చిత్తూరు : తన భర్త మృతిపట్ల అనుమానాలున్నాయని, న్యాయం చేయాలని కోరిన మహిళపై దాడిచేశారనే ఆరోపణలపై ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్ సస్పెండ్ చేశారు. వివరాల ప్రకారం..వాల్మీకిపురం మండలంలోని చింతపర్తి పంచాయతీ, కోటపల్లెకు చెందిన గొర్రెలకాపరి రవి (27) గత శుక్రవారం మృతి చెందాడు. అయితే తన భర్తను అదే గ్రామానికి చెందిన ధనశేఖర్‌రెడ్డి చంపేశాడని, అప్పు తీర్చకపోవడమే ఇందుకు కారణమంటూ మృతుడి భార్య రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసును రాజీ చేసుకోవాలంటూ జయచంద్ర, రామచంద్ర అనే ఇద్దరు కానిస్టేబుళ్లు తనను లాఠీలతో కొట్టారని రమాదేవి పేర్కొన్నారు. నిందితుడు ధనశేఖర్‌రెడ్డిని అరెస్టు చేయకపోగా.. మృతుడి తల్లి రాజమ్మ, భార్య రమాదేవిలను తీసుకెళ్లి హింసించారంటూ ప్రజాసంఘాలు గురువారం మదనపల్లెలో ధర్నా నిర్వహించాయి. దీనిపై ఎస్పీ సెంథిల్‌కుమార్ సీరియస్ అయ్యారు. మహిళలను కొట్టారనే ఆరోపణలపై వాల్మీకిపురం స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. (దళిత యువకుడిపై చేయి చేసుకున్న ఎస్‌ఐ, ఏఎస్‌ఐ)
Comments
Please login to add a commentAdd a comment