్క తేలింది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..
తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు మంగళవారం భారీగా భక్తులు తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రత్యేక దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది.ఇక, మంగళవారం శ్రీవారిని 69,937మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక, స్వామివారికి 22,978 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.58 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. -
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం
తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు మంగళవారం భారీగా భక్తులు తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 12 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రత్యేక దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది.ఇక, సోమవారం శ్రీవారిని 65,874మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక, స్వామివారికి 23,782 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.48 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. -
తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 18 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 61,499 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,789. మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.14 కోట్లు ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది. నేడు విఐపీ దర్శనాలు రద్దు తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 19న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పేరుతో ఆలయ శుద్ధి కార్యక్రమం, సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఉదయం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించిన టిటిడి. కొత్త వస్త్రంతో స్వామివారిని పూర్తిగా కప్పి వేసి గర్భగుడిని, పూజా సామాగ్రిని సుగంధ ద్రవ్యాల లేపనంతో శుద్ది చేశారు. తిరుమంజనం సందర్భంగా అష్టదళ పాద పద్మ ఆరాధన సేవ రద్దు. 23 న వైకుంఠ ఏకాదశి, టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ అనాదిగా వస్తున్న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాము అన్నారు. -
కనరో భాగ్యము.. గత 70 ఏళ్లలో ఎన్నో మార్పులు
తిరుమల: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. కొలిచిన వారి కొంగు బంగారం కోనేటి రాయుడి దివ్యమంగళ దర్శనానికి భక్తజన కోటి పోటెత్తుతోంది. ఒకప్పుడు రోజుకు వందల్లో వచ్చే భక్తులు.. ఇప్పుడు వేల సంఖ్యకు చేరుకున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల తాకిడికి అనుగుణంగా స్వామివారి దర్శన విధానాల్లో మార్పులు చేస్తూ వస్తున్నారు. గతంలో ప్రతి భక్తుడూ కులశేఖర పడి వరకు వెళ్లి స్వామివారిని దర్శించుకునేవారు. ఇప్పుడు దాదాపుగా జయవిజయల గడప నుంచే స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. గత 70 ఏళ్లుగా శ్రీవారి దర్శన విధానంలో జరుగుతున్న మార్పులపై కథనం.. 1950 నుంచి భక్తుల సంఖ్యలో పెరుగుదల ఇలా.. ►1950 ఏడాది మొత్తంలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 2 లక్షల 26 వేల మంది మాత్రమే. అంటే సగటున రోజుకి 619 మంది. ►1960కి ఈ సంఖ్య 11 లక్షల 67 వేలకు చేరింది. అప్పట్లో సగటున రోజుకు 3,197 మంది స్వామివారిని దర్శించుకున్నారు. ►1970లో భక్తుల సంఖ్య ఏడాదికి 33 లక్షల 94 వేలకు చేరింది. ఈ లెక్కన రోజుకి 9,299 మంది దర్శించుకున్నారు. ►1980లో ఏడాది కాలానికి 79 లక్షల 52 వేల మంది శ్రీవారిని దర్శించుకోగా, రోజువారీగా భక్తుల సంఖ్య 21,786కి చేరుకుంది. ►1990లో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏడాదికి కోటి దాటింది. 1990 ఏడాదిలో 1.18 కోట్ల మంది.. అంటే నిత్యం సరాసరి 32,332 మంది స్వామివారిని దర్శించుకున్నారు. ►2000 సంవత్సరంలో 2 కోట్ల 37 లక్షల 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. రోజువారీ భక్తుల సంఖ్య 65 వేలకు చేరింది. ►2010 ఏడాదిలో స్వామిని దర్శించుకుంది 2 కోట్ల 55 లక్షల మంది కాగా.. నిత్యం 70 వేల మంది భక్తులకు స్వామి దర్శనభాగ్యం లభించింది. ►2020కి భక్తుల సంఖ్య 2 కోట్ల 70 లక్షలకు చేరింది. రోజువారీగా స్వామిని దర్శించుకునే వారి సంఖ్య 75 వేలకు పెరిగింది. శ్రీవారి దివ్యమంగళరూపాన్ని అతి దగ్గర నుంచి దర్శించుకోవాలని భక్తులు పరితపిస్తుంటారు. భక్తుల సంఖ్య పరిమితంగా ఉండటంతో 1992 వరకు శ్రీవారిని కులశేఖరపడి నుంచి దర్శించుకునే సౌలభ్యం కల్పించారు. ఇప్పుడు స్వామివారిని దాదాపు 50 అడుగుల దూరం నుంచే దర్శించుకోవాల్సి వస్తోంది. ఈ విధంగా భక్తుల రద్దీకనుగుణంగా దర్శన విధానంతో పాటు క్యూలైన్ విధానంలోనూ టీటీడీ మార్పులు చేస్తూ వచ్చింది. దర్శనం, క్యూలైన్ విధానాల్లో మార్పులు ఇలా.. ►1950లో భక్తులు మహాద్వారం నుంచే నేరుగా ఆలయంలోకి ప్రవేశించే సౌలభ్యం ఉండేది. ►1970లో రోజువారీ భక్తుల సంఖ్య వందల నుంచి వేలకు చేరింది. పీపీసీ షెడ్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించడం టీటీడీ ప్రారంభించింది. ►1984 వచ్చే సరికి రోజువారీ భక్తుల సంఖ్య 30 వేల దాకా చేరుకోవడంతో ఆ ఏడాది మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ►1992 వరకు భక్తులందరినీ కులశేఖరపడి వరకు అనుమతిస్తూ వచ్చిన టీటీడీ 1992 డిసెంబర్లో లఘు దర్శన విధానాన్ని ప్రవేశపెట్టింది. ►2001లో రోండో క్యూ కాంప్లెక్స్‌ని నిర్మించారు. ఏడాదిలో దాదాపుగా 150 రోజుల పాటు క్యూలైన్ వెలుపలికి భక్తులు వస్తుండటంతో 2014లో నారాయణగిరి ఉద్యానవనంలో కూడా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ►2005 నాటికి భక్తుల తాకిడి అన్యూహంగా పెరగడంతో మహాలఘు దర్శనాన్ని ప్రవేశపెట్టారు. జయవిజయల గడప నుంచే భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. ►2014లో మహాలఘు విధానంలోనే మూడు వరుసల క్యూలైన్ ప్రవేశపెట్టారు. ఆగమశాస్త్రం ప్రకారం క్యూలైన్ విధానంలో మార్పులు చేసే వెసులుబాటు లేకపోవడంతో టీటీడీ ప్రస్తుతం భక్తులు క్యూలైన్లో వేచి ఉండే అవసరం లేకుండా ఏర్పాట్లు చేయడంపై దృష్టిసారించింది. అందులో భాగంగానే ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను ఆన్లైన్ విధానంలో కేటాయిస్తూ.. కేటాయించిన సమయానికి భక్తులు క్యూలైన్ వద్దకు చేరుకుంటే 2 నుంచి 3 గంటల్లో స్వామివారి దర్శనం కల్పిస్తోంది. సర్వదర్శనం భక్తులకు ఇదే తరహాలో టోకెన్లు జారీ చేసే విధానాన్ని అమలులోకి తీసుకువచ్చినా.. పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోవటంతో ప్రస్తుతం ప్రత్యామ్నాయంపై టీటీడీ దృష్టి సారించింది. -
తిరుమల భక్తులపై కేసులు నమోదు
తిరుమల: ఏడు కొండలపై కొలువైన శ్రీ కల్యాణ వెంకన్నను దర్శించుకుందామని వచ్చిన భక్తులపై కేసులు నమోదైయ్యాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులు టీటీడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ గోడు పట్టించుకోకుండా వీఐపీలకు పెద్దపీట వేస్తున్నారని ఆరోపిస్తూ భక్తులు జేఈవో కార్యలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ ఘటనకు వారిపై కేసులు నమోదైయ్యాయి. తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్ లో భక్తులపై కేసులు నమోదు చేశారు. -
తిరుమలలో నరకం చూసిన భక్తులు
సాక్షి, తిరుమల: వేంకటేశుని దర్శనం కోసం వచ్చిన భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ మరోసారి ఘోరంగా విఫలమైంది. అసలే సంక్రాంతి సెలవులు. ఆపై శని, ఆదివారాల్లో ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు. ఈ సందర్భంగా భక్తులు పోటెత్తుతారని తెలిసి కూడా టికెట్లు మొదలుకుని బస దాకా ఏ ఏర్పాట్లూ సజావుగా చేయలేక పూర్తిగా చేతులెత్తేసింది. షరామామూలుగా వీఐపీల సేవలో తరించి సామాన్యులను గాలికొదిలింది. దాంతో భక్తులు శుక్రవారం అక్షరాలా నరకం చవిచూశారు. గోవింద నామస్మరణతో మారు మోగాల్సిన తిరుమల కొండలు రోజంతా వారి ఆర్తనాదాలు, నినాదాలు, ధర్నాలతో హోరెత్తిపోయాయి. సీఆర్వో కార్యాలయం వద్ద వందలాది మంది గదుల కోసం ఆందోళన చేశారు. గదులన్నిటినీ వీఐపీలకే కేటాయిస్తున్నారంటూ టీటీడీపై దుమ్మెత్తి పోశారు. వీఐపీ పాసుల పేరుతో దర్శనాల వ్యాపారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మంత్రి పార్థసారథిని అడ్డుకుని నిరసన తెలిపారు. టీటీడీతో పాటు విజిలెన్స్, పోలీసు తదితర విభాగాలన్నీ విధి నిర్వహణలో విఫలమయ్యాయి. సర్వం అస్తవ్యస్తం: వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన సామాన్య భక్తులకు టీటీడీ నరకం చూపించింది. కాలిబాట భక్తులు టికెట్ల కోసం పడరాని పాట్లు పడ్డారు. ఏకాదశి, ద్వాదశి దర్శనం కోసం అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో 40 వేల మందికే దివ్యదర్శనం టికెట్లు కేటాయించారు. ఇందులో ఏకాదశికి 20 వేలు, ద్వాదశికి 20 వేలు కేటాయించారు. ఉదయం 10 గంటలకే అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో టికెట్ల మంజూరు ఆరంభించారు. అంతకుముందు నుంచే రెండుచోట్లా తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. కాలిబాట దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఎలాగైనా టికెట్లు పొందేందుకు భక్తులు ప్రధాన రహదారులను వదిలి అడవుల్లోని ముళ్ల పొదల గుండా క్యూలైన్ల వద్దకు చేరుకున్నారు. కొందరు కాలిబాట పైకప్పుల మీదుగా నడిచివచ్చి, మరికొందరు చెట్లెక్కి లైన్లలోకి చొరబడటంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. భద్రతా సిబ్బంది చేతులెత్తేశారు. పైగా ఏకాదశి టికెట్లు మధ్యాహ్నం 2, ద్వాదశి టికెట్లు 4 గంటల్లోపే అయిపోవడంతో సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు. క్యూ లైన్లను, గేట్లను విరిచేశారు. ఆ తర్వాత వచ్చిన భక్తులు తిరుమలకు చేరుకుని అడుగడుగునా ఆందోళనలు, బైఠాయింపులతో నిరసన వ్యక్తం చేశారు. 100 ఎంపీలు,ఎమ్మెల్యేలు.. జడ్జిలు వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం కోసం వీఐపీలు వందలాదిగా తిరుమలకు క్యూ కట్టారు. వారికి టీటీడీ ఎర్రతివాచీ పరచింది. బస, దర్శనాల్లో ఎక్కడా లోటు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికే పార్థసారథి, పొన్నాల లక్ష్మయ్య, ఏరాసు ప్రతాపరెడ్డి, డీకే అరుణ సహా పది మంది మంత్రులు, 100 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సుప్రీంకోర్టు, దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల న్యాయమూర్తులు, 200 మంది దాకా కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు, సినీ నటులు దర్శనం చేసుకున్నారు. వీఐపీల కోసం టీటీడీ ఏకంగా 10 వేలకు పైగా పాసులను, 6,000 పైచిలుకు గదులను ముందుగానే బ్లాక్ చేసి పెట్టింది.