vikunta ekadashi
-
పిట్స్‌బర్గ్‌లో వైకుంఠ ఏకాదశి వేడుకలు!
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్‌బర్గ్‌లో వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో వేద మంత్ర పఠనం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇక ఉదయం నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని పునీతులౌతున్నారు. ఈ సందర్భంగా భక్తులు గోవింద నామస్మరణతో దేవస్థాన ప్రాంగణం ప్రతిధ్వనించింది. వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి అర్చక స్వాములు వివరించారు. ఈ సందర్భంగా ఆలయంలో అఖండ పారాయణం, అష్టోత్తర శతనామ అర్చనలు, శ్రీ వైకుంఠ గద్యం, అష్టాక్షరీ మహామంత్ర జపాలు నిర్వహించినట్లు వివరించారు. తిరుపతి వెళ్లలేని భక్తులు అమెరికాలో తొలి దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన పిట్స్‌బర్గ్‌లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని శ్రీవారి కృపకు పాత్రులు అవుతున్నారని తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లోకం సుభిక్షంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలు, భోగ భాగ్యాలతో వర్ధిల్లాలని స్వామి వారిని ప్రార్థించినట్లు అర్చక స్వాములు వివరించారు. ఇక భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గత 48 సంవత్సరాలుగా ఆలయంలో వేడుకలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం సభ్యులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి వేడుకలు దిగ్విజయంగా కొనసాగటం పట్ల నిర్వహకులతో పాటు భక్తులు తమ ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: షార్జాలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు!) -
ముక్కోటి ఏకాదశిన ఉత్తర ద్వార దర్శనమే మేలు.... ఎందుకు?
ప్రతినెలలోనూ ఏకాదశి ఉంటుంది కానీ... ఏడాదికి ఓ సారి వచ్చే వైకుంఠ ఏకాదశి మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకలా? ఈ ఏకాదశికే ప్రత్యేకంగా అన్ని పేర్లు ఎలా వచ్చాయి?. పైగా ఆరోజు ఉత్తరద్వారా దర్శనం చేసుకోవాలని అంటారు ఎందుకు?. ఆఖరికి భగవద్గీత పుట్టింది కూడా ఈ పర్వదినమే అని చెబుతుంటారు ఎందుకని? సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశి లేదా మార్గశిర శుక్లపక్షంలో వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి అంటేనే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరం. అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహంతో రాక్షస పీడ నుంచి విముక్తులు అయ్యారు. ఏకాదశి తిధినాడు దేవతలందరూ ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠంలో శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశి అని అంటారు. దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రసాదించడం వల్ల ఈ రోజుని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది అంటే.. డిసెంబరు 22 శుక్రవారం ఉదయం 9 గంటల 39 నిమిషాల తర్వాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. 23 శనివారం ఉదయం 7 గంటల 56 నిముషాలకు పూర్తవుతుంది. అయితే.. సూర్యోదయ సమయంలో ఏకాదశి తిథి ఉన్నరోజునే లెక్కలోకి తీసుకుంటారు. కాబట్టి.. ఇవాళ(డిసెంబర్ 23వ తేదీన) ముక్కోటి ఏకాదశి పర్వదినంగా జరుపుకుంటారు. ఆ రోజున తెల్లవారుజామునే ఏకాదశి ఘడియలు దాటిపోకముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం మంచిదని పండితుల వచనం. ఉత్తర ద్వారా దర్శనం ఎందుకంటే.. వికుంఠ అనే స్త్రీ నుండి అవతరించినందుకు శ్రీ మహావిష్ణువును వైకుంఠుడు అని పిలుస్తారు. ఉత్తర దిక్కున కుభేర స్వరూపంగా ఉండే అధిపతే శ్రీమహావిష్ణువు. విష్ణువు జీవులకు నియంత, జీవులకు సాక్షి, భూతముల స్వేచ్ఛావిహారాన్ని అణచేవాడు. కాబట్టి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీమహావిష్ణువును దర్శించడం అంటే ఇంద్రియాలను అణచుకొని బ్రహ్మజ్ఞ్యానమును పొందుట అని అర్ధం. అందుచేత విశేషించి ఈ రోజున భక్తులందరూ వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి ప్రదక్షిణలు ముగించుకుని దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా చేసే ప్రదక్షిణను ముక్కోటి ప్రదక్షిణ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. పూజా విధానం.. వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. ఉపవాస వ్రతం ప్రారంభించి, మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫొటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. విష్ణు పూజ చేసే సమయంలో తులసి, పుష్పాలు, గంగాజలం, పంచామృతం చేర్చాలి. సాయంకాలం వేళ తాజా పండ్లను తినొచ్చు. ఏకాదశి మరుసటి రోజున అవసరంమైన వారికి ఆహారం అందించాలి. ఈ రోజే గీతా జయంతి కూడా.. మార్గశిర మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి నాడే గీతా జయంతి కూడా జరుపుకుంటాం. మహాభారతంలోని శ్రీ కృష్ణుడు అర్జునునికి భగవద్గీతను మార్గశిర శుక్ల ఏకాదశి తిథి నాడే భోదించాడు. ఈ రోజున ప్రముఖ దేవాలయాలన్నింటిలో భతవద్గీతను పఠిస్తారు. ఈ రోజు భక్తులు విశేషంగా గీతను, విష్ణువుని పూజిస్తారు.గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది . కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం. గీకారం త్యాగరూపం స్యాత్ తకారమ్ తత్వబోధకమ్ గీతా వాక్య మిదమ్ తత్వం జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి: గీత అను రెండక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపు చున్నది. "గీ" అనే అక్షరం త్యాగాన్ని ను బోధించుచున్నది. "త" అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది. గీత అనే రెండుశబ్దములకు అర్థము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు. త్యాగశబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వసంగపరిత్యాగమనీ అర్థము వుంది. అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమనీ, బంధం నుంచి విముక్తి కలగటం అనే అర్థం కూడా వుంది. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రము ఉపదేశించుచున్నది. అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈరోజు ఆపవిత్రగ్రంథాన్ని సృజించినా మహాపుణ్యము వస్తుంది. ఇక పఠన ప్రభావాన్ని వర్ణించనలవికాదు. మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథరాజాన్ని ఈ రోజునుంచైనా పఠించటం ప్రారంభించండి. (చదవండి: భగవద్గీత: విజయవంతమైన జీవనానికి దివ్యౌషధం) -
TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం పాలకమండలి భేటీ అనంతరం ఆ నిర్ణయాలను ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం స్వర్ణమయం చేయాలని, అందుకు భక్తులు విరాళంగా ఇచ్చిన బంగారంతో తాపడం చేయించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 23వ తేదీన బాలాలయం పనులు ప్రారంభం అవుతాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అలాగే శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపైన కూడా పాలకమండలి చర్చించింది. జనవరి 2, 2023 నుంచి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం మొదలుకానుంది. 11వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వారా దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. ► అలాగే రెండో ఘాట్రోడ్లో రక్షణ గోడల నిర్మాణానికి రూ.9 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ► తిరుమల బాలాజీ నగర్లో మౌలిక వసతులకు రూ.3.70 కోట్ల మంజూరు ► తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్దికి రూ.3.75 కోట్లు మంజూరు ► టీటీడీ ఆస్పత్రుల్లో ఔషధాలు, సర్జికల్ పరికరాల కొనుగోలుకు రూ.2.86 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది టీటీడీ పాలకమండలి. -
తిరుమలేశుని వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు రావడం తెలిసిన విషయమే. ఇప్పటివరకు తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే ద్వారాలు తెరిచేవారు. దీనిద్వారా స్వామివారి దర్శనం తక్కువ మందికే దక్కేది. ఇకపై శ్రీరంగం తరహాలో పదిరోజుల పాటు తిరుమల వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. నేటి నుంచి జనవరి 3 వరకు ఉత్తర ద్వార దర్శనం జరగనుంది. ఆలయంతో అనుసంధానం వున్న 26 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, పెద్ద సంఖ్యలో భక్తుల సూచనలు, సలహాల మేరకు టీటీడీ తీసుకున్న నిర్ణయానికి భక్తులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 108 వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తర ద్వారదర్శనం శ్రీవారి ఆలయంలో వైకుంఠ ప్రదక్షణ మార్గానికి వైకుంఠ ద్వారంగా పేర్కొంటూ భక్తులను అనుమతిస్తుండగా 108 దివ్య వైష్ణవ క్షేత్రాలులో శ్రీరంగం, పార్తన్పల్లి, తిరుచ్చేరయ్, నాచియ్యార్ కోయిల్, తిరుకన్నపురం, తిరు కన్నమంగై, తిరునాగై, చక్రపాణి టెంపుల్, సారంగిపాణి ఆలయం, తిరుకన్నన్ గుడి, సిర్గాయి, తిరువలియన్ గుడి, తిరునిండ్రపూర్, తిరు అన్ బిల్, అప్పా కుడాటన్, తిరువెళ్ళరయ్యై, శ్రీవల్లి పుత్తూరు, అలగర్ కోయిల్, కూడాల్ అలగర్, తిరుముక్కురు, తిరుతంగల్, వానమామలై, కేశవ పెరుమాల్ కోయిల్, తిరునూరుమలై వంటి దివ్యదేశాలలో ఉత్తర ద్వారం వుండగా అనాది కాలంగా ఈ ఆలయాలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచుతారు. ప్రతిరోజు స్వామివారు ఈ ద్వారం నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత భక్తులను అనుమతిస్తారు. ట్రిపులికేన్, అన్నన్ కోయిల్, పురుషోత్తం కోయిల్, తిరునగరై వంటి ఆలయాల్లో ఉత్తర ద్వారం లేకపోయినా మరోవైపున మార్గాన్ని వైకుంఠ ద్వారంగా భక్తులను అనుమతిస్తూన్నారు. ఈ దివ్యదేశాలలో కూడా పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వెష్ణవ ఆలయాలలో ఆగమశాస్త్రబద్ధంగా అ«ధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు. 21 రోజులపాటు నిర్వహించే ఈ అ«ధ్యయనోత్సవాల సందర్భంగా పన్నిద్దరు ఆళ్వార్లు రచించిన నాలుగు వేల పాశురాలను వేదపండితులు ఆలయంలో పఠిస్తారు. మొదట పదిరోజులు నమ్మాళ్వైర్ మినహా మిగిలిన ఆళ్వార్లు రచించిన 2 వేల పాశురాలను పఠిస్తూండగా, మిగిలిన పదిరోజులు నమ్మాళ్వార్లు రచించిన వెయ్యి పాశురాలను 21వ రోజున ఆళ్వార్లు అందరూ రచించిన వెయ్యిపాశురాలను పఠిస్తారు. నమ్మాళ్వార్ రచించిన పాశురాలను పఠించే పది రోజులు వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ద్వారాలను తెరిచి భక్తులను అనుమతిçస్తున్నారు. టీటీడీ కూడా ప్రస్తుతం భక్తుల సౌకర్యార్థం వైష్ణవ ఆలయాల తరహాలో శ్రీవారి ఆలయంలో కూడా పదిరోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం భక్తులకు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారికి అలంకరించే పుష్పాలను వైకుంఠ ప్రదక్షణ మార్గం ద్వారా ఉరేగించి స్వామివారికి అలంకరించిన తరువాత భక్తులను అనుమతిస్తారు. - అలిదేన లక్ష్మీకాంత్, తిరుమల -
ఏపీలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
సాక్షి, అమరావతి : ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామి వారిని దర్శించు కోవడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వివిధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైఎస్ఆర్ జిల్లా.. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.భక్తుల దర్శనార్థం వైకుంఠ ద్వారంలో గరుడ వాహనంపై కోదండరాముడు కొలువు దీరాడు. తెల్లవారు జామున 5 గంటల నుంచే సీతారామ లక్ష్మణుల దర్శనం కోసం భక్తజనం పోటెత్తారు. కోదండ రామాలయం మొత్తం గోవింద నామ స్మరణతో మార్మోగిపోయింది. తూర్పు గోదావరి జిల్లా.. అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యనారాయణ స్వామిని ఉత్తరద్వారం దిశగా భక్తులు దర్శించుకుంటున్నారు. శేష పానుపు పై సత్యనారాయణ స్వామి అనంత లక్ష్మి సత్యవతి అమ్మవార్లు ఉత్తర ముఖంగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు.ఈ సందర్భంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఉత్తర ద్వారం గుండా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. విశాఖపట్నం.. సింహచల వరహా లక్ష్మీ నరసింహ స్వామి ఆయలం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు సిద్దమైంది. పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కోవిడ్ నియామాలు అనుసరించి భక్తులు దర్శనం చేసుకునేలా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.దేవస్థాన ఛైర్మన్ సంచయిత గజపతి, ట్రస్ట్ బోర్డ్ సభ్యులతో పాటు తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు. గుంటూరు.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయ అధికారులు ఉత్తర ద్వారా దర్శనం ఏర్పాటు చేశారు. ఉదయం 3.30 గంటల నుంచే భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. కోవిడ్ కారణంగా అధికారులు ఆలయంలో శంఖు తీర్థం నిలిపివేశారు.60సంవత్సరాల వృద్ధులు, 10 సంవత్సరాలు లోపు పిల్లలకి గుడిలోకి అనుమతించలేదు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్ జిల్లా .. తిరుమలేశుని తొలి గడప దేవుని కడప ఆలయానికి భక్తులు పోటెత్తారు.వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున నుంచే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వైకుంఠ ద్వారం వద్ద గరుడ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. కోవిడ్ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా.. ద్వారక తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా చిన్న వెంకన్న భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ ఉత్తర ద్వారం వైపు వెండి గరుడవాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు భక్తులు దర్శించుకుంటున్నారు. సాధారణ, విఐపి భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయగా.. క్యూలైన్లన్ని గోవిందనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. -
వైకుంఠ వేడుకకు తిరుమల ముస్తాబు
సాక్షి, తిరుపతి : వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబయ్యింది. కరోనా నేపథ్యంలో రోజుకు 35 వేల మందికి చొప్పున 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ కల్పించనుంది. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా 2 లక్షల మందికి దర్శన టోకెన్లు జారీ చేసింది. తిరుపతి, తిరుమలకు చెందిన స్థానికులకు లక్ష మందికి రోజుకు 10 వేల మంది చొప్పున టోకెన్లు జారీ చేసింది. వైకుంఠ ద్వార దర్శనం నిమిత్తం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గురువారం క్యూ కాంప్లెక్స్‌లో టోకెన్ తీసుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి వీఐపీల సిఫార్సు లేఖలను టీటీడీ రద్దు చేసింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎస్వీబీసీలో వేదపండితులు గీతాపఠనం చేయనున్నారు. -
తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు
సాక్షి, తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులె పోటెత్తుతున్నారు. కాగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కోసం టీటీడీ ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసింది. వైకుంఠం కాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యానవనం సహా నాలుగు మాడ వీదుల్లో 90 వేలకు పైగా భక్తులు వేచి ఉన్నారు. సోమవారం తెల్లవారుజాము 2గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని టీటీడీ తెలిపింది. ఈ సందర్భంగా వీవీఐపీల దర్శనానంతరం సామాన్య భక్తులకు అనుమతించనున్నారు. ధనుర్మాసకైంకర్యాల అనంతరం తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు ఈ నెల 8వరకు అదే ద్వారా గుండా భక్తులను అనుమతించనున్నారు. కాగా స్వామి వారి సర్వదర్శనం మినహా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. అలాగే సోమవారం స్వామివారిని స్వర్ణ రథంపై తిరువీధుల్లో తిప్పనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో టీటీడీ పాలక మండలి సమావేమయి వైకుంఠ ద్వారాలు ఎన్ని రోజులు తెరిచి ఉంచాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఉచిత లడ్డూ ప్రసాదంపై కూడా పాలకమండలి నిర్ణయం తీసుకోనుంది. -
గన్‌తో కాల్చేస్తానంటూ భక్తులను బెదిరించిన ఎస్సై
తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ వైకుంఠ దైవాన్ని దర్శించుకునేందుకు సుదూరాల నుంచి వచ్చిన భక్తులతో ఓ ఎస్సై అనుచితంగా ప్రవర్తించాడు. చిన్న సమాచారం అడిగిన పాపానికి భక్తులపై అంతెత్తుఎగిరిపడ్డ ఆ ఎస్సై.. సర్వీస్ రివాల్వర్ చూపించి కాల్చిపారేస్తానంటూ బెదిరించాడు. సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. ఏకాదశి సందర్భంగా విజయవాడకు చెందిన కొందరు భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. జేఈవో ఆఫీసుకు ఎలా వెళ్లాలో తెలియక.. పక్కనే ఉన్న ఎస్ఐ నాగేశ్వర్ ను అడిగారు. అంతే, కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో భక్తులపై విరుచుకుపడ్డారు ఎస్సై నాగేశ్వర్. సర్వీస్ రివాల్వర్ బయటికి తీసి కాల్చేస్తానని బెదిరించాడు. ఎస్సై చర్యను నిరసిస్తూ భక్తులు వాగ్వాదానికి దిగారు. అక్కడికక్కడే రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ డీఎస్సీ భక్తులకు సర్దిచెప్పి పంపించారు. సదరు ఎస్సై నాగేశ్వర్.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిప్యూటేషన్ పై తిరుమలలో విధులు నిర్వర్తిస్తున్నారు.