Triple IT students
-
నేటి 'సీఎం'ను ఆనాడు రానివ్వనేలేదు!
ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ఐటీ అంటే రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలిసిందే.. ఇక్కడ చదివే పిల్లల ఇబ్బందులు, ఆందోళనలు, నిరసనలు ఇలా ఎదో ఒక విషయంలో ట్రిపుల్ఐటీ ఎప్పుడు వార్తల్లో నిలిచేది. బాసరలో 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ట్రిపుల్‌ఐటీని ప్రారంభించారు. కొన్నేళ్లుగా ఇక్కడి విద్యార్థులు సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేక సమస్యలు పరిష్కారం కాక ఇప్పటికీ అక్కడ చదివే విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ రహస్య క్యాంపస్‌గా మారింది. మీడియాకు, విద్యార్థి సంఘాలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, మేధావులకు ఎవరైనా సరే లోపలికి అనుమతించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు చదివే ఈ విశ్వవిద్యాలయంలో ఏమి జరుగుతుందోనని తెలియక పోషకులు ఆందోళనకు గురవుతున్నారు. మీడియాకు నో ఎంట్రీ 2022 ఆగస్టు 7న బాసర ట్రిపుల్ఐటీకి గవర్నర్ హోదాలో తొలిసారి వచ్చిన తమిళిసై పర్యటన కవరేజీకి వెళ్లిన మీడియాను అధికారులు అనుమతించ లేదు. ట్రిపుల్ఐటీ ప్రధాన ద్వారాన్ని మూసివేసి ఉంచారు. మీడియాతో పాటు ఉదయం వేళ ట్రిపుల్‌ఐటీలో పనిచేసే సిబ్బందిని కూడా అనుమతించ లేదు. గవర్నర్ బాసర ట్రిపుల్ఐటీ నుంచి నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీకి వెళ్లే సమయంలో ప్రధాన ద్వారం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడే మీడియాతో గవర్నర్ తమిళసై మాట్లాడారు. ఇప్పటికై నా మారేనా? నాటి ప్రభుత్వంలో బాసర ట్రిపుల్‌ఐటీలో ఆంక్షలపేరుతో ఎవరిని అనుమతించలేదు. డిసెంబర్ 7న తెలంగాణ సీఎంగా పదవీ ప్రమాణం స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చారు. ప్రజాభవన్‌గా మార్చి అక్కడే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో మాత్రం నేటికి పాత ఆంక్షలే కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా కల్పించడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా బాసర ట్రిపుల్ ఐటీకి వచ్చి సమస్యలు తెలుసుకుని శాశ్వత పరిష్కారానికి మార్గం చూపుతారని ఇక్కడి విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తీరిక లేక.. విద్యార్థులకు ప్రతీరోజు క్రీడలు ఆడుకునేలా షెడ్యూల్ ఉంచాలి. ఉదయం నిద్రలేవగానే రాత్రి పడుకునే వరకు స్నానాలు, భోజనాలు, తరగతి గదులు వీటితోనే రోజు పూర్తి అవుతుంది. క్రీడల్లో ఉన్న విద్యార్థులు మానసిక ఒత్తిడికి కాస్త దూరమవుతారు. వారంలో ఒక్కరోజైన చెవులకు ఇంపైనా సంగీతం, వినోద కార్యక్రమాలు తిలకించే ఏర్పాట్లు చేయాలి. అవేవి ఇక్కడ జరగడం లేదు. విద్యార్థుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సైకాలజిస్టులతో కౌన్సెలింగ్‌లు ఇప్పిస్తూ మానసికస్థితిని తెలుసుకోవాలి. ఒంటరిగా ఉండే విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులను పిలిచి గతంలో ఎలా ఉండేవారు. ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనే విషయాలను చర్చించాలి. ఇకనైనా విద్యార్థులపై శ్రద్ధ వహించాలని పలువురు కోరుతున్నారు. నేటి సీఎంకు అప్పట్లో నో ఎంట్రీ.. నేటి సీఎం రేవంత్‌రెడ్డికే అప్పట్లో బాసర ట్రిపుల్‌ఐటీలో అనుమతించలేదు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు గోడ దూకివచ్చిన పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ గేటుద్వారా బయటకు పంపించారు. ప్రస్తుతం ఆయన సీఎంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని విద్యార్థులు భావిస్తున్నారు. ఇవి చదవండి: పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు -
ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య
వైఎస్సార్: ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ అర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఎన్.గంగరామ్ (21) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. లింగాల మండలం తేర్నాంపల్లి గ్రామానికి చెందిన ఎన్.గంగాధర్, నారాయణమ్మ దంపతులు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఎన్.గంగరామ్ ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. చిన్నకుమారుడు గౌరిశంకర్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం భోజనానంతరం తోటి విద్యార్థులు తరగతి గదులకు వెళ్లగా.. గంగరామ్ క్యాంపస్‌లోని హాస్టల్ గదిలో ఉండి, ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 4 గంటల ప్రాంతంలో పక్కగదిలో ఉన్న విద్యార్థి తలుపు తట్టగా ఎంతసేపటికీ పలకకపోవడంతో వెనుక ఉన్న కిటికీ నుంచి తొంగిచూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే ట్రిపుల్ ఐటీ అధికారులకు విద్యార్థులు తెలియజేశారు. పోలీసులు, ట్రిపుల్ ఐటీ అధికారులు, డైరెక్టర్ సంధ్యారాణి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫ్యాన్‌కి వేలాడుతున్న గంగారామ్‌ను కిందికి దించి ట్రిపుల్ ఐటీలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో ఆందోళన విరమించిన విద్యార్థులు
-
గిన్నిస్‌బుక్‌లోకి ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
వేంపల్లె: కూచిపూడి ప్రదర్శన చేసిన ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కిందని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కె.సంధ్యారాణి తెలిపారు. చెన్నై త్యాగరాజ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చెన్నైలో ఈనెల 16, 17 తేదీల్లో జరిగిన మహా బృంద నాట్య ప్రదర్శనలో పి.తేజేశ్వని, సి.సుష్మిత, కె.దివ్య, కె.ప్రియాంకసాయి, బి.పూజ, సి.తేజద్వీప్, చంద్రశేఖర్, అర్చన, దుర్గ, యశ్వంత్‌కుమార్ పాల్గొని రికార్డుకెక్కినట్లు ఆమె తెలిపారు. గిన్నిస్ రికార్డుతో పాటు ఇండియా రికార్డు, మార్యెటాస్ రికార్డు, హైరేంజ్ రికార్డు, ఫెంటాస్టిక్ రికార్డులు దక్కించుకున్నారని వెల్లడించారు. విద్యార్థులను డైరెక్టర్ సంధ్యారాణితో పాటు ఏవో కొండారెడ్డి, ట్రిపుల్ ఐటీ కూచిపూడి అధ్యాపకులు మొహిద్దీన్ ఖాన్, అధ్యాపక బృందం అభినందించారు. -
బిడ్డా.. నేనొచ్చా లేరా
‘బిడ్డా.. నేనొచ్చా లేరా.. ఇప్పుడే కదా నాయనా నాతో మాట్లాడావు. అప్పుడే ఏందిరా ఇది..’ అంటూ ఆ తండ్రి విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఏం కష్టం వచ్చిందో తండ్రి రాకకోసం ఆశగా ఎదురుచూసి.. ఫోన్ లో ‘వచ్చావా నాన్న..’ అంటూనే భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హఠాత్పరిణామానికి అప్పటివరకు కొడుకు కోసం ఆశగా చూసిన తండ్రి నిశ్చేష్టుడైపోయాడు. నూజివీడు ట్రిపుల్ ఐటీ ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఎం.గోపీచంద్ నాయక్ గురువారం ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో కలకలం రేపింది. పొక్కునూరు (చందర్లపాడు): నాన్న రాక కోసం ఆర్తిగా ఎదురుచూశాడు. చివరిగా నాన్నతోనే మాట్లాడాలనుకున్నాడు. మాట్లాడుతూనే మాయమైపోయాడు. భవనం పైనుంచి దూకేశాడు. ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగి‘పోయాడు.’ తోటివారితో స్నేహపూర్వకంగా ఉంటూ.. మృదుస్వభావంతో మెలిగే నూజివీడు ట్రిపుల్ ఐటీ ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం (సివిల్ బ్రాంచి) విద్యార్థి మెగావతు గోపీచంద్‌నాయక్ (20) గురువారం ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరినీ కలిచివేసింది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకుని ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు. ఇంజినీరింగ్ పూర్తిచేసి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి్సన సమయంలో మరణశాసనం రాసుకున్నాడు. కళాశాలకు వచ్చిన కన్నతండ్రిని కడసారి చూడకుండానే మృత్యుకౌగిలికి చేరుకున్నాడు. చదువులో టాప్ గోపీచంద్ హాస్టల్ భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చర్చనీ యాంశమైంది. 2012–13లో చందర్లపాడు జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదివిన గోపీచంద్ 9.3 పాయింట్లు సాధించాడు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు రావడంతో అప్పటి నుంచి అక్కడే చదువుకుంటున్నాడు. రెండు రోజులుగా గోపీచంద్ తల్లిదండ్రులకు, అక్కకు ఫోన్ చేసి గతానికి భిన్నంగా మాట్లాడాడు. ఈ నేపథ్యంలో రూమ్మెట్ కూడా బుధవారం రాత్రి తండ్రి దేవిజనాయక్‌కు ఫోన్ చేసి గోపీచంద్ రెండు రోజులుగా సరిగ్గా ఉండట్లేదని, ఒకసారి వచ్చి వెళ్లమని చెప్పాడు. గురువారం మధ్యాహ్నం కళాశాల గేటు వద్దకు వెళ్లి కుమారుడికి ఫోన్ చేశాడు. ‘వచ్చావా నాన్న..’ అని ఫోన్ లో పలికిన బిడ్డ, ఆ తరువాత ఎంతసేపటికి తన వద్దకు రాకపోవడంతో ఆందోళన చెందాడు. అయితే, అప్పటికే హాస్టల్ భవనం పైనుంచి దూకి ఎవరో ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త వచ్చింది. దీంతో హుటాహుటిన సంఘటనాస్థలానికి వెళ్లి కొడుకు గోపీ మృతదేహాన్ని చూసిన ఆ తండ్రి నిశ్చేషు్టడైపోయాడు. హుటాహుటిన గోపీచంద్‌ను నూజివీడులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు గోపీచంద్ మరణవార్త విని తల్లి దేవి, సోదరి లాకీ బోరున విలపిస్తుండటం చూపరులను కంటతడి పెట్టించింది. కూలీనాలి చేసుకుంటూ, రిక్షా తోలుతూ, కౌలుకు పొలం సాగు చేసుకుంటూ జీవిస్తున్న డేవీజానాయక్ దంపతులు రోదించిన తీరు కుమారుడిపై వారి ప్రేమను తెలియజేసింది. ఒత్తిడే కారణమా? గోపీచంద్ పీయూసీ (ఇంటర్)లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినా త్వరగానే వాటిని పూర్తిచేశాడు. మంచిస్థాయికి చేరుకోవాలి, తోటివారితో స్నేహంగా ఉండాలనే ఆలోచనలో ఉండే గోపీచంద్‌కు షార్ట్‌ఫిల్మ్స్ తీసే అలవాటు ఉంది. అయినా.. మృతికి గల కారణాలు తెలియలేదు. -
రాలిపోయిన విద్యాకుసుమం
ఆ ఇంటి ఆశాజ్యోతి ఆరిపోయింది. వికసించిన విద్యా కుసుమం రాలిపోయింది. ఉన్నత చదువులు చదివి.. చెల్లిని చదివిస్తానన్న ఆ చిన్నారి మాటలు గాలిలో కలసిపోయాయి. రాత్రి ఫోన్ చేసి బాగా చదువుతున్నానని చెప్పిన విద్యార్థిని, ఉదయం ఫోన్ చేసి చనిపోతున్నానని చెప్పడం.. ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం రావడం పెను విషాదంగా మారింది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం చదువుతున్న బూరాడ గ్రామానికి చెందిన డబ్బాడ రమాదేవి(16) ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం రావడంతో కన్నవారు కుప్పకూలిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. రేగిడి: బూరాడ గ్రామానికి డబ్బాడ అప్పలనాయుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఇతని భార్య వరలక్ష్మి గృహిణి. వీరిది నిరుపేద కుటుంబం. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్దమ్మా యి భవాని డైట్ శిక్షణ పూర్తి చేసుకొని రాజాంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. రెండో కూతురు రమాదేవి గత ఏడాది పదో తరగతి రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి 10/10 జీపీఏ సాధించింది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు రావడంతో అక్కడ చేరి మొదటి సంవత్సరం చదువుతోంది. తమ కుమార్తెలు ఉన్నత చదువులు చదువుతుండడంతో తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు. మూడో కుమార్తె రోహిణి రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఈ పిల్లను కూడా ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులు కష్టపడుతూ వస్తున్నారు. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి ఫోన్ చేసిన రమాదేవి తాను సెకెండ్ మిడ్ పరీక్షలకు సిద్ధమవుతున్నానని, ఇప్పటి వరకూ చదివానని తెలిపింది. ఆరోగ్యం పాడవుతుందని, పడుకోవాలని తల్లిదండ్రులు సూచించడంతో ఫోన్ కట్ చేసింది. అయితే రమాదేవి శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరోసారి ఇంటికి ఫోన్ చేసింది. తండ్రి అప్పలనాయుడు ఫోన్ ఎత్తగా తాను రాత్రి 12 గంటల వరకూ చదివిన విషయాలు మరచిపోతున్నానని, ఏమీ గుర్తుండడం లేదని.. చనిపోతాను నాన్న అని చెప్పడంతో ఆందోళన చెందిన అప్పలనాయుడు ఆమెను ఓదార్చి ఇంటి వద్ద ఉన్న పెద్ద కుమార్తె భవానీకి ఫోన్ ఇచ్చాడు. తన చెల్లికి సోదరి నచ్చచెప్పినప్పటికీ వినిపించుకోకుండా రమాదేవి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వారు మరింత ఆందోళనకు గురయ్యారు. ఉదయాన్నే నూజివీడు వెళ్లి రమాదేవిని ఇంటికి తీసుకొచ్చి కొద్ది రోజుల అనంతరం తిరిగి పంపిద్దామని అనుకున్నారు. ఇంతలోనే ఉదయం 7 గంటల సమయంలో ఆమె భవనం పైనుంచి దూకి చనిపోయినట్టు కళాశాల నుంచి ఫోన్ రావడంతో కుటుంబీకులు కుప్పకూలిపోయారు. గ్రామస్తులను విషాదంలోకి నెట్టేసింది. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా ఉంటుందనుకున్న రమాదేవి ఆత్మహత్యకు పాల్పడటాన్ని కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. రమాదేవి తండ్రి అప్పలనాయుడు హుటాహుటిన నూజివీడు పయనమయ్యాడు. – మంచానికే పరిమితమైన తల్లి రమాదేవి తల్లి వరలక్ష్మికి మూడేళ్ల క్రితం నడుం ఆపరేషన్ జరిగింది. అప్పటినుంచి ఆమె ఇంటికే పరిమితమైంది. గత కొన్నాళ్లుగా మంచం పైనే ఉంటుంది తండ్రి అప్పలనాయుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా కాలం నెట్టుకొస్తున్నాడు. వీరి స్వగ్రామం రేగిడి మండలం వండానపేట కాగా పిల్లల చదువు కోసం బూరాడ వచ్చి 20 ఏళ్లు అద్దె ఇంట్లో ఉంటున్నారు. కాగా విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు తదితరులు బూరాడ చేరుకుని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ప్రతిభా అవార్డు రాకపోవడమే కారణమా? ఇదిలా ఉండగా రమాదేవికి ప్రతిభా అవార్డు రాలేదు. ఈ అవార్డు రాలేదని కుటుంబీకులతో గత రెండురోజులుగా చెబుతుండేదని కుటుంబీకులు సాక్షికి తెలిపారు. పదో తరగతిలో 10 జీపీఏ వచ్చినా అవార్డు రాకపోవడంతో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని కుటుంబీకులు భావిస్తున్నారు. -
రోడ్డెక్కిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
వేంపల్లె : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్యలను పరిష్కరించేవరకు ఆందోళనను విరమించేదిలేదని మధ్యాహ్న భోజనం చేయకుండా భీష్మించుకున్నారు. కాగితాలకే పరిమితమవుతున్నాయి కానీ.. సమస్యలు పరిష్కారం కావడం లేదని అధికారులను నిలదీశారు. మెస్‌లో భోజనం సరిగాలేదని.. మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదని ఎన్నిమార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదన్నారు. దోస పిండిలో ఎలుకలు.. సాంబారులో కప్పలు ప్రత్యక్షమవుతున్నాయని సాక్ష్యాదారాలతో చూపించినా అధికారులలో చలనం లేకపోవడం బాధాకరమని తెలిపారు. ఆదివారం రాత్రి ట్రిపుల్ ఐటీలోని కెఎంకే క్యాటరింగ్‌కు చెందిన మెస్‌లో సాంబారులో కప్పలు ప్రత్యక్షమయ్యాయని విద్యార్థులు అధికారులకు స్వయంగా చూపించారు. ఏమాత్రం స్పందించకపోవడంతో ఈ2, ఈ3 విద్యార్థులు ధర్నాకు దిగారు. ఉదయం 11గంటల నుంచి రాత్రి వరకు ధర్నాను కొనసాగించారు. అధికారులు సమస్యను పరిష్కరిస్తామని చెప్పినప్పటికి గతంలో ఇచ్చిన హామిలన్నీ నెరవేర్చితే కానీ ఆందోళనను విరమించమని తేల్చి చెప్పారు. యూనిఫాం, ష్యూస్, క్యాంపస్‌లో లైటింగ్, ఫ్యాకల్టీ, క్లీనింగ్, మెస్‌ల నిర్వహణ తదితర వాటిపై గతంలో వినతి పత్రాలు ఇచ్చామని.. ఏ ఒక్కటీ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. జిల్లా అధికారులు దిగి వచ్చి హామీనిచ్చే వరకు రాజీపడే ప్రసక్తే లేదని భీష్మించుకకూర్చొన్నారు. ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఏవో విశ్వనాథరెడ్డి, ఎఫ్‌వో కె.ఎల్.ఎన్.రెడ్డిలు విద్యార్థులతో చర్చలు జరిపారు. సంబంధిత మెస్‌కు లక్ష రూపాయలు జరిమానా విధిస్తామని.. సూపర్వైజర్ను తొలగిస్తామని హామీనిచ్చినప్పటికి విద్యార్థులు ధర్నాను విరమించే ప్రసక్తేలేదని తెగేసి చెప్పారు. చర్చలు విఫలం కావడంతో ధర్నా యథావిధిగా కొనసాగింది. కడపకు ర్యాలీ వేంపల్లె : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ కేవీ రమణ దృష్టికి తీసుకెళ్లి తామే పరిష్కరించుకుంటామని వేలాది మంది విద్యార్థులు ర్యాలీగా ముందుకు సాగారు. తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ట్రిపుల్ ఐటీ నుంచి పాదయాత్రగాకడపకు బయలుదేరారు. సాయంత్రం 6గంటలవరకు అక్కడ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేశారు. అధికారుల చర్చలు విఫలం కావడంతో కడపకు బయలుదేరారు. ఈ ర్యాలీ రాత్రి 7గంటలకు వీరన్నగట్టుపల్లె క్రాసింగ్ వద్దకు చేరుకుంది. వీరన్నగట్టుపల్లె క్రాసింగ్ వద్ద ధర్నా వేంపల్లె : తమ డిమాండ్ల సాధన కోసం ట్రిపుల్ఐటీ నుంచి ర్యాలీగా వెళుతున్న విద్యార్థులు చీకటి పడటంతో వీరన్నగట్టుపల్లె క్రాస్ వద్ద మరొకసారి ధర్నాకు దిగారు. కలెక్టర్ ఇక్కడికి రావాలని పట్టుబట్టారు. పులివెందుల సీఐ మహేశ్వరరెడ్డి, వేంపల్లె ఎస్ఐ హాసంలతోపాటు పోలీసులు విద్యార్థులను కడపకు వెళ్లనీయకుండా అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అయినప్పటికి విద్యార్థులు ముందుకు సాగారు. కడప, రాయచోటి రోడ్డులలో బైఠాయించారు. ముందుగానే పోలీసు చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ మహేశ్వరరెడ్డి నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
ఈ భోజనం.. తినలేం
⇒ ట్రిపుల్ ఐటీ మెస్‌లో నాసిరకం ఆహారం ⇒ వడ్డనలో గంటలతరబడి జాప్యం ⇒ తరగతులను కోల్పోతున్న విద్యార్థులు ⇒ అధ్వానంగా మార్వెల్ మెస్ నిర్వహణ ⇒ కొరవడిన పర్యవేక్షణ ⇒ ఎమ్మెల్యే పరిశీలనతో వెలుగులోకి నూజివీడు : ఉడికీ ఉడకని అన్నం.. రుచిలేని కూరలు.. నీళ్ల సాంబారు.. నలగని చపాతీలు.. సరిగా కడగని ప్లేట్లు.. నీళ్లలా పెరుగు.. ట్రిపుల్ఐటీ విద్యార్థులు గత నాలుగు రోజులుగా తింటున్న ఆహార పదార్థాలు ఇవి. ఆదివారం ట్రిపుల్‌ఐటీని సందర్శించిన ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు, మున్సిపల్ చైర్పర్సన్ బసవా రేవతి వద్ద విద్యార్థులు తమ గోడు వెళ్లబోసుకోగా వెలుగులోకి వచ్చిన విషయాలు. ఇంత దారుణంగా పెడుతున్నా మెస్ సూపర్వైజర్ గాని, ట్రిపుల్ఐటీ అధికారులు గాని ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ట్రిపుల్‌ఐటీలో గతంలో వెయ్యిమందికి భోజనం తయారుచేసి పెడుతున్న మార్వెల్ మెస్‌కు మరో మూడువేల మంది విద్యార్థులను అప్పగించడం వల్ల నిర్వహణ సరిగా ఉండటం లేదని, దీనివల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. నాలుగు వేల మందికి ఒకేసారి భోజనం పెట్టాలంటే మధ్యాహ్నం 12 గంటలకు మొదలు పెడితే రెండు గంటలు దాటుతోందని వివరించారు. దీంతో చాలా మంది తరగతులకు కూడా వెళ్లలేకపోతున్నామని వాపోయారు. సామర్థ్యం 2 వేలు.. కాంట్రాక్టు 4 వేలు మార్వెల్ సంస్థ నూజివీడు ట్రిపుల్‌ఐటీలో నాలుగువేల మందికి భోజనం అందించేందుకు కాంట్రాక్టును సొంతం చేసుకుంది. రెండువేల మంది సామర్థ్యం కలిగిన మెస్‌లో నాలుగువేల మందికి భోజనం పెడుతుండటం వల్లే విద్యార్థులందరికీ సకాలంలో అందించడం లేదని తెలుస్తోంది. దీంతో విద్యార్థులు తరగతులకు దూరమవ్వాల్సి వస్తోంది. నాసిరకంగా ఆహార పదార్థాలు... తమకు భోజనంలో వడ్డిస్తున్న ఆహార పదార్థాలు కూడా నాసిరకంగా ఉంటున్నాయని విద్యార్థులు ఎమ్మెల్యే ప్రతాప్, చైర్పర్సన్ రేవతి ఎదుట వివరించారు. సరిగా కడగని ప్లేట్లు, ఉడగని అన్నం, నాసిరకం కూరలు, నీళ్లను తలపిస్తున్న సాంబారు, పెరుగు.. అన్నీ నాసిరకంగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నివేల మందికి ఒకేచోట వడ్డిస్తుండటంతో గంటల తరబడి లైన్లో నిలుచుని ఉండాల్సి వస్తోందని తెలిపారు. దీనివల్ల తరగతులకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోందని, ఆలస్యం వెళ్లినందుకు ఫైన్లు కట్టాల్సి వస్తోందని వాపోయారు. మెస్ నిర్వాహకులు పనివారిని సరిపడా ఏర్పాటు చేయకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. సెలవులకు ముందు మెస్ నిర్వహణ బాగానే ఉందని, సంక్రాంతి సెలవుల తరువాతే అధ్వానంగా తయారైందని వివరించారు. జీవితాలతో ఆడుకుంటే ఎలా : ఎమ్మెల్యే ప్రతాప్ విద్యార్థుల ఇబ్బందులపై ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు స్పందిస్తూ.. మెస్ నిర్వహణ ఎందుకు సరిగా చేయడం లేదని డెరైక్టర్ హనుమంతరావును ప్రశ్నించారు. పిల్లల జీవితాలతో ఆడుకుంటే ఎలా అని నిలదీశారు. ట్రిపుల్ ఐటీని నూజివీడుకు తీసుకొచ్చింది తానేనని, ప్రతి చిన్నదానికీ జోక్యం చేసుకోవడం ఎందుకులే అని ఊరుకుంటున్నానని తెలిపారు. లోపల నిర్వహణ ఇంత దారుణంగా ఉందని ఇప్పుడే తెలిసిందని చెప్పారు. గత ఆరేళ్లుగా లేని సమస్యలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. దీనికి డెరైక్టర్ హనుమంతరావు స్పందిస్తూ మార్వెల్ మెస్ నిర్వాహకుడికి ఇంకొక మెస్‌ను కూడా ఇవ్వడానికి సిద్ధం చేశామని, రేపటి నుంచి రెండుచోట్ల రెండు వేల మందికి చొప్పున భోజనం అందించడం జరుగుతుందని వివరించారు. నాణ్యమైన భోజనం వడ్డించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మూడు సంవత్సరాలుగా యూనిఫాం ఇవ్వడం లేదని, పీయూసీ-1లో ఇచ్చిన యూనిఫాంనే ఈ-1కు వచ్చినా వేసుకోవాల్సి వస్తోందని విద్యార్థినీ విద్యార్థులు ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఆలస్యంగా తరగతులకు వెళితే ఫైన్లు వేస్తున్నారని, వాటి రూపంలో వచ్చిన లక్షలాది రూపాయలు ఏం చేస్తున్నారో అంతుబట్టడం లేదని విద్యార్థులు పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ట్రిపుల్ఐటీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ వైస్‌చాన్సలర్, చాన్సలర్ల దృష్టికి తీసుకెళతానని స్పష్టం చేశారు. దీంతో పాటు అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తానని విద్యార్థులకు తెలిపారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు బసవా భాస్కరరావు ఉన్నారు. వద్దన్న సంస్థకే కాంట్రాక్టు ఇచ్చారు మార్వెల్ సంస్థ గత ఏడాది బాసర ట్రిపుల్‌ఐటీలో మెస్ కాంట్రాక్టు నిర్వహించింది. గత ఏడాది ఏప్రిల్ 23న అప్పటి ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్య కమిషనర్‌గా ఉన్న అజయ్‌జైన్ బాసర ట్రిపుల్ఐటీకి వెళ్లిన సందర్భంలో మార్వెల్ సంస్థ నిర్వహిస్తున్న మెస్‌ను పరిశీలించారు. ఆ తరువాత అప్పటి వైస్ చాన్సలర్ ఆర్వీ రాజ్‌కుమార్‌కు దీనిపై నివేదిక ఇచ్చారు. అందులో ‘మార్వెల్ మెస్ నిర్వహణ అధ్వానంగా ఉంది. ఆహార పదార్థాల నాణ్యత ఏమాత్రం బాగోలేదు. ఇలాంటి అపరిశుభ్రంగా, అధ్వానంగా ఉన్న మెస్‌ను ఎక్కడా చూడలేదు. ఆహార పదార్థాల నాణ్యత ఏమాత్రం బాగోలేదు. విద్యార్థుల నుంచి అనేక ఫిర్యాదులు ఉన్నందున మార్వెల్ సంస్థ కాంట్రాక్టును వెంటనే రద్దుచేసి పీనల్ యాక్షన్ తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. కానీ దీనిని ఏమాత్రం పట్టించుకోకుండా వీసీ రాజ్‌కుమార్ మళ్లీ తన హయాంలోని నూజివీడు ట్రిపుల్‌ఐటీలో మూడువేల మందికి సంబంధించిన భోజనం కాంట్రాక్టును నెలరోజుల క్రితం అప్పగించడం గమనార్హం. -
‘త్రిశంకు’లో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
ఆఖరి సంవత్సరం విద్యార్థుల ఆందోళన ఫలితాల విడుదల్లో తీవ్ర జాప్యం 4న హైదరాబాద్‌లో స్నాతకోత్సవం! నూజివీడు : ట్రిపుల్ ఐటీలో చదవాలనే గ్రామీణ విద్యార్థుల ఆశ అఖరి సంవత్సరం వచ్చేనాటికి ఆవిరైపోతోంది. గ్రామీణ పేద విద్యార్థులకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ఐటీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షలు నిర్వహించి దాదాపు 3నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఫలితాలు రాకపోవడంతో ఆఖరి సంవత్సరం విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ఐటీల్లో ఆరు సంవత్సరాల ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేసిన విద్యార్థుల(తొలిబ్యాచ్) ఆఖరి సంవత్సరం ఫలితాల్లో జాప్యం నెలకొంది. హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంలో ఏం జరుగుతుందో స్థానిక ట్రిపుల్ఐటీ అధికారులకు సమాచారం లేదు. ఆరు సంవత్సరాల ఇంజినీరింగ్ విద్యలో మొదటి రెండు సంవత్సరాలను పీయూసీగా, తరువాత నాలుగు సంవత్సరాలను ఇంజినీరింగ్‌గా పరిగణిస్తారు. 2008లో ప్రారంభమైన ట్రిపుల్ఐటీలలో తొలిబ్యాచ్ ప్రస్తుతం బయటకు అడుగిడబోతోంది. అయితే వీరి చివరి సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ మూడో వారంలో జరిగినప్పటికీ నేటికీ ఫలితాలు వెలువడకపోవడం గమనార్హం. ఆఖరి సంవత్సరం ఫలితాలు వెలువడక పోవడంతో మూడు ట్రిపుల్‌ఐటీల్లోని 6వేల మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాల గురించి విద్యార్థులు ఎన్నిమార్లు అడిగినా సరైన సమాధానం చెప్పేవారు కూడా లేకపోవడంలో వారిలో అయోమయం నెలకొంది. ఫలితాలు రాకపోవడంతో క్యాంపస్ సెలక్షన్లో పలు కంపెనీలకు ఎంపికైన విద్యార్థులు ఫలితాలు వస్తే ఉద్యోగాలకు వెళ్లాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పదో తరగతి, ఇంటర్లో లక్షలాది మంది విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలను 40రోజుల్లో విడుదల చేస్తుండగా, కేవలం 6వేల మంది విద్యార్థులకు చెందిన ఫలితాలు విడుదల చేయలేకపోవడంపై ట్రిపుల్ఐటీ సిబ్బందే ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు రాకుండానే స్నాతకోత్సవమా? వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా ఫలితాలు రాకుండానే ఆగస్టు 4న హైదరాబాద్‌లో స్నాతకోత్సవం నిర్వహించడానికి ఆర్జీయూకేటీ సన్నాహాలు చేస్తోంది. ట్రిపుల్‌ఐటీల నుంచి తొలిబ్యాచ్ బయటకు వెళ్తున్న నేపథ్యంలో వారికి ఈ స్నాతకోత్సవంలో యూనివర్సిటీ డిగ్రీ పట్టాలను ప్రదానం చేయనుంది. ఒకటి రెండు రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తారేమోననే అభిప్రాయాన్ని విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. -
ఇంతలో ఎంత ఘోరం
ప్రయోజకుడవుతాడ నుకుంటే విగతజీవిగా కనిపించాడు ట్రిపుల్ ఐటీ విద్యార్థి నవీన్ తండ్రి ఆవేదన విజయవాడ, న్యూస్‌లైన్ : ‘నాన్నా.. కోర్సు పూర్తయిన వెంటనే మంచి ఉద్యోగం వస్తుంది.. నువ్వేమీ కష్టపడక్కర్లేదు అనేవాడు.. మరో నాలుగు నెలల్లో ప్రయోజకుడు అవుతాడనుకున్నా.. ఇప్పుడు విగతజీవిగా చూడాల్సి వస్తోంది..’ అంటూ నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన గజ్జల నవీన్ (21) తండ్రి కొండయ్య కన్నీరుమున్నీరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం పుప్పాలవారిగూడెం గ్రామానికి చెందిన గజ్జల కొండయ్య చిన్నపాటి కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయన ఇద్దరు కుమారులూ చదువులో మెరికలే. ప్రస్తుతం మృతిచెందిన పెద్ద కొడుకు నవీన్ స్వగ్రామం పక్కన ఉన్న కె.గోకవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో పదోతరగతి చదివి 562 మార్కులు సాధించాడు. నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు. అతని తమ్ముడు సత్యనారాయణ కూడా అదే పాఠశాలలో చదివి పదవ తరగతిలో 554 మార్కులు సాధించడంతో నూజివీడు ట్రిపుల్ ఐటీలోనే సీటు సాధించి ప్రస్తుతం నాలుగో సంవత్సరం చదువుతున్నారు. కుమారులిద్దరూ ట్రిపుల్ ఐటీలో సీటు సాధించడం, మరో నాలుగు నెలలు గడిస్తే పెద్ద కొడుకు కోర్సు పూర్తవనుండటంతో ప్రయోజకుడిగా చూస్తానని కొండయ్య ఆశ పడ్డారు. ఇంతలోనే విధి వెక్కిరించింది. వేకువ జామునే వేకువ జాయునే నాలుగు గంటలకు సహచర విద్యార్థులందరితో కలిసి నిద్రలేచిన నవీన్ అనుమానాస్పద స్థితిలో భవనం పైనుంచి కిందపడ్డాడు. తీవ్రగాయాలపాలైన అతన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. ఆస్పత్రికి వచ్చేవరకు మృతి విషయం తెలియని వైనం... తన కొడుక్కి దెబ్బ తగిలిందని సోదరుని కుమారుడు చెప్పితే అందరం కలిసి వచ్చామని, ఇక్కడికొచ్చిన తర్వాత చూస్తే విగతజీవిగా పడివున్నాడంటూ తండ్రి కొండయ్య భోరున విలపించారు. ఈ విషయం ఇంటి వద్ద ఉన్న తన భార్య లక్ష్మీ సరస్వతికి ఎలా చెప్పాలో తెలియదం లేదంటూ కుమారుని మృతదేహంపై పడి రోదించారు. అదే సమయంలో వందలాది మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అక్కడికి చేరడంతో ‘నా కొడుకు ఎలా పడ్డాడు’ అంటూ ఆవేదనతో ప్రశ్నించారు. ఈ దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది. నూజివీడు పోలీసులు అక్కడకు చేరుకుని బంధువుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.