![Tomatoes worth Rs 3 lakh to Konaseema District - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/17/tomato.jpg.webp?itok=WFsoNSdC)
పుంగనూరు: రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు కోనసీమలోని వరద బాధితుల కోసం రూ.3 లక్షల విలువ చేసే టమాటాలు విరాళంగా పంపించారు. శనివారం ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి ఆధ్వర్యంలో టమాటా మండి వ్యాపారులంతా ప్రత్యేక లారీలో టమాటాలను తరలించారు.
చైర్మన్ నాగరాజారెడ్డి మాట్లాడుతూ సుమారు 270 బాక్సుల టమాటాలను అందరి సహకారంతో వరద బాధితులకు పంపిణీ చేసేందుకు తరలించామన్నారు. టమాటా మండి వ్యాపారులు రెడ్డెప్పరెడ్డి, రాజారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఆర్టీసీ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు జయరామిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment