![Triple IT students into Guinness Book of World Records - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/21/iiit.jpg.webp?itok=ARngGig_)
విద్యార్థులతో డైరెక్టర్ సంధ్యారాణి
వేంపల్లె: కూచిపూడి ప్రదర్శన చేసిన ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కిందని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కె.సంధ్యారాణి తెలిపారు. చెన్నై త్యాగరాజ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చెన్నైలో ఈనెల 16, 17 తేదీల్లో జరిగిన మహా బృంద నాట్య ప్రదర్శనలో పి.తేజేశ్వని, సి.సుష్మిత, కె.దివ్య, కె.ప్రియాంకసాయి, బి.పూజ, సి.తేజద్వీప్, చంద్రశేఖర్, అర్చన, దుర్గ, యశ్వంత్‌కుమార్ పాల్గొని రికార్డుకెక్కినట్లు ఆమె తెలిపారు.
గిన్నిస్ రికార్డుతో పాటు ఇండియా రికార్డు, మార్యెటాస్ రికార్డు, హైరేంజ్ రికార్డు, ఫెంటాస్టిక్ రికార్డులు దక్కించుకున్నారని వెల్లడించారు. విద్యార్థులను డైరెక్టర్ సంధ్యారాణితో పాటు ఏవో కొండారెడ్డి, ట్రిపుల్ ఐటీ కూచిపూడి అధ్యాపకులు మొహిద్దీన్ ఖాన్, అధ్యాపక బృందం అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment