సాక్షి, తిరుపతి : వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబయ్యింది. కరోనా నేపథ్యంలో రోజుకు 35 వేల మందికి చొప్పున 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ కల్పించనుంది. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా 2 లక్షల మందికి దర్శన టోకెన్లు జారీ చేసింది. తిరుపతి, తిరుమలకు చెందిన స్థానికులకు లక్ష మందికి రోజుకు 10 వేల మంది చొప్పున టోకెన్లు జారీ చేసింది. వైకుంఠ ద్వార దర్శనం నిమిత్తం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గురువారం క్యూ కాంప్లెక్స్‌లో టోకెన్ తీసుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి వీఐపీల సిఫార్సు లేఖలను టీటీడీ రద్దు చేసింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎస్వీబీసీలో వేదపండితులు గీతాపఠనం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment