
తాడేపల్లి : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తన నివాసంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు కలిశాఉ. శ్రీకోదండరామస్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభ పత్రికను సీఎం జగన్‌కు టీటీడీ చైర్మన్, ఈవోలు అందజేశారు.
ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ శ్రీసీతారామ కల్యాణ మహోత్సవం జరగనుంది. అదే సమయంలో ఈ నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ 09 తేదీ వరకూ ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీనిలో భాగంగా సీఎం జగన్‌ను టీటీడీ చైర్మన్, ఈవోలు కలిసి ఆహ్వాన శుభ పత్రికను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment